
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఇప్పుడు ఎంతో ఆతృతగా తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే,2019 సార్వత్రిక ఎన్నికలలో ప్రత్యర్థి తెలుగు దేశం పార్టీ అభ్యర్థి పై రెండు లక్షల 20 వేళా ఓట్ల మెజారిటీ తో వైసీపీ పార్టీ అభ్యర్థి బల్లి దుర్గ ప్రసాద్ రావు గెలిచిన సంగతి మన అందరికి తెలిసిందే, ఆ తర్వాత దురదృష్టం కొద్దీ ఆయన 2020 వ సంవత్సరం సెప్టెంబర్ 16 వ తేదీన కరోనా మహమ్మారి సోకి అపోలో హాస్పిటల్స్ లో చికిత్స పొందుతూ ప్రాణాలను వదిలాడు,దీనితో తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి,తెలుగుదేశం పార్టీ నుండి ఇప్పటికే పనబాక లక్ష్మి పార్లమెంట్ అభ్యర్థి గా ఖరారు కాగా , వైసీపీ మరియు జనసేన బీజేపీ కూటములు తమ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది,ఈ ఉప ఎన్నికలు మార్చి నెలలో జరగబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం,ఇది ఇలా ఉండగా తిరుపతి ఉప ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు అనే దాని పై వే 2 న్యూస్ అనే సంస్థ ఒక్క సర్వే నిర్వహించింది అట, ఈ సర్వే వెలువడిన ఫలితాలు ఇప్పుడు ఎక్సక్లూసివ్ గా మీ కోసం ఈ కథనం లో అందించబోతున్నాము.
వే 2 న్యూస్ ఛానల్ ఇటీవల తిరుపతి పార్లమెంట్ పరిదిలో ఉన్న నియోజగవర్గాలు అన్నిట్లో కలిపి దాదాపు 2 లక్షల మంది దగ్గర సాంపిల్స్ తీసుకున్నారు అట, ఈ సర్వే లో అందరూ అనుకున్నట్టే వైసీపీ పార్టీ ఏక పక్షంగా గెలవబోతున్నట్టు తెలిసింది, 48 శాతం మంది ప్రజలు వైసీపీ పార్టీ కి వోట్ వెయ్యబోతున్నట్టు ఏ సర్వే లో తేలింది, ఇక ప్రధాన ప్రతి పక్షం లో తెలుగు దేశం పార్టీ కి మాత్రం చావు దెబ్బ తప్పేటట్టు లేనట్టు కనిపిస్తుంది, ఈసారి ఈ పార్టీ కి వోట్ వెయ్యడానికి కేవలం 20 శాతం మంది ప్రజలు మక్కువ చూపిస్తున్నారు అట, ఇక ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కి వోట్ వెయ్యడానికి ఎవ్వరు ఊహించని విధంగా 27 శాతం మంది ప్రజలు ఆసక్తి చూపుతున్నారు అట, అయితే జనసేన పార్టీ బీజేపీ తో పొత్తు లో ఉంది కాబట్టి ఈ స్థానం లో ఎవరి అభ్యర్థి పోటీ చెయ్యబోతున్నారు అనేది అధికారికంగా ఖరారు కాలేదు,ఒక్క వేళా జనసేన పార్టీ పోటీ చేస్తే టీడీపీ మూడవ స్తానం కి పడిపొయ్యే అవకాశం ఉన్నట్టు ఈ సర్వే లో తేలింది, మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ తెలియాలి అంటే మరో రెండు నెలలు వేచి చూడాల్సిందే.
జనసేన పార్టీ కి తిరుపతి లో కాపు సామజిక వర్గం బలంగా ఉండడం తో తిరుపతి ఎంపీ సీట్ కి దాదాపుగా జనసేన పార్టీ అభ్యర్థి పోటీ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం, ఈ సర్వే లెక్కల ప్రకారం నిజంగా జనసేన పార్టీ రెండవ స్థానం లోకి వస్తే, తెలంగాణ లో బీజేపీ పార్టీ ఎలా అయితే అద్భుతమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిందో, జనసేన పార్టీ కూడా అదే స్థాయి లో ఎదుగుతుంది అని రాజకీయ విశ్లేషకులు ఆభిప్రాయ పడుతున్నారు, తెలుగు దేశం పార్టీ కి బలమైన ఓటు బ్యాంకు ఉన్న, ఈసారి ఎందుకో ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపించట్లేదు అని జోరుగా ప్రచారం అవుతున్న వార్త,ఆ పార్టీ మొత్తం తిరుపతి ఉప ఎన్నికల మీద కంటే ఎక్కువగా పంచాయితీ ఎన్నికల మీదనే శ్రద్ద చూపిస్తున్నట్టు తెలుస్తుంది, పంచాయితీ ఎన్నికలు మే నెల వరుకు జరిగే అవకాశాలు కనిపించట్లేదు, మరి ఈ సర్వే లెక్కలు ఎంత మాత్రం నిజం అవుతాయో తెలియాలి అంటే ఏప్రిల్ వరుకు వేచి చూడాల్సిందే.