Home Entertainment తెలుగులో డిజాస్టర్ ఫ్లాప్..హిందీ లో సూపర్ హిట్..3 రోజుల్లో లైగర్ అక్కడ ఎంత చేసిందో తెలుసా?

తెలుగులో డిజాస్టర్ ఫ్లాప్..హిందీ లో సూపర్ హిట్..3 రోజుల్లో లైగర్ అక్కడ ఎంత చేసిందో తెలుసా?

0 second read
0
0
1,437

విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో భారీ అంచనాల నడుమ విడుదలైన లైగర్ సినిమా ఇటీవలే విడుదలై భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచినా సంగతి మన అందరికి తెలిసిందే..టీజర్ మరియు ట్రైలర్ తో అభిమానుల్లో ఒక రేంజ్ అంచనాలను రేపిన ఈ చిత్రానికి మొదటి రోజు అద్భుతమైన ఓపెనింగ్ వచ్చినప్పటికీ రెండవ రోజు నుండి వసూళ్లు అతి దారుణంగా పడిపోవడం ఆ సినిమాని కొన్న బయ్యర్స్ కి మింగుడుపడని పరిస్థితి ఏర్పడింది..ఆగస్టు నెలలో వరుసగా భింబిసారా , సీతరామం మరియు కార్తికేయ 2 వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి లాభాల్లోకి వచ్చిన తెలుగు సినిమా ఇండస్ట్రీకి లైగర్ సినిమా చావు దెబ్బ కొట్టింది అనే చెప్పాలి..ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అన్నీ భాషలకు కలిపి దాదాపుగా 90 కోట్ల రూపాయిల వరుకు జరిగింది..ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ని బట్టి చూస్తూ ఉంటె ఫుల్ రన్ లో తెలుగు వెర్షన్ కనీసం 20 కోట్ల రూపాయిల షేర్ కూడా వసూలు చేసేలా కనిపించడం లేదు.

ఇక్కడ డిజాస్టర్ వసూళ్లు వస్తున్నప్పటికీ హిందీ వెర్షన్ లో మాత్రం పర్వాలేదు అనే రేంజ్ లో ఉంది..ఒక్క రోజు ఆలస్యం గా విడుదలైన ఈ సినిమాకి నెగటివ్ బాగా వచ్చినప్పటికీ కూడా హిందీ నాలుగు కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను మొదటి రోజే రాబట్టింది..ఒక విధంగా చెప్పాలంటే ఈ స్థాయి ఓపెనింగ్ అక్కడ మన స్టార్ హీరోలకు దక్కడం కూడా చాలా కష్టం..అల్లు అర్జున్ హీరో గా నటించిన పుష్ప సినిమాకి హిందీ లో మొదటి రోజు కేవలం కోటి 70 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు మాత్రమే వచ్చాయి..కానీ లైగర్ సినిమాకి మాత్రం అక్కడ పుష్ప కంటే నాలుగు రేట్లు వసూళ్లను రాబట్టడం అంటే విజయ్ దేవరకొండ కి బాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందొ అర్థం చేసుకోవచ్చు..సరైన సినిమా తో ఆయన అక్కడకి వెళ్లి ఉంటె కుంభస్థలం ని బద్దలు కొట్టే రేంజ్ రికార్డ్స్ ని పెట్టేవాడంటూ ట్రేడ్ వర్గాలు అంచనా
వేస్తున్నాయి..లైగర్ సినిమాతో తనకి అంత అద్భుతమైన ఛాన్స్ వచ్చింది అని..పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ ఆశల మీద నీళ్లు చల్లాడని అభిమానులు ఆరోపిస్తున్నారు.

ఇక వీకెండ్ వసూళ్లు కూడా పర్వాలేదు అని అనిపించే రేంజ్ లోనే వస్తున్నాయి..ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ హిందీ వెర్షన్ కి దాదాపుగా 12 కోట్ల రూపాయలకు చేసారు..ఇది బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి..ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమాకి ఇక్కడ దాదాపుగా 23 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి..ఇప్పుడు లైగర్ సినిమాకి కూడా అదే స్థాయి వసూళ్లు వచ్చే అవకాశం ఉందంటూ బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..ఇక ఇటీవలే ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన కార్తికేయ 2 కూడా బాలీవుడ్ లో దాదాపుగా 25 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది..ఇప్పటికి కూడా ఈ సినిమా హిందీ వెర్షన్ లో డీసెంట్ వసూళ్లను రాబడుతూ ముందుకి దూసుకుపోతుంది..చూస్తూ ఉంటె బాలీవుడ్ మార్కెట్ మనకి మరో ఓవర్సీస్ లాంటి పెద్ద మార్కెట్ గా మారిపోయింది అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..డిజాస్టర్ టాక్ వచ్చిన లైగర్ కూడా బాలీవుడ్ లో హిట్ అయిపోయింది అంటే మాములు విషయం కాదు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…