
నందమూరి తారకరత్న చనిపోయిన సంఘటన యావత్తు సినీ లోకాన్ని మరియు నందమూరి అభిమానులను శోకసంద్రం లోకి నెట్టేసిన సంగతి అందరికీ తెలిసిందే..అతి చిన్న వయస్సులోనే తారకరత్న కి ఇలా జరగడం అనేది అత్యంత శోచనీయం.ఈమధ్యనే రాజాకీయాల్లోకి అడుగుపెట్టిన తారకరత్న MLA గా అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేద్దామని కూడా అనుకున్నాడు.అలా ఎన్నో రాజకీయ కాంక్షలతో అడుగుపెట్టిన తారకరత్న, ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే కోరిక తీరకుండానే తిరిగి రాని లోకాలకు పయనమయ్యాడు.అయితే తారకరత్న తన తల్లి తడఁరులతో చాలా రోజుల నుండి మాట్లాడడం లేదనే విషయం అందరికీ తెలిసిందే.అలేఖ్య రెడ్డి అనే అమ్మాయిని రెండవ పెళ్లి చేసుకోవడం తో ఆయనని దూరం పెట్టేసారు.అయితే తారకరత్న కి చిన్నప్పటి నుండి అన్ని బాలయ్యే దగ్గరుండి చూసుకునేవాడు.ఆయనని సినిమాలోకి తీసుకొచ్చి, మొదటి సినిమా ప్రారంభం రోజే 9 సినిమాలకు హీరోగా సంతకం పెట్టించేలా చేసాడు.
అమ్మానాన్న లతో గొడవపడి, భార్య తో ఇంట్లో నుండి బయటకి వచ్చేసిన తర్వాత కూడా బాలయ్యే తారకరత్న కి కావాల్సినవన్నీ చూసుకున్నాడు.అలా తారకరత్న జీవితం లో తండ్రి స్థానం లో నిల్చొని ఏవేవి చెయ్యాలో అన్నీ చేసాడు బాలయ్య.ముఖ్యంగా తారకరత్న కి గుండెపోటు వచ్చినప్పుడు బాలయ్య పడిన మనోవేదన చూస్తే ఎంతటివాడికైనా కళ్ళలో నుండి నీళ్లు రాక తప్పదు.సుమారుగా నెల రోజుల నుండి ఆయన మకాం బెంగళూరికి మార్చేశాడు.వృత్తి పరంగా ఎంతో బిజీ గా ఉండే బాలయ్య బాబు తన పనులన్నీ పక్కన పెట్టిమరీ తారకరత్న కోసం ఉన్నాడు.ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత అలేఖ్య రెడ్డి మరియు పిల్లలకు బాలయ్య బాబే పెద్ద దిక్కు అయ్యాడు.వాళ్లకి ఎలాంటి లోటు కలగకుండా చూసుకుంటానని మాట ఇచ్చి, ముగ్గురు పిల్లల పేరిట ఫిక్సుడ్ డిపాజిట్ ని ఓపెన్ చేసి పది కోట్ల రూపాయిలు వేసాడట.బండలు అనుబంధాలు పూర్తిగా మాయం అయిపోతున్న ఈరోజుల్లో తన అన్న కొడుకు కోసం బాలయ్య చూపిస్తున్న ప్రేమ ని చూసి అభిమానులు గర్వపడుతున్నారు.
ఇది ఇలా ఉండగా తారకరత్న చనిపోకముందు తన చివరి కోరిక గురించి చెప్పిన మాటలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రెండీ అవుతుంది. కొద్దీ నెలల క్రితం ఆయన కొన్ని ఇంటర్వూస్ లో పాల్గొన్నాడు..ఈ ఇంటర్వూస్ లో అతని మాట తీరుని చూసి అందరూ ఎంతగానో మెచ్చుకున్నారు..ఈ ఇంటర్వూస్ లో ఆయన ఎన్నో సందర్భాలలో బాలయ్య బాబు తో కలిసి నటించాలనేది నా కోరిక అంటూ చెప్పుకొస్తూ ఉండే వాడు,త్వరలో తెరకెక్కబోయ్యే బాలయ్య – అనిల్ రావిపూడి కాంబినేషన్ సినిమాలో కూడా తారకరత్న కి ఒక మంచి పాత్రకి ఎంపిక అయ్యాడట.ఈ నెలలనే షూటింగ్ ప్రారంభం కావాల్సింది, ఈలోపే ఈ ఘోరం జరిగిపోయింది.