
నందమూరి తారకరత్న గుండెపోటు వచ్చి మరణించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొట్లాది మంది నందమూరి అభిమానులను శోక సంద్రం లోకి నెట్టేసింది. ఎంతో మంచి మనసు ఉన్న తారకరత్న ఇండస్ట్రీ లో ఉన్న ప్రతీ ఒక్కరికి ఎంతో మంచి మిత్రుడు. రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా ఏరోజూ ఆయన ఒకరిని పల్లెత్తి ఒక్క మాట అనడం కూడా మనం ఎప్పుడూ చూసి ఉండము.అంతటి సున్నిత మనసు ఉన్న వ్యక్తి ఆయన, ఈమధ్యనే తెలుగుదేశం పార్టీ లో చేరి రాజకీయంగా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అనుకున్న తారకరత్న కలలు కలలుగానే మిగిలిపోవడం దురదృష్టకరం. ఆరోజు లోకేష్ తో పాటుగా ‘యువ గళం’ పాదయాత్ర లో పాల్గొనకుండా ఉండుంటే ఈరోజు తారకరత్న మన మధ్య ఉండేవాడేమో.
ఇది ఇలా ఉండగా తారకరత్న ప్రముఖ రాజకీయ నాయకుడు విజయ సాయి రెడ్డి రెండవ చెల్లి కుమార్తె అలేఖ్య రెడ్డి ని పెళ్లాడిన సంగతి అందరికీ తెలిసిందే. ఆమెకి ఇది రెండవ పెళ్లి అవ్వడం తో నందమూరి కుటుంబ సభ్యులు ఈ పెళ్ళికి ఒప్పుకోలేదని, కానీ తారకరత్న వాళ్ళ మాటలను లెక్క చెయ్యకుండా పెళ్లి చేసుకోవడంతో ఆయనని నందమూరి కుటుంబం దూరం పెట్టేసిందని, ఇలా పలు రకాల వార్తలు ప్రచారం అయ్యాయి.. అయితే అలాంటిదేమి లేదని గతంలో తారకరత్న ఒక ఇంటర్వ్యూ లో చెప్పిన వీడియో ని నందమూరి ఫ్యాన్స్ షేర్ చెయ్యడం తో ఈ వార్తలకు చెక్ పడింది. ఇదంతా పక్కన పెడితే అలేఖ్య రెడ్డి మరియు తారకరత్న ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ఒకరిని వదిలి ఒకరు ఉండలేనంత ప్రేమభిమానాలు వీళ్ళ మధ్య ఉన్నాయి. అలాంటిది వీళ్ళ దాంపత్య జీవితాన్ని చావు విడదీయడం మింగుడుపడలేని విషయం.
తల్చుకుంటే మనకే ఇంత బాధ వేస్తుంది.. ఇక తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి కి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.రెండు రోజుల నుండి అన్నం నీళ్లు లేకుండా ఏడుస్తూ కూర్చున్న అలేఖ్య రెడ్డి కి షివరింగ్ మరియు విపరీతంగా జ్వరం వచ్చిందట.. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అయితే భయపడాల్సిన అవసరం లేదని.. త్వరగానే అది తగ్గిపోతుందని డాక్టర్లు ఈ సందర్బంగా తెలిపారు. ఈరోజు సాయంత్రం తారకరత్న అంత్యక్రియలు బంధుమిత్రులు మరియు కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతిని కోరుకోవాలని ఆ దేవుడికి మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాము.