
తెలుగు బుల్లితెర పై ప్రభంజనం సృష్టించిన రియాలిటీ షో బిగ్ బాస్..ఇప్పటికే 5 సీసన్స్ ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇటీవలే OTT వెర్షన్ సీసన్ ని కూడా పూర్తి చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సీసన్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఇప్పుడు బిగ్ బాస్ 6 టెలివిజన్ వెర్షన్ అతి త్వరలోనే ఘనంగా ప్రారంభం కాబోతుంది..ఆగస్టు నెల నుండి ఈ రియాలిటీ షో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి..అయితే ఈసారి జరగబొయ్యే సీసన్ కి అక్కినేని నాగార్జున హోస్ట్ గా ఉండబోవట్లేదట..ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే బిగ్ బాస్ OTT ఫైనల్స్ అప్పుడు తెలియచేసాడు..బిగ్ బాస్ సీసన్ 3 నుండి సీసన్ 5 మరియు OTT వెర్షన్ కి కలిపి మొత్తం నాలుగు సీసన్స్ కి నాగార్జున గారు వ్యాఖ్యాతగా వ్యవహరించారు..స్టార్ మా ఛానల్ తో ఆయన చేసుకున్న అగ్రిమెంట్ బిగ్ బాస్ OTT తోనే అయిపోయింది..ఇప్పుడు ఆయన కొద్దీ రోజులు బిగ్ బాస్ షో కి బ్రేక్ తీసుకోవడం మంచిది అనే బావనలోకి వచ్చారట.
నాగార్జున గారు తీసుకున్న ఈ నిర్ణయం తో ఇప్పుడు సీసన్ 6 కోసం వేరే హోస్ట్ ని ఎవరిని తీసుకోవాలనే ఆలోచనలో పడ్డారట స్టార్ మా టీం..అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నాగార్జున గారి మాజీ కోడలు సమంత బిగ్ బాస్ సీసన్ 6 కి హోస్ట్ గా వ్యవహరించబోతుందని తెలుస్తుంది..ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ చూడాలి..ఇది కాసేపు పక్కన పెడితే ఈ షో లో ఈసారి పాల్గొనే కంటెస్టెంట్స్ బుల్లితెర మీద మంచి క్రేజ్ ఉన్నవారేనట.వారిలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు సుడిగాలి సుధీర్..ఈయనకి బుల్లితెర మీద ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ప్రస్తుతం నడుస్తున్న ఎంటర్టైన్మెంట్ షోస్ అన్నిట్లో సుధీర్ లేని షో అంటూ ఏది లేదని చెప్పొచ్చు..అంతతి క్రేజ్ ఉన్న సుడిగాలి సుధీర్ ఈ రియాలిటీ షో పాల్గొనబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి..ఇందుకోసం ఆయనకీ రికార్డు స్థాయి రెమ్యూనరేషన్ ని కూడా స్టార్ మా యాజమాన్యం ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది..ఇక సుడిగాలి సుధీర్ తో పాటు యాంకర్ వర్షిణి మరియు దీపికా పిల్లి కూడా ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో లో పాల్గొనబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..ఈ ముగ్గురు కలిసి గతం లో ఈటీవీ లో ప్రసారం అయ్యే ఢీ షో లో స్కిట్స్ చేసేవారు..ఇప్పుడు మళ్ళీ ఈ ముగ్గురు కలిసి ఈ రియాలిటీ షో లో కంటెస్టెంట్స్ గా పాల్గొనబోవడం విశేషం.
ఇక వీరితో పాటు స్టార్ మా లో సంచలనం విజయం సాధించిన పాపులర్ సీరియల్ ‘కార్తీక దీపం’ డాక్టర్ బాబు నిరుపమ్ కూడా ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది..వీరితో పాటుగా సీనియర్ యాంకర్ ఉదయ భాను, సీరియల్ హీరోయిన్ నవ్య స్వామి , జబర్దస్త్ కమెడియన్ చమ్మక్ చంద్ర తో పాటుగా బిగ్ బాస్ 4 లో టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచిన అరియనా కూడా సీసన్ 6 లో మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది..అయితే ఈసారి సీసన్ 6 లో కేవలం సెలబ్రిటీస్ మాత్రమే కాకుండా, సామాన్య ప్రజలకు కూడా కంటెస్టెంట్స్ గా పార్టిసిపేట్ చేసే అవకాశం ని కలిపిస్తున్నారట స్టార్ మా యాజమాన్యం..బిగ్ బాస్ సీసన్ 2 కి కూడా ఇలానే చేసారు..అప్పట్లో గణేష్, సంజన మరియు నూతన నాయుడు వంటి సామాన్యులు హౌస్ లోకి అడుగుపెట్టగా గణేష్ మరియు నూతన్ నాయుడు చాలా కాలం వరుకు దిగ్విజయం గా కొనసాగగా..సంజన మాత్రం మొదటిలో వారం లోనే ఎలిమినేట్ అయ్యింది..ఇలా ఎన్నో విశేషాలతో రాబోతున్న బిగ్ బాస్ సీసన్ 6 కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు..దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే రాబోతుంది.