
మన టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఏ హీరో కి అయినా కేవలం సినిమాలను చూసి మాత్రమే ఫాన్స్ అవుతూ ఉంటారు..కానీ పవన్ కళ్యాణ్ విషయం లో సినిమాలు చూసి ఫాన్స్ అయినా వారికంటే, ఆయన వ్యక్తిత్వం, దయాగుణం ని చూసి ఫాన్స్ అయినా వారి సంఖ్యనే ఎక్కువ..అందుకే హిట్స్ మరియు ఫ్లాప్స్ కి ఆతీతంగా ఆయన క్రేజ్ ప్రతి ఏడాది పెరగడమే తప్ప తరగదు అని ఇండస్ట్రీ లో వినిపించే వార్త..ఇక దాన గుణం లో పవన్ కళ్యాణ్ ఎంత గొప్పవాడో మన అందరికి తెలిసిందే..ఆపద లో ఉన్నవారికి సహాయం చెయ్యడం లో ఎప్పుడు ముందు ఉండే హీరోలలో ప్రథముడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..కెరీర్ పీక్ స్టేజి లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి అడుగు పెట్టి ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్న ఆయన..వ్యక్తిగతంగా కూడా ఎంతో మంది జీవితాల్లో వెలుగుని నింపాడు..తన అకౌంట్ లో కోటి రూపాయిలు ఉన్న సమయం లో కూడా 50 లక్షలకు పైగా విపత్తు సమయం లో దానం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి..ఇలా ఆయన చేసిన సహాయాలు గురించి చెప్పుకుంటూ పోతే ఈ ఒక్క ఆర్టికల్ సరిపోదు..ఏకంగా బుక్ రాయాల్సి వస్తుంది.
తన తండ్రి అడుగు జాడల్లో చిన్న వయస్సు నుండే నడుస్తున్నాడు అకిరా నందన్..అతను చేసిన సేవ కార్యక్రమాల గురించి సోషల్ మీడియా లో సిర్క్యులేట్ అవుతున్న ఒక్క వార్త అకిరా నందన్ ఎంత గొప్ప వ్యక్తిత్వం గల మనిషో అనేది అర్థం అయ్యేలా చేస్తుంది..అకిరా నందన్ కి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు ఇటీవల కాలం లో బాగా వైరల్ అయినా సంగతి మన అందరికి తెలిసిందే..అలాగే ఇటీవలే అకిరా ఆనందం తన స్కూల్ లో గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేసుకున్న సందర్భం లో ఆయనకీ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి..ఈ సందర్భంగా స్కూల్ లో అకిరా నందన్ చేసిన సేవ కార్యక్రమాల గురించి అతని టీచర్లు చెప్పిన కొన్ని మాటలు పవన్ కళ్యాణ్ అభిమానుల చేత శబాష్ అనిపించేలా చేస్తుంది..అసలు విషయానికి వస్తే కరోనా కాలం లో అకిరా నందన్ ఎంతో మంది కి సహాయం చేసాడట..హాస్పిటల్స్ కి ఆక్సిజన్ సీలిండర్లు సరఫరా చేయడం..ఉద్యొగాలు లేక రాదు మీద పడిన ఎంతో మంది కి ఆర్హిక సహాయాలు చెయ్యడం వంటివి అకిరా నందన్ చాలానే చేసాడట.
అలా అకిరా నందన్ చేసిన సేవ కార్యక్రమాల గురించి ఆయన టీచర్లు చెప్పగానే ఆడిటోరియం మొత్తం చప్పట్లోతో దద్దరిల్లిపోయింది..ఇది ఇలా ఉండగా అకిరా నందన్ పూర్తి గా శాఖాహారి అట..సున్నిత మనస్తత్వం కలిగిన అకిరా నందన్ చిన్న చీమ కి కూడా హాని చేసే రకం కాదు అని , తన తండ్రి పవన్ కళ్యాణ్ మనస్తత్వం కి డిట్టో కాపీ అకిరా నందన్ అని టీచర్లు కొనియాడారు..ఇది ఇలా ఉండగా అకిరా నందన్ కి మొదటి నుండి మ్యూజిక్ అంటే చాలా ఆసక్తి అని అతని తల్లి రేణు దేశాయ్ పలు సందర్భాలలో సోషల్ మీడియా లో తెలిపిన సంగతి మన అందరికి తెలిసిందే..నిన్న అకిరా నందన్ ఫంక్షన్ లో పియానో వాయంచిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది..#RRR సినిమాలోని దోస్తీ సాంగ్ ని పియానో ద్వారా వాయించిన అకిరా నందన్ ని చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు మురిసిపోతున్నారు..చూడడానికి హాలీవుడ్ హీరో రేంజ్ కటౌట్ ఉన్న అకిరా నందన్ ఎప్పుడు టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇస్తాడో అని పవన్ కళ్యాణ్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.