
నందమూరి తారకరత్న ఇటీవలే చనిపోయిన సంఘటన యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది.గత కొద్దిరోజుల క్రితమే కుప్పం లోని నారాలోకేష్ ‘యువగళం’ కార్యక్రమం లో పాల్గొన్న తారకరత్న ని అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి కుప్పకూలిపోవడం తో ఆయనని వెంటనే చుట్టుపక్కన ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించి ప్రధమ చికిత్స అందించి ఆ తర్వాత బెంగళూరు లోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి తరలించారు.అక్కడ సుమారుగా 23 రోజులపాటుగా మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరికి మొన్న కన్నుమూశాడు.కచ్చితంగా కోలుకుంటాడు అనుకున్న తారకరత్న ఇలా చనిపోవడం ని ఆయన కుటుంబ సభ్యులతో పాటుగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.ఎప్పుడు నవ్వుతూ అందరిని అంత ప్రేమ ఆప్యాయత తో పలకరించే తారకరత్న గొంతుక ని ఇక మీదట వినలేము అని తెలుసుకున్న అభిమానులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా తారకరత్న ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని ఆయన తల్లితండ్రులతో పాటుగా నందమూరి కుటుంబ సభ్యులు కూడా గత కొంత కాలం నుండి ఆయనని దూరం పెట్టేశారంటూ సోషల్ మీడియా లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగిన సంగతి తెలిసిందే.తల్లితండ్రులు ఆయనతో కొన్ని రోజులు మాట్లాడకుండా ఉన్న విషయం వాస్తవమే కానీ, నందమూరి కుటుంబ సభ్యులు మాత్రం ఎప్పుడూ కూడా తనని దూరం పెట్టలేదు.బాలకృష్ణ మరియు జూనియర్ ఎన్టీఆర్ వంటి వాళ్ళు తారకరత్న తో ఎప్పుడూ అందుబాటులోనే ఉండేవారు.వీకెండ్స్ అప్పుడు బాగా కలుసుకునే వాళ్ళు కూడా, ఒకసారి తారకరత్న కి అప్పు అవసరం అయితే జూనియర్ ఎన్టీఆర్ సహాయం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయట.సుమారుగా కోటి రూపాయిల వరకు ఆయన ఒకసారి తారకరత్న కి ఇచ్చినట్టు సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వార్త.
ఇదంతా పక్కన పెడితే నిన్న తారకరత్న పార్థివ దేహాన్ని ఫిలిం ఛాంబర్ లో చూడడానికి వచ్చిన ఆయన తల్లితండ్రులు, గుండెలు పగిలేలా ఏడ్చినా వీడియో మన అందరికి కంటతడి పెట్టేలా చేసింది.పెద్ద వయస్సులో ఉన్న మేము ఇంకా బ్రతికి ఉన్నాము, ఎంతో జీవితాన్ని చూడాల్సిన మా బిడ్డ మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు అంటూ వాళ్లిద్దరూ ఏడుస్తున్న వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.అయితే తారకరత్న తల్లితండ్రులు అలేఖ్య రెడ్డి ని ఆమె పిల్లలని మాత్రం కనీసం పట్టించుకోకపోవడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.అక్కడకి వచ్చిన ప్రతీ ఒక్కరు అలేఖ్య రెడ్డి ని ఓదారుస్తూ ఉంటే తారకరత్న తల్లితండ్రులు మాత్రం ఆమె ముఖం వైపు చూడడానికి కూడా ఇష్టం చూపకపోవడం చర్చనీయాంశం అయ్యింది.దీనిని బట్టీ చూస్తే వాళ్ళిద్దరికీ తారకరత్న భార్య పై ఇంకా కోపం పోలేదు అనే విషయం అర్థం అవుతుంది.