Home Entertainment తెలుగు లో కోటి రూపాయలకు కొన్నారు ..ఎంత వసూళ్లు రాబట్టిందో తెలుసా

తెలుగు లో కోటి రూపాయలకు కొన్నారు ..ఎంత వసూళ్లు రాబట్టిందో తెలుసా

2 second read
0
0
499

ఈ ఏడాది వరుసగా పాన్ ఇండియా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద దండయాత్ర చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఒక్క రాధే శ్యామ్ సినిమా మినహా మిగిలిన పాన్ ఇండియా సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద విద్వాంసం సృష్టించాయి..వాటిల్లో #RRR , KGF చాప్టర్ 2 మరియు విక్రమ్ వంటి సినిమాలు సృష్టించిన బాక్స్ ఆఫీస్ సునామి ని అంత తేలికగా ఇప్పట్లో ఎవ్వరు మర్చిపోలేరు..ఇక ఈ సినిమాలు సృష్టించిన ప్రభంజనాలు చూసి పాన్ ఇండియా సినిమాలు తియ్యడానికి దర్శక నిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు..అలా పాన్ ఇండియా లెవెల్ లో మంచి అంచనాలను ఏర్పర్చిన సినిమా కన్నడ హీరో సుదీప్ నటించిన విక్రాంత్ రానా అనే చిత్రం..భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ మరియు పాటలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకొని సినిమా పై విపరీతమైన అంచనాలు పెంచేలా చేసింది..ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాకి మొదటి రోజు మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ వచ్చింది..ఓపెనింగ్స్ అన్ని అబీషలలో అదిరిపోయాయి..కేవలం సుదీప్ కెరీర్ లో మాత్రమే..కన్నడ చలన చిత్ర పరిశ్రమ లోనే ఆల్ టైం టాప్ 3 ఓపెనింగ్స్ సాధించిన సినిమాలలో ఒకటిగా నిలిచింది.

మొత్తం మీద ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 28 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..ఈ స్థాయి వసూళ్లు ఇప్పటి వరుకు అక్కడ KGF చాప్టర్ 2 మరియు జేమ్స్ సినిమాలు మాత్రమే వసూలు చేసాయి..ఆ రెండు సినిమాల తర్వాత ఆ స్థాయి వసూళ్లను రాబట్టిన సినిమా ఇదే..టాక్ బాగుండడం తో ఈ సినిమా ఫుల్ రన్ కూడా అదిరిపొయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది..ఇక తెలుగు లో అయితే ఈ సినిమాని కేవలం కోటి 20 లక్షల రూపాయలకు మాత్రమే కొనుగోలు చేసారు..కానీ ఈ సినిమా మొదటి రోజే కోటి 6 లక్షల రూపాయిలు వసూలు చేసి 90 శాతం బ్రేక్ ఈవెన్ ని మొదటి రోజే అందుకుంది..ఇక రెండవ రోజు నుండి పూర్తి స్థాయి బ్రేక్ ఈవెన్ సాధించి ఫుల్ రన్ లో 6 కోట్ల రూపాయిలు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..అంటే పెట్టిన డబ్బులకు 6 రేట్లు లాభాలు అన్నమాట..ఇటీవల కాలం లో తెలుగు సినిమాలకంటే డబ్బింగ్ సినిమాలే ఎక్కువ వసూలు చెయ్యడం విశేషం.

ఇటీవలే విడుదలైన విక్రమ్ సినిమా కూడా ఇదే రేంజ్ హిట్..ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ హీరో నితిన్ కేవలం 6 కోట్ల రూపాయలకు మాత్రమే కొనుగోలు చేసాడు..కానీ ఫుల్ రన్ లో ఈ చిత్రం 18 కోట్ల రూపాయలకు పైగానే షేర్ ని వసూలు చేసింది..ఇప్పుడు విక్రాంత్ రోనా కూడా అదే స్థాయిలో హిట్ అవ్వడం విశేషం..ఈ ఏడాది విడుదలైన స్టార్ హీరోల సినిమాలలో రాధే శ్యామ్ మరియు ఆచార్య సినిమాలు మినహా అన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి..కానీ మీడియం రేంజ్ సినిమాలలో ఒక్క మేజర్ సినిమా తప్ప ఏది విజయం సాధించలేదు..అన్ని ఫ్లాప్స్ గా నిలిచాయి..అలాంటి గడ్డుకాలం ఎదురుకుంటున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ఇప్పుడు డబ్బింగ్ సినిమాలే ఆదుకోవడం విశేషం..మరో పక్క మన టాలీవుడ్ నిర్మాతలు సినిమాలు సరిగా ఆడట్లేదు అని షూటింగ్స్ ఆపేసారు..కానీ డబ్బింగ్ సినిమాలనే జనాలు చూసినప్పుడు..సరైన సినిమా తీస్తే జనాలు ఎందుకు చూడరు అంటూ ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…