
తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో మరో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది..ఆయా సంఘటన నందమూరి కుటుంబం లోనే జరగడం తీవ్రమైన విషాదకరం..ఇప్పటికే ఆ కుటుంబం హరికృష్ణ గారిని, జానకి రామ్ గారిని కోల్పోయి తీవ్రమైన దుఃఖం లో మునిగిపోయింది..ఇప్పుడు ఎన్టీఆర్ గారి కుమార్తె కంటమనేని ఉమామహేశ్వరి గారు తన నివాసం లో ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇండస్ట్రీ లో కలకలం రేపింది..ప్రమాదం లో ప్రాణాలు కోల్పోవడం వేరు..లేదా సహజం గా గుండెపోటు వచో లేదా వేరే కారణాల వల్ల చనిపోవడం వేరు..కానీ మన ఇంట్లోని వారు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం అంటే ఎంత బాధాకరమైన విషయంలో మనం కలలో కూడా ఊహించలేము..అలాంటి బాధాకరమైన సంఘటన జరిగి నందమూరి కుటుంబం ఇప్పుడు తీవ్రమైన దుఃఖసాగరం లో మునిగిపోయింది..ఆమె మరణ వార్త వినగానే నందమూరి కుటుంబ సభ్యులు హుటాహుటిన ఉమామహేశ్వరి గారి ఇంటికి వెళ్లారు..నందమూరి బాలకృష్ణ అయితే తన సోదరి భౌతికకాయాన్ని చూసిన వెంటనే శోకసంద్రం లో మునిగిపోయాడు.
ఎప్పుడు గాంభీర్యంగా కనిపించే బాలయ్య బాబు ని అలా ఏడుస్తూ ఉండడం చూసి ఆయన అభిమానులు తట్టుకోలేకపోతున్నారు..ఆయన మీడియా తో మాట్లాడుతూ ‘మేము ఎంతగానో అభిమానించే మా సోదరి ఈరోజు మమల్ని వదిలి పరలోకానికి పయనం అవ్వడం మమల్ని ఎంతగానో బాధిస్తుంది..ముఖ్యంగా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని మేము కలలో కూడా ఊహించలేదు..నా సోదరి చాలా ధైర్యం తో కూడిన మనిషి..ఒంటరిగా ఆమె ఎన్నో అవరోధాలను దాటింది..కుటుంబం ని కూడా చూసుకుంది..కానీ గత కొంతకాలం నుండి ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంది..తన బాధ ఏంటో మాకు చెప్పుకొని ఉంటె ఎలాంటి సమస్యనైనా పరిష్కారించేవాళ్ళం..కానీ ఆత్మహత్య చేసుకునే సంఘటనలు ఇంట్లో ఏమి జరిగి ఉంటాయి అనే దాని పై విచారిస్తున్నాం..నా చెల్లి ఎక్కడ ఉన్న ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను’ అంటూ బాలయ్య బాబు విచార వదనం తో చేసిన కామెంట్స్ నందమూరి అభిమానులను కంటతడి పెట్టిస్తుంది.
అయితే ఇండస్ట్రీ లో వినిపిస్తున్న వార్త ఏమిటంటే ఉమామహేశ్వరి గారు చాలా కాలం నుండి తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యారట..అంతే కాకుండా ఆరోగ్య సమస్యలను కూడా తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని తెలుస్తుంది..పోలీసులు దీనిపై త్వరలోనే విచారణ చేపడుతాం అని ఈ సందర్భంగా తెలిపారు..ఉమా మహేశ్వరీ గారి భర్త పేరు శ్రీనివాస ప్రసాద్..ఈ ఇద్దరి దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు..ఇప్పుడు ఆ ఇద్దరి బిడ్డల బాధ వర్ణనాతీతం అని చెప్పొచ్చు..ఇవన్నీ చూస్తూ ఉంటె ఆగస్టు నెల నందమూరి కుటుంబానికి ఒక శాపం లాగ మారింది అని చెప్పొచ్చు..ఇదే నెలలో హరికృష్ణ గారు మరియు ఆయన పెద్ద కుమారుడు జానకి రామ్ గారు రోడ్డు ప్రమాదం లో చనిపోయారు..ఇప్పుడు ఎన్టీఆర్ గారి కుమార్తె ఆత్మహత్య చేసుకొని చనిపోవడం నందమూరి కుటుంబాన్ని తీవ్రమైన శోకసంద్రం లో నెట్టేసింది..ఉమామహేశ్వరి గారి ఆత్మా ఎక్కడ ఉన్నా శాంతి చేసుకురాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడికి ప్రార్థన చేద్దాము.