Home Entertainment థియేటర్స్ లో ‘అన్ స్టాపబుల్’ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్..టికెట్ ధర ఎంతో తెలిస్తే మీకు ఫ్యూజులు ఎగిరిపోతాయి

థియేటర్స్ లో ‘అన్ స్టాపబుల్’ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్..టికెట్ ధర ఎంతో తెలిస్తే మీకు ఫ్యూజులు ఎగిరిపోతాయి

0 second read
0
1
10,110

ఇన్నేళ్ల సినీ కెరీర్ లో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా టాక్ షోస్ లో పాల్గొనలేదు..తన సినిమాలకు ప్రొమోషన్స్ వంటివి చేసుకోవడం కూడా చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాము..ఈ రెండు దశాబ్దాలలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూస్ అన్నీ కలిపితే కనీసం 5 కూడా ఉండవు..ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ ని కూడా జరపడానికి ఆయన పెద్దగా ఆసక్తి చూపించడు..అలాంటి పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా ఒక టాక్ షో కి ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నాడు.

ఆ టాక్ షో మరేదో కాదు..ఆహా మీడియా లో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ప్రోగ్రాం..ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ ని డిసెంబర్ 27 వ తారీఖున అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిపారు..దానికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో ట్రెండ్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..ఎంత మంది సెలెబ్రిటీలు ఈ షో కి వెళ్లినా, పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు రెస్పాన్స్ మాత్రం ఏ సెలబ్రిటీ కి రాలేదు.

ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఎప్పుడు విడుదల చెయ్యబోతున్నారు అనేదానిపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటి వరకు రాలేదు కానీ,ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ఒక గాసిప్ ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది..అదేమిటి అంటే ఈ ఎపిసోడ్ ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్స్ అన్నిట్లో లైవ్ టెలికాస్ట్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారట ఫ్యాన్స్..పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఏ చిన్న విషయమైనా ఒక పండుగలాగా జరుపుకునే అలవాటు ఉన్న ఫ్యాన్స్ కి ఈ ఎపిసోడ్ ని కూడా అదే ప్లాన్ చెయ్యాలని చూస్తున్నారు.

ఇటీవలే పవన్ కళ్యాణ్ కెరీర్ లో మైలు రాయిగా నిలిచిపోయిన ‘ఖుషి’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చెయ్యగా , ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో మన అందరం చూసాము..మళ్ళీ అలాంటి అద్భుతానికి తెరలేపేందుకు ఫ్యాన్స్ సమాయత్నం అవుతున్నారు..చూడాలి మరి ఈ ఎపిసోడ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలమి ప్రకంపనలు సృఙిష్టించబోతుందో అనేది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

రామ్ చరణ్ కోసం చేసిన అప్పులను పూడ్చేసిన ‘వారసుడు’ సినిమా

‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్‌లో చిరంజీవి ఓ మాట చెబుతూనే ఉన్నారు. ‘సరిగ్గ…