
ఇప్పుడు ఒక సినిమా హిట్ అని ఎలా చెప్తున్నం అంటే ,ఆ మూవీ మొదటి వారం కలెక్షన్స్ బట్టి డిసైడ్ చేస్తున్నం ,కానీ అప్పట్లో ఒక సినిమా ఎన్ని రోజులు థియేటర్ లో ఆడితే అంత పెద్ద హిట్ అని చెప్పుకునే వాళ్ళం,కానీ ఇప్పుడు అంత మారిపోయింది ,1st రోజు కలెక్షన్ ఎంత ? 1st వారం కలెక్షన్స్ ఎంత సాధించింది అనే దాని మీద ఇప్పుడు మూవీ హిట్ or ప్లాప్ అని అంటున్నారు.ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఒక మూవీ థియేటర్ లో 50 డేస్ రన్ చూడాలని అనుకున్న చాల కష్టం,OTT ప్రభావం పెద్ద పెద్ద సినిమాల మీద కూడా పడుతుంది.సినిమా రీలీజ్ అయినా 3 ,4 వారం కి అంత OTT లో స్ట్రీమింగ్ అవుతుంది.
కానీ అప్పట్లో ఒక రేంజ్ లో రోజులు తరపడి థియేటర్ లో రన్ అయినా మూవీస్ లిస్ట్ మీ కోసం .అందులో టాప్ 10 మూవీస్ లిస్ట్.
గమనిక ; ఈ లిస్ట్ లో ఉన్న సినిమా లు షిఫ్టింగ్ థియేటర్ కింద ఇన్ని డేస్ రన్ అయ్యాయి.
1 .లెజెండ్
నందమూరి బాలకృష్ణ ,మాస్ డైరెక్టర్ బోయపాటి శీను దర్శకత్వం లో వచ్చిన లెజెండ్(2014 ) , బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి పొద్దుటూరు అర్చన థియేటర్లో లో 1005 డేస్ ఆడింది.
2 .మగధీర
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ,దర్శక ధీర రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన మగధీర (2009 ), అప్పటి వరకు ఉన్న అన్ని ఇండస్ట్రీ రికార్డ్స్ ని బ్రేక్ చేసి మొదటి స్థానం లో నిలబడింది.ఈ సినిమా నుంచి రాజమౌళి ,రామ్ చరణ్ కెరీర్ పీక్స్ కి వెల్లింది అనడం లో సందేహమే లేదు.కర్నూల్లోని ఒక థియేటర్లో 1001 డేస్ ఆడింది.
౩.పోకిరి
సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు సెన్సషనల్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కలయిక లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పోకిరి (2006 )..75 సంవత్సరాల తెలుగు సినీ ఇండస్ట్రీ లో ఉన్న అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసి మొదటి 40 కోట్లు నెట్ కలెక్షన్స్ సాధించిన మొదటి మూవీ పోకిరి..కర్నూల్ లో ని ఒక థియేటర్ లో 1000 డేస్ ఆడింది.
4 .మంగమ్మ గారి మనవడు
బాలయ్య బాబు కెరీర్ లో మొదటి మేజర్ బ్లాక్ బస్టర్ హిట్ అయినా మంగమ్మ గారి మనవడు(1984 ) కాచిగూడ లోని తారక రామ థియేటర్లో 567 డేస్ ఆడింది.
5 .మరో చరిత్ర
కమలహాసన్ మరియు బాలచందర్ కంబినేషనల్ వచ్చిన క్లాసికల్ లవ్ స్టోరీ..లవ్ స్టోరీస్ లో కల్ట్ క్లాసిక్ అయినా మరో చరిత్ర(1978 ) అప్పట్లో ఒక థియేటర్లో 556 డేస్ఆడింది.
6 .ప్రేమాభిషేకం
అక్కినేని నాగేశ్వర రావు ,లెజెండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావు గారి కంబినేషనల్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ప్రేమాభిషేకం(1981).గుంటూరు,వైజాగ్,విజయవాడ లో 300 రోజులు పైగా ఆడింది.అందులో ఒక థియేటర్ లో 533 రోజులు వరకు ఆడింది.
7 .లవ కుశ
నందమూరి తారకరామారావు మరియు సి.పుల్లయ్య ,సి.ఎస్ రావు దర్శకత్వం లో వచ్చిన అల్ టైం బ్లాక్ బస్టర్ హిట్ మూవీ లవకుశ (1963).అప్పట్లో ఆంధ్రప్రదేశ్ లో ని ఒక థియేటర్ లో 1111 రోజులు ఆడింది.
8 .ప్రేమ సాగరం
తమిళ స్టార్ హీరో శింబు నాన్న గారు అయినా T .రాజేందర్ నటించి తానే దర్శకత్వం వహించిన మూవీ ప్రేమ సాగరం (1983).అప్పట్లో యువత ని ఒక ఊపు ఊపిన మూవీ ప్రేమ సాగరం.ఆంధ్ర ప్రదేశ్ లో ని ఒక థియేటర్ లో 465 రోజులు ఆడింది.
9 .వేటగాడు
నందమూరి తారకరామారావు మరియు రాఘవేంద్ర రావు గారి కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ వేటగాడు(1979).ఆంధ్ర ప్రదేశ్ లోని ఒక థియేటర్ లో 408 రోజులు ఆడింది.
10 .అడవి రాముడు
నందమూరి తారకరామారావు మరియు రాఘవేంద్ర రావు గారి కాంబినేషన్లో వచ్చిన మరో బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అడవి రాముడు (1977).ఆంధ్ర ప్రదేశ్ లోని ఒక థియేటర్ లో 365 రోజులు ఆడింది.