
నందమూరి తారకరత్న ప్రస్తుతం బెంగళూరులో చికిత్స పొందుతున్నారు. గత శుక్రవారం కుప్పంలో నారా లోకేష్ ప్రారంభించిన ‘యువగళం’ పాదయాత్రకు హాజరైన తారకరత్న.. కాసేపు నడిచి వెళ్లేసరికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అందుకే తారకరత్నను ముందుగా కుప్పం ఆసుపత్రిలో చేర్పించారు. అదే రోజు రాత్రి మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు..తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎప్పటికప్పుడు బులెటిన్‌లు విడుదల చేస్తున్నారు. కానీ.. పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తదితరులు బెంగళూరు చేరుకున్నారు. గత శుక్రవారం నుంచి నందమూరి బాలకృష్ణ స్వయంగా తారకరత్న చికిత్స ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
గతేడాది వరకు తెలుగులో సినిమాలు చేసిన తారక రత్న అంటే అందరికీ సుపరిచితమే. అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నాడని తెలియగానే.. తారకరత్న గురించి మరింత తెలుసుకోవాలని నెటిజన్లు వెతుకుతున్నారు. ఈ క్రమంలో తారకరత్న సినిమాలు, భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులపై ఆరా తీస్తున్నారు. తారకరత్న భార్య పేరు అలేఖ్యారెడ్డి. పెద్దల ముందు పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరి ప్రేమకథ సినిమా కధ తలిపిస్తుంది..ఇంతకముందు ఓ ఇంటర్వ్యూలో అలేఖ్యారెడ్డి తమ ప్రేమకథ గురించి చెప్పింది. “తారకరత్న చెన్నైలోని మా అక్క స్కూల్‌లో సీనియర్. ఆ తర్వాత కామన్ ఫ్రెండ్ ద్వారా హైదరాబాద్ లో కలిశాం. నిజానికి మేము మొదట మంచి స్నేహితులం. అయితే ఆ తర్వాత.. తారకరత్న ముందుగా ప్రపోజ్ చేశారు. అందుకే మా పేరెంట్స్‌తో మాట్లాడాలని సూచించాను. కానీ వారు అంగీకరించలేదు. దానికి కారణం వారికి సినిమా పరిశ్రమపై మంచి అభిప్రాయం లేకపోవడమే’’ అని చెప్పుకొచ్చారు.
తారకరత్న కుటుంబం కూడా మా పెళ్లికి అంగీకరించలేదు. దానికి కారణం నాకు అప్పటికే పెళ్లై విడాకులు తీసుకున్నాను. మళ్లీ పెళ్లి చేసుకుంటానని కూడా అనుకోలేదు. ఆ సమయంలో మా అంకుల్ విజయసాయిరెడ్డి మాకు అండగా నిలిచారు. మేము 2 ఆగస్టు 2012న వివాహం చేసుకున్నాము. “మా పెళ్ళికి పెద్దలు ఎవరూ రాలేదు” అని చెప్పురు అలేఖ్య రెడ్డి. విజయసాయిరెడ్డి భార్య అలేఖ్యారెడ్డి చిన్న కూతురు. అలేఖ్య రెడ్డి మొదటి భర్త తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి ఎలిమి రెడ్డి మాధవరెడ్డి కుమారుడు సందీప్ రెడ్డిని వివాహం చేసుకున్నారు..తారకరత్న, అలేఖ్యా రెడ్డి దంపతులకు 2013లో నిష్క అనే పాప పుట్టింది.. అయితే పెళ్లయిన తర్వాత చాలా రోజుల పాటు నందమూరి కుటుంబానికి, అలేఖ్య కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. అయితే.. నాలుగేళ్ల తర్వాత తారకరత్న పుట్టినరోజు సందర్భంగా అందరూ కలిశారని గుర్తు చేసుకున్నారు అలేఖ్యారెడ్డి. ఈ తారకరత్న స్వర్గీయ నందమూరి హరికృష్ణ సోదరుడు నందమూరి మోహన్ కృష్ణ కుమారుడు.