
ఇటీవల కాలం లో తెలుగు చలన చిత్ర పరిశ్రమని తీవ్రమైన విషాదం లోకి నెట్టేసిన సంగతి ఎన్టీఆర్ గారి కూతురు ఉమా మహేశ్వరీ గారు తన నివాసం లో ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ఘటన..నందమూరి వంశం అంటే సినీ ఇండస్ట్రీ లో కానీ, రాజకీయ క్షేత్రం లో కానీ ఒక చరిత్ర..తెలుగు జాతి గర్వపడేలా చేసిన కుటుంబం అది..అలాంటి కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి..అది కూడా ఎన్టీఆర్ గారి గారాల పట్టి అయినా ఉమా మహేశ్వరీ గారు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం అనేది నిజంగా ఎంతో బాధాకరం అనే చెప్పాలి..మన కుటుంబం లో ఒక మనిషి మాములు గా ఆరోగ్యం బాగాలేకనో..లేదా ప్రమాదం జరిగితేనో మన కర్మ అనుకోని బాధపడి కొన్ని ఏళ్ళ తర్వాత మర్చిపోతాం..కానీ మన కుటుంబం లో ఒక వ్యక్తి మానసిక క్షోభ కి గురై ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబసభ్యులు ఎంతలా బాధపడుతారో మనం ఊహించలేం..జీవితాంతం ఆ బాధ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది..ఇప్పుడు నందమూరి కుటుంబ సభ్యులది కూడా అదే పరిస్థితి.
ఉమా మహేశ్వరీ గారి అంత్యక్రియలకు నందమూరి కుటుంబ సభ్యులు మొత్తం హాజరు అయ్యారు..ఒక జూనియర్ ఎన్టీఆర్ తప్ప..జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాలేదు అనే దానిపైనా ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో చర్చ సాగుతుంది..ఉమా మహేశ్వరీ గారితో ఎన్టీఆర్ కి చిన్నప్పటి నుండి ఎలాంటి పరిచయం లేదా..అందుకే రాలేదా..లేదా నందమూరి కుటుంబం లో కొంతమందికి కావాలని దూరంగా ఉండాలనే ఉద్దేశ్యం తో ఎన్టీఆర్ రాలేదా? అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి..ఎన్టీఆర్ గారికి ఉమామహేశ్వరి గారితో పెద్ద పరిచయం లేదు అనే విషయం వాస్తవం అయితే కళ్యాణ్ రామ్ వచ్చాడు కదా..కళ్యాణ్ రామ్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ రాకపోవడానికి కారణం ఏమిటి..? ఇలా ఒక్కటా రెండా ఎన్నో ప్రశ్నలు సందేహాలు అభిమానుల్లో మరియు నెటిజెన్స్ లో మొదలయ్యాయి..కానీ ఎన్టీఆర్ ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ లో లేరని..ఆయన తన కుటుంబం తో ఫామిలీ టూర్ కోసం విదేశాలకు వెళ్లాడని ఎన్టీఆర్ సన్నిహిత వర్గాల నుండి వినిపిస్తున్న వార్త..ఇటీవలే ఎన్టీఆర్ తన అన్నయ్య కళ్యాణ్ రామ్ హీరో గా నటించిన బింభిసారా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధి గా హాజరైన సంగతి మన అందరికి తెలిసిందే.
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన మరుసటి రోజే ఎన్టీఆర్ విదేశాలకు ఫామిలీ తో కలిసి వెళ్లినట్టు తెలుస్తుంది..అయితే తన మేనత్త ని చివరి చూపు కూడా చూసుకోలేనందుకు ఎన్టీఆర్ చాలా బాధపడ్డాడట..హైదరాబాద్ కి తిరిగి వద్దామని ఆయన చాలా ప్రయత్నాలే చేసాడట..కానీ కుదర్లేదట..తన కుటంబం లో అందరూ ఎంతో అభిమానించే తన మేనత్త ని తల్చుకుంటూ ఎన్టీఆర్ భోరున ఏడ్చినట్టు తెలుస్తుంది..అంత్యక్రియలు కూడా వీడియో కాల్ ద్వారా చూసినట్టు సమాచారం..ఇక ఎన్టీఆర్ ఇండియా కి తిరిగి రాగానే మేనత్త ఇంటికి వెళ్లి ఆ కుటుంబం మొత్తాన్ని పరామర్శించబోతున్నట్టు తెలుస్తుంది..ఉమా మహేశ్వరీ గారి అంత్యక్రియలు పూర్తి అయ్యే వరుకు నందమూరి బాలకృష్ణ దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చూసుకున్నాడు..ఆయనకీ తన చెల్లెలు అంటే ఎంత ప్రేమో ఈ క్రింది ఫోటో చూస్తే తెలుస్తుంది..అందరిలోకి చిన్న అవ్వడం తో అన్నలు మరియు అక్కలు ఉమా మహేశ్వరీ గారిని ఎంతో ప్రేమగా చూసుకునేవారు..ఇక ఉమామహేశ్వరి గారు అంటే ఎన్టీఆర్ గారికి ప్రాణం..ఆయనకీ ఈమె అంటే ఎంత ఇష్టం అనేది ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా చూస్తే అర్థం అవుతుంది..ఇవన్నీ పక్కన పెడితే ఆమె ఆత్మా ఎక్కడున్నా శాంతిని కోరుకోవాలి మనస్ఫూర్తిగా ఆ దేవుడికి ప్రార్థన చేద్దాము.