
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి సక్సెస్ అవ్వడం అంటే మాములు విషయం కాదు..ఎందుకంటే ఇండస్ట్రీ లో వారసుల సంఖ్య ఎక్కువ..అలాంటి వారసులను తట్టుకొని నిలబడడం అంటే కంటెంట్ మరియు సత్తా ఉన్న హీరో అని అర్థం..అలాంటి హీరోలలో ఒకరు నిఖిల్..ఇండస్ట్రీ లో అవకాశాల కోసం ఒకప్పుడు ఈ కుర్ర హీరో ఎంతో కష్టపడ్డాడు..శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీ డేస్ సినిమాలో ఒక పాత్ర కోసం లక్ష రూపాయిలు కట్టి మరి వచ్చాడు..ఆ పాత్ర ఆయనకీ ఇండస్ట్రీ లో ఎలాంటి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిందో మన అందరికి తెలిసిందే..ఈ పాత్ర ఆయన కెరీర్ నే మార్చేసింది..ఆలా హీరో గా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన నిఖిల్ కెరీర్ లో కార్తికేయ చిత్రం ఎంత ప్రత్యేకమో మన అందరికి తెలిసిందే..అప్పట్లో ఈ సినిమా సంచలన విజయం సాధించి నిఖిల్ కి ప్రత్యేకమైన మార్కెట్ ని తెచ్చి పెట్టింది..అలాంటి సినిమాకి సీక్వెల్ గా కార్తికేయ 2 ని తెరకెక్కించాడు ఆ చిత్ర దర్శకుడు చందు మొండేటి..షూటింగ్ కార్యక్రమాలు ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎన్నో ఒడిదుడుగాలను ఎదుర్కొని ఈ నెల 12 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది.
ఇది ఇలా ఉండగా 2020 వ సంవత్సరం లో నిఖిల్ పల్లవి శర్మ అనే అమ్మాయి ని పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..అయితే ఈమె తో నిఖిల్ గత కొద్దీ రోజుల నుండి గొడవలు పడుతుంది అని..వీళ్ళ మధ్య అసలు సఖ్యత లేదని..హై కోర్టు లో ఇటీవలే విడాకులు కోసం అదరకాస్తు చేసుకున్నారని..ఇలా పలు రకాల వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి..అయితే వీటి పై నిఖిల్ ని ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో అడగగా ఆయన దానికి సరిగా సమాధానం చెప్పకపోవడం ఇప్పుడు సోషల్ మీడియా లో అందరిని ఆశ్చర్యానికి గురి చేసే విషయం..అంటే నిజంగానే వీళ్లిద్దరు విడిపోబోతున్నారా అనే సందేహాలు ఇప్పుడు నీఙ్కఝీల్ అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో నెలకొన్నాయి..సోషల్ మీడియా లో వస్తున్నా వార్తలన్నిటికి త్వరలోనే ఒక ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్తాను అంటూ నిఖిల్ విడాకులు ప్రస్తావనని దాటవేశారు..ఇటీవల కాలం లో సెలెబ్రెటీలకు విడాకులు ఎక్కువగా జరుగుతున్నా విషయం మన అందరికి తెలిసిందే..ఆ కోవలోకే ఈ జంట కూడా చేరబోతోంది అని తెలుస్తుంది.
ఇక కార్తికేయ 2 విషయానికి వస్తే ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో అన్ని ప్రాంతీయ బాషలలో దబ్ చేసారు..మొదటి బంగారం లో కలర్స్ స్వాతి హీరోయిన్ గా నటించగా..రెండవ భాగంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది..టీజర్ మరియు ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం తో సినిమా పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి..అసలే వరుస ఫ్లాప్స్ తో తీవ్రమైన సంక్షోభం ని ఎదురుకుంటున్న టాలీవుడ్ ఈ సినిమా తో బౌన్స్ బ్యాక్ అవుతుంది అని ట్రేడ్ విశ్లేషకులు బలంగా నమ్ముతున్నారు..తొలుత ఈ సినిమాని జులై మొదటి వారం లో విడుదల చేద్దాం అనుకున్నారు..అప్పుడు పెద్ద నిర్మాత సినిమా ఉండడం వాళ్ళ వాయిదా పడింది..ఇక ఆ తర్వాత జులై 22 మన విడుదల చేద్దాం అనుకున్నారు..అప్పుడు దిల్ రాజు థాంక్యూ మూవీ ఉండడం తో మళ్ళీ వాయిదా పడింది..ఆలా పెద్ద హీరోలు మరియు నిర్మాతల సినిమాల వల్ల వాయిదా పడుతూ వచ్చి ఎట్టకేలకు ఆగస్టు 12 వ తేదీన విడుదల కాబోతుంది..అదే రోజున నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ రెండు సినిమాలలో ఏది ఘానా విజయం సాధించబోతుందో అని ప్రేక్షకులు అభిమానులు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.