
నందమూరి తారకరత్న గత నాలుగు రోజుల క్రితం చనిపోయిన సంఘటన యావత్తు సినీ లోకాన్ని మరియు మరియు కోట్లాది మంది నందమూరి అభిమానులను శోకసంద్రం లోకి నెట్టేసిన సంగతి తెలిసిందే.నిన్న ఆయన పుట్టినరోజు, సరిగ్గా నిన్నటితో ఆయన 40 వ సంవత్సరం లోకి అడుగుపెట్టాడు.పెళ్ళాం పిల్లలు మరియు బంధుమిత్రులతో ఎంతో సంతోషం గా పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాల్సిన తారకరత్న ఇప్పుడు ఎప్పటికీ తిరిగిరాని లోకాలకు ప్రయాణం అవ్వడం అనేది జీర్ణించుకోలేని విషయం.నిన్ననే ఆయన చిన్న కర్మ కూడా జరిగింది.ఈ కార్యక్రమం మొత్తాన్ని నందమూరి బాలకృష్ణ దగ్గరుండి జరిపించాడు.23 రోజులగా మృత్యువుతో యుద్ధం చేసిన తారకరత్న సురక్షితంగా బయట పడుతాడని అందరూ అనుకున్నారు.
ఇక ఎప్పుడెప్పుడు ఆయన కోలుకున్నాడు అనే వార్త వింటామో అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న అభిమానులకు, ఆయన చనిపోయాడు అనే వార్త తీరని శోకాన్ని మిగిలించింది.కొద్దీ రోజుల క్రితమే తారకరత్న కోలుకుంటున్నాడు అని మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఎంతో సంతోషం తో ట్వీట్ వేసాడు.కానీ ఇంతలోపే ఇలా జరిగిపోవడం తో చిరంజీవి కూడా ఎంతో దిగ్బ్రాంతికి గురయ్యాడు.తారకరత్న ఇండస్ట్రీ లో ఉన్న అందరితో ఎంతో సన్నిహితంగా ఉండే విషయం అందరికీ తెలిసిందే.అలా మెగాస్టార్ చిరంజీవి తో కూడా ఆయన ఎంతో సన్నిహితంగా ఉండేవాడు.కలిసినప్పుడల్లా ఆయనని ప్రేమగా బాబాయి అని పిలిచేవాడు.అలాంటి వ్యక్తి, ఇంత చిన్న వయస్సులో , జీవితాన్ని చూడకుండానే తిరిగి రాని లోకాలకు ప్రయాణం అవ్వడం చిరు ని తీవ్రమైన దిగ్బ్రాంతికి గురి చేసింది.
ఇది ఇలా ఉండగా నిన్న కళాతపస్వి కె.విశ్వనాధ్ గారి సంస్మరణ సభ జరిగింది.ఈ సభ కి చిరంజీవి తో పాటుగా ఇండస్ట్రీ లో ఉన్న ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు.విశ్వనాధ్ తో తమకి ఉన్న అనుబంధం ని నెమరువేసుకున్నారు.ఈ సందర్భంగా చిరంజీవి కూడా మాట్లాడే ముందు తారకరత్న కి నివాళి అర్పించాడు.ఆయన మాట్లాడుతూ ‘శివరాత్రి రోజున ప్రముఖ యువ హీరో నందమూరి తరరత్న చనిపోవడం అనేది నా మనసుని ఎంతో దిగ్బ్రాంతికి గురి చేసింది.ఈ సందర్భంగా ఆ యువ హీరో ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తూ, ఒక రెండు నిముషాలు మౌనం పాటిద్దాం’ అంటూ చిరంజీవి మాట్లాడిన విధానం అందరికీ ఎంతగానో నచ్చింది.తారకరత్న కి నివాళులు అర్పిస్తున్న సమయం లో చిరంజీవి కంటతడి పెట్టడం మనం గమనించొచ్చు.