
సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సింగర్‌గానే కాకుండా రియాలిటీ షోల్లో ఆమె జడ్జిగా పనిచేస్తూ తెలుగు వారికి మరింత దగ్గరైంది. సునీత పాటలతో పాటు తన అందంతో తెలుగు రాష్ట్రాల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. సునీత్ వాయిస్‌కు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సునీత నేపథ్య గాయని మాత్రమే కాదు డబ్బింగ్ కళాకారిణి కూడా. చాలా మంది హీరోయిన్‌లకు సునీత్ తన వాయిస్‌ను అరువుగా ఇచ్చింది. సునీత గుంటూరులో పుట్టి పెరిగింది. విజయవాడలో విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఆమె కెరీర్ విషయానికి వస్తే మొదట్లో టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా పనిచేసేది. 15 సంవత్సరాల వయసులో చిత్ర పరిశ్రమకు సింగర్‌గా ఎంట్రీ ఇచ్చింది. సునీతకు గులాబీ, ఎగిరే పావురమా వంటి సినిమాల్లో పాడిన పాటలకు మంచి గుర్తింపు వచ్చింది. సునీతకు శశి ప్రీతమ్ సంగీత దర్శకత్వంలో వచ్చిన గులాబి సినిమా కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు అనే పాట సూపర్ క్రేజ్‌ను తెచ్చింది. సునీత తెలుగుతో పాట కన్నడ, తమిళ, మలయాళ భాషలలో సుమారు 3,000 సినిమా పాటలు పాడిందని తెలుస్తోంది.
మరోవైపు సునీత ఇప్పటి వరకు దాదాపుగా 500 సినిమాలకు డబ్బింగ్ చెప్పింది. సునీతకు 19 ఏళ్ల వయసులోనే వివాహం జరిగింది. ఆమె భర్త పేరు కిరణ్ కుమార్. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారి పేర్లు ఆకాష్, శ్రేయ. అయితే కొన్ని కారణాల వల్ల సునీత తన భర్తతో 2017లో విడాకులు తీసుకుంది. నాలుగేళ్ల తర్వాత మళ్లీ రెండో వివాహం చేసుకుంది. మ్యాంగో మీడియా గ్రూప్ అధినేత రామ్ వీరపనేనితో జనవరి 9, 2021 న సునీత పెళ్లి జరిగింది. ఈ పెళ్లిని సునీత పిల్లలే దగ్గరుండి మరీ జరిపించారు. రామ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సునీత సంతోషంగా జీవిస్తోంది. అయితే సునీత వివాహం చేసుకున్న రామ్ వీరపనేని బ్యాక్ గ్రౌండ్ గురించి కూడా అందరికీ తెలుసు. ఆయన అసలు పేరు రామకృష్ణ వీరపనేని. ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదివిన రామ్ ఇండియాలో ప్రముఖ వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. ఆయనకు పలు కంపెనీలలో వందల కోట్ల రూపాయల షేర్స్ ఉన్నాయి. ప్రముఖ మ్యూజిక్ సంస్థ మ్యాంగో మీడియాకు సీఈవోగా పనిచేస్తున్నారు. మ్యాంగో మీడియా యూట్యూబ్ ఛానల్ ద్వారా తమిళ,హిందీ బ్లాక్ బస్టర్ సినిమాలను డబ్బింగ్ రైట్స్ తీసుకొని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేస్తూ భారీగా సంపాదించారు.
మరోవైపు రామ్ వీరపనేనికి తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తి కొన్ని వందల కోట్ల విలువ చేసేది ఉంది. రామ్ తండ్రి కూడా వందల కోట్ల రూపాయల ఆస్తి సంపాదించారు. హైదరాబాదులో కూడా పలు ప్రాంతాలలో అపార్టుమెంట్లు కూడా ఉన్నాయని సమాచారం. రామ్ తండ్రి శివాజీ గోవిందరావుపేట ప్రాంతానికి చెందిన వ్యక్తి కాగా ఆయన ఎంతోమంది పేదలకు ఇళ్లు కట్టించారని బోగట్టా.కరోనా వల్ల ఆయన చనిపోగా ఆయనపై అభిమానంతో ఊరి ప్రజలు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ఒకవైపు వారసత్వంతో వచ్చిన ఆస్తి, మరోవైపు వ్యాపార రంగంలో సంపాదన కలిసి రామ్, సునీత దంతులకు భారీగా ఆస్తులు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. కాగా సునీత, రామ్ దంపతులు తల్లిదండ్రులు కావాలని నిర్ణయించుకున్నారని.. అందుకే సునీతకు రీకానలైజేషన్ సర్జరీ చేయించుకున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సునీత కూడా తల్లి కాబోతున్న సంగతిని విని ఫుల్ హ్యాపీ మ్యూడ్‌లో ఉందని తెలుస్తోంది. సింగర్ సునీత ఒక పాట పాడటానికి 10 లక్షల రూపాయల రేంజ్‌లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.