
అతి చిన్న వయస్సులోనే నందమూరి తారకరత్న గుండెపోటు తో మరణించడం యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది.గత కొద్దీ నెలల క్రితమే తెలుగు దేశం పార్టీ లోకి అడుగుపెట్టి,ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తారకరత్న, రాబొయ్యే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధం అయ్యాడు.అందులో భాగంగానే తెలుగు దేశం పార్టీ చేపడుతున్న ప్రతీ కార్యక్రమం లో పాల్గొన్నాడు తారకరత్న.లోకేష్ చేపట్టిన ‘యువ గళం’ పాదయాత్ర లో పాల్గొన్న తారకరత్న, అక్కడ అభిమానుల తాకిడిని తట్టుకోలేక అక్కడిక్కకడే గుండెపోటు వచ్చి క్రింద పడిపోయిన ఘటన అందరి హృదయాలను కలిచివేసింది.ఆ తర్వాత ఆయనని హాస్పిటల్ కి తీసుకెళ్లి మెరుగైన వైద్యం అందించిన తర్వాత ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డాడు అనే వార్త బయటకి వచ్చింది.కానీ ఇంతలోపే ఆయన మరణించాడు అనే వార్త రావడాన్ని మాత్రం ఎవ్వరూ కలలో కూడా ఊహించలేకపోయారు.త్వరలోనే ఆయన కోలుకొని మన ముందుకి వస్తాడు అనే ఆశతోనే ఉండేవారు.
అయితే తారకరత్న కొద్దీ నెలల క్రితం కొన్ని ఇంటర్వూస్ లో పాల్గొన్నాడు..ఈ ఇంటర్వూస్ లో అతని మాట తీరుని చూసి అందరూ ఎంతగానో మెచ్చుకున్నారు..ఈ ఇంటర్వూస్ లో ఆయన ఎన్నో సందర్భాలలో బాలయ్య బాబు తో కలిసి నటించాలనేది నా కోరిక అంటూ చెప్పుకొస్తూ ఉండే వాడు,త్వరలో తెరకెక్కబోయ్యే బాలయ్య – అనిల్ రావిపూడి కాంబినేషన్ సినిమాలో కూడా తారకరత్న కి ఒక మంచి పాత్రకి ఎంపిక అయ్యాడట.ఈ నెలలనే షూటింగ్ ప్రారంభం కావాల్సింది, ఈలోపే ఈ ఘోరం జరిగిపోయింది.అంతే కాదు ఆయన రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ నుండి మొట్టమొదటి శుభాకాంక్షలు అందాయట.’నీలాంటి మంచి మనసున్నోడు రాజకీయాల్లోకి రావాలి, అప్పుడే అందరికీ న్యాయం జరుగుతుంది.తెలుగు దేశం పార్టీ కి నీ సేవలు చాలా అవసరం’ అని చెప్పాడట.
అప్పుడు తారకరత్న దానికి బదులిస్తూ ‘నువ్వు కూడా పార్టీ లోకి రావాలి బ్రదర్..నిన్ను ముఖ్యమంత్రి సీట్ లో చూడాలనేదే నా కోరిక’ అంటూ చెప్పాడట.జూనియర్ ఎన్టీఆర్ దానికి ఏమి బదులిచ్చాడో తెలియదు కానీ, ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాల్సిందే.తెలుగు దేశం పార్టీ తరుపున ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి గా పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తాడు.ఆ అరుదైన ఘట్టాన్ని చూసేందుకు తారకరత్న లేకపోవడమే నందమూరి అభిమానులని బాధిస్తుంది.ఒక పక్క రాజకీయాలు చేస్తూనే మరో పక్క సినిమాల్లో క్రేజీ ఆఫర్స్ దక్కించుకున్నాడు తారకరత్న.ప్రభాస్ హీరో గా నటిస్తున్న సినిమాలో తారకరత్న కి ఒక ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం దక్కిందట, మరో వైపు వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ ఫుల్ బిజీ లైఫ్ ని లీడ్ చేస్తున్న ఆయనకీ ఇలా జరగడం శోచనీయం.ఆయన ఆత్మా ఎక్కడున్నా శాంతిని కోరుకోవాలని మనస్ఫూర్తిగా దేవుడికి ప్రార్థన చేద్దాము.