Home Entertainment థియేటర్స్ లో డిజాస్టర్ ఫ్లాప్..కానీ ఓటీటీ లో #RRR రికార్డునే కొట్టేసింది

థియేటర్స్ లో డిజాస్టర్ ఫ్లాప్..కానీ ఓటీటీ లో #RRR రికార్డునే కొట్టేసింది

2 second read
0
1
1,180

సినీ రంగం లో అయినా రాజకీయ రంగంలో అయినా మరే రంగంలోనైనా సరే ఎల్లప్పుడూ సక్సెస్ లు ఉండవు..ఫెయిల్యూర్స్ కూడా ఉండవు..ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి పరిస్థితి దీనిని ఉదాహరించుకోవడానికి పనికి వస్తుంది..పదేళ్లు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150 ‘ సినిమా తీస్తే జనాలు ఎగబడిమరీ చూసారు..బాహుబలి తర్వాత తెలుగునాట వంద కోట్ల రూపాయిల షేర్ మార్కు ని కొల్లగొట్టిన ఏకైక సినిమాగా అది నిలిచింది..ఆ తర్వాత ఆయన తీసిన సై రా నరసింహా రెడ్డి చిత్రం కూడా సంచలన విజయం సాధించింది..కానీ ఈ ఏడాది విడుదలైన ఆచార్య సినిమా మాత్రం మెగాస్టార్ కెరీర్ ని గట్టిగా దెబ్బ తీసింది..ఆ సినిమా తర్వాత వచ్చిన గాడ్ ఫాదర్ చిత్రానికి అయితే టాక్ వచ్చినప్పటికీ కూడా వసూళ్లు రాలేదు..ఆచార్య సినిమా మీద ఒక ఆరు కోట్ల రూపాయిల షేర్ ఎక్కువ కలెక్ట్ చేసింది అంతే..ఇలా చిరంజీవి కెరీర్ లో ఎప్పుడు జరగలేదు.

ఎందుకంటే చిరంజీవి ఎంత చెత్తసినిమా తీసిన కూడా మొదటి మూడు రోజులు థియేటర్స్ అన్నీ హౌస్ బోర్డ్స్ తో నిండిపోతాయి..కానీ గడిచిన రెండు చిత్రాలలో అదే కరువైంది..ఆచార్య సినిమా అంటే డిజాస్టర్ టాక్ వచ్చింది కాబట్టి కలెక్షన్స్ రాలేదు అనుకోవచ్చు..కానీ గాడ్ ఫాదర్ కి సూపర్ హిట్ టాక్ వచ్చి కూడా డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం ఏంటి అని ట్రేడ్ విశ్లేషకులు సైతం తలలు పీకుతున్నారు..అదంతా రీమేక్ వల్లే అని అభిమానులు బలంగా నమ్ముతున్నారు..అయితే ఈమధ్యనే ఈ సినిమా ఓటీటీ విడుదలైంది..రెస్పాన్స్ ఊహాతీతంగా వచ్చింది..ఇంత రెస్పాన్స్ వస్తుందని బహుశా ఫ్యాన్స్ కూడా ఊహించి ఉండరు..కంటిన్యూ గా ఈ సినిమా రెండు వారల నుండి నెట్ ఫ్లిక్స్ లో టాప్ 1 స్థానం లో ట్రెండ్ అవుతూ వస్తుంది..అది కూడా తెలుగు వెర్షన్ కాదండోయ్..హిందీ వెర్షన్..రెండు వారాల పాటు నెంబర్ 1 గా నిలిచినా తెలుగు సినిమాలు కేవలం రెండే..ఒకటి RRR కాగా మరొకటి గాడ్ ఫాదర్.

అలా థియేటర్స్ లో డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచిన ఈ చిత్రం..OTT లో మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది..ఇది కొత్తేమి కాదు..గతం లో కూడా ఇలా థియేటర్స్ లో ఫ్లాప్ అయినా సినిమాలు OTT లో సూపర్ హిట్ గా నిలిచాయి..ఆ కోవలోకి ఇప్పుడు గాడ్ ఫాదర్ కూడా చేరిపోయింది..ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బాబీ దర్శకత్వం లో వాల్తేరు వీరయ్య అనే సినిమా చేస్తున్నాడు..శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది..ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ కి మరియు పాటకి మంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..మరి ఈ చిత్రం గత రెండు సినిమాలతో గాయపడిన మెగా ఫాన్స్ కి సరికొత్త ఊపిరి పోస్తుందా లేదా అనేది తెలియాలంటే మరో నెల ఎదురు చూడాలిసిందే..ఈ సినిమాలో చిరంజీవి తో మాస్ మహారాజ రవితేజ కూడా ఒక ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

సింగర్ వాణి జయరాం మృతి పై తలెత్తుతున్న అనుమానాలు..!

కన్నడతో పాటు పలు భాషల్లో 10,000కు పైగా పాటలు పాడిన నటి వాణీ జయరామ్ ఈరోజు (ఫిబ్రవరి 4) చెన్…