
టాలీవుడ్ ఇప్పుడు ఏడాదికి ఒక్క కొత్త హీరోయిన్ వస్తున్నా సంగతి మన అందరికి తెలిసిందే, కానీ ఎంత మంది హీరోయిన్స్ వస్తున్న కూడా కొంతమంది హీరోయిన్స్ క్రేజ్ ఏ మాత్రం తగ్గకుండా ఇప్పటికి టాప్ ఫార్మ్ ని కొనసాగిస్తూ క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు,అలాంటి హీరోయిన్స్ లో ఒక్కరు అనుష్క శెట్టి,ఈమెకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, మూడు పదుల వయస్సు దాటినా కూడా తరగని అందం తో కుర్రకారులను ఉర్రూతలూ ఊగిస్తుంది,అక్కినేని నాగార్జున నటించిన సూపర్ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమ కి పరిచయం అయినా ఈమె సౌత్ లో ప్రతి ఒక్క టాప్ స్టార్ హీరో సరసన నటించి అనతి కాలం లోనే తిరుగులేని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది , కేవలం హీరోయిన్ రోల్స్ కి పరిమితం కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి పెట్టింది పేరు లాగ మారి సౌత్ ఇండియా లో లేడీ సూపర్ స్థార్ ఇమేజిని సొంతం చేసుకుంది ఆమె,ఇక బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియన్ లెవెల్ లో ఈమె ఎలాంటి క్రేజ్ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
బాహుబలి సిరీస్ తర్వాత ఆమె చేసిన మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ బాగమతి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘానా విజయం సాధించింది, ఈ సినిమా తర్వాత ఆమె ఎందుకో సినిమాలు చేసే సంఖ్య ని బాగా తగ్గించేసింది, బాగమతి సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకొని ఆమె చేసిన నిశ్శబ్దం సినిమా ప్రేక్షకులను మరియు అభిమానులను తీవ్ర స్థాయి లో నిరాశ పరిచింది, ఇది ఇలా ఉండగా టాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ బ్యాచిలర్ హీరోలు గా మారియు హీరోయిన్స్ గా చలామణి అయినా ఎంతో మంది గత ఏడాది పెళ్లిళ్లు చేసుకొని ఒక్క ఇంటి వాళ్ళు అయినా సంగతి మన అందరికి తెలిసిందే, అయితే చాలా కాలం నుండి అనుష్క పెళ్లి ఎప్పుడు అని వార్తలు జోరు అందుకున్నాయి, చాలా మంది అనుష్క మరియు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రేమలో ఉన్నారు అని , ప్రస్తుతం వాళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారు అని , త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అని వార్తలు వచ్చాయి, అంతే కాకుండా వీళ్లిద్దరి ప్రైవేట్ ఫోటోలు కూడా కొన్ని సోషల్ మీడియా లో లీక్ అవ్వడం తో వీళ్లిద్దరి పెళ్లి కచ్చితంగా జరుగుతుంది అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు.
అయితే గత రెండు రోజుల నుండి సోషల్ మీడియా లో అనుష్క పెళ్ళికి సంబంధించిన ఒక్క వార్త తెగ వైరల్ అయ్యింది,అదేమిటి అంటే అనుష్క త్వరలోనే దుబాయి చెందిన ఒక్క ప్రముఖ పారిశ్రామిక వేత్తని పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి, మరో ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే అనుష్క పెళ్లి చేసుకోబొయ్యే అతను తనకంటే మూడేళ్లు చిన్న వాడు అని ఫిలిం నగర్ లో గట్టిగ వినిపిస్తున్న వార్త, త్వరలోనే అనుష్క పెళ్ళికి సంబంధించిన వార్త అధికారికంగా బయటకి వచ్చే అవకాశం ఉంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం, ఇది ఇలా ఉండగా బాగమతి సినిమా తర్వాత సినిమాల సంఖ్య ని బాగా తగ్గించేసిన అనుష్క ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక్క సెన్సషనల్ లా దూసుకుపోతున్న నవీన్ పోలిశెట్టి తో ఒక్క సినిమా చెయ్యడానికి ఒప్పుకుంది, ఈ సినిమా ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తుంది, ఒక్క భిన్నమైన కథాంశం తో తెరకెక్కబోతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.