
మన టాలీవుడ్ లో ఎంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి స్టార్ హీరోలుగా ఎదిగిన అతి కొద్దీ మందిలో ఒక్కరు విజయ దేవర కొండా, కెరీర్ ప్రారంభం లో చిన్న చిన్న పాత్రల ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయిన విజయ్ దేవర కొండా, న్యాచురల్ స్టార్ నాని హీరో నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో ఒక్క ముఖ్యమైన పాత్ర పోషించి మంచి గుర్తింపు ని తెచ్చుకున్నాడు, ఆ తర్వాత ఆయన హీరోగా నటించిన పెళ్లి చూపులు సినిమా ఎవ్వరు ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి విజయ్ దేవరకొండ ని హీరోగా ఇండస్ట్రీ లో నిలబెట్టింది, ఇక ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమా తో విజయ్ దేవరకొండ కి యూత్ లో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, తొలిప్రేమ మరియు తమ్ముడు సినిమా రోజుల్లో పవన్ కళ్యాణ్ యూత్ లో ఎలాంటి క్రేజ్ సంపాదించాడో విజయ దేవరకొండ కూడా అదే రేంజ్ క్రేజ్ ని సంపాదించాడు ని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు, ఇక ఆ తర్వాత గీత గోవిందం సినిమా అయితే ఇండస్ట్రీ లోనే స్టార్ హీరోల సినిమా రేంజ్ లో వసూళ్లు సాధించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది, ఇది ఇలా ఉండగా విజయ్ దేవరకొండ కి సంబంధించిన ఒక్క సరికొత్త వార్త ఒక్కటి ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతోంది.
ఇక అసలు విషయానికి వస్తే గీత గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ మరియు హీరోయిన్ రష్మిక కాంబినేషన్ కి ఎలాంటి క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఈ సినిమా తర్వాత వాళ్లిదరు కలిసి నటించిన డియర్ కామ్రేడ్ సినిమా కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాకపోయినా వీళ్ళిద్దరి జంట కి మంచి పేరుకి తెచ్చిపెట్టింది ,ఆన్ స్క్రీన్ మీద వీళ్ళిద్దరి కెమిస్ట్రీ ని చూస్తే ప్రతి ఒక్కరికి వీళ్లిద్దరు నిజంగా ప్రేమికులేనా అనే సందేహం రాక తప్పదు, అయితే నిజ జీవితం లో వీళ్లిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, వీళ్లిద్దరు కలిసి ముంబై లో ప్రత్యేక డిన్నర్ నైట్స్ కి వెళ్లడం , విజయ్ దేవరకొండ కుటుంబం లో ఏ శుభ కార్యం జరిగిన రష్మిక తప్పక అటెండ్ అవ్వడం, వీటి అన్నిటిని చూసి మీడియా వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారు అని, ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నారు అని , త్వరలో వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అనే వార్తలు మీడియా లో మరియు సోషల్ మీడియా లో తరచు ప్రచారం అవుతూనే ఉన్నాయి, దానిని వీళ్లిద్దరు పలుమార్లు కండించిన, సోషల్ మీడియా లో ప్రవాహం లా సంచరిస్తున్న ఈ వార్తలను మాత్రం ఆపలేకపొయ్యారు.
అయితే గతం లో ఇలాగె కొన్ని జంటలు మా మధ్య ఎలాంటి లవ్ రిలేషన్ షిప్ లేదు అని చెప్పి కొన్నేళ్ల తర్వాత పెళ్లిళ్లు చేసుకోవడం మనం ఎన్నో చూసాము, విజయ్ దేవరకొండ రష్మిక విషయం లో కూడా అదే జరుగబోతోంది అంటూ ఇప్పుడు మరో వార్త ప్రచారం అవుతుంది ,కొత్త సంవత్సరం లో రష్మిక మరియు విజయ్ దేవరకొండ ఇద్దరు కలిసి తమ జీవితం లో జరగబొయ్యే ఒక్క ముఖ్యమైన ఘట్టం గురించి ఒక్క కీలిక ప్రొ౦రకటన చెయ్యబోతున్నారు అనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది, ఆ వార్త వీళ్లిద్దరి పెళ్లి గురించే అని సోషల్ మీడియా లో అభిమానులు చెప్పుకుంటున్న, ప్రస్తుతం విజయ్ దేవరకొండ మరియు రష్మిక ఇద్దరు కలిసి గోవా లో ఎంజాయ్ చేస్తున్నారు అని , అక్కడి నుండి తిరిగి వచ్చిన తర్వాత అభిమానులకు ఒక్క కీలక ప్రకటన చెయ్యబోతున్నారు అని తెలుస్తుంది , మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ తెలియాలి అంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే , ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూర్తి జగన్నాథ్ దర్శకత్వం లో లైగర్ అనే సినిమా లో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సినిమా కి సంబంధించిన గ్లిమ్స్ ని ఇటీవల విడుదల చెయ్యగా దానికి అద్భుతమైన రెస్పాస్నే వచ్చింది, ఈ ఏడాది ఆగష్టు నెలలో ఈ సినిమాని విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు, పాన్ ఇండియా లో లెవెల్ లో ఈ సినిమా తెలుగు తో పాటుగా హిందీ , తమిళ్ ,మలయాళం మరియు కన్నడ బాషలలో విడుదల కానుంది, విజయ్ దేవరకొండ కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా అతనిని ఏ స్థాయికి తీసుకెళ్లబోతుందో చూడాలి.