
సౌత్ ఇండియా లోనే మోస్ట్ లవ్లీ కపుల్స్ లో ఒక్కరిగా సమంత మరియు నాగ చైటున్నాయ్ జంట కి ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఒక్కరికోసం ఒక్కరు అనేంతలా ఉండే ఈ జంట విడిపోవడం నిజంగా అందరికి షాక్ అనే చెప్పాలి..ఏ మాయ చేసావే అనే సినిమా ద్వారా పరిచయం వీళ్లిద్దరు ఆ తర్వాత ఒక్కరినొక్కరు అర్థం చేసుకొని ప్రేమించుకొని 2017 వ సంవత్సరం లో పెద్దల సమక్షం లో పెళ్లి చేసుకున్నారు..అంతా సజావుగా సాగిపోతుంది అని అందరూ అనుకుంటున్న సమయం లో అనుకోని విధంగా వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు రావడం..విడిపోవడం అన్ని జరిగిపోయాయి..విడిపోయిన తర్వాత ఎవరి జీవితం వారు చూసుకుంటూ బిజీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు..సమంత ప్రస్తుతం అన్ని ప్రాంతీయ బాషలలో చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది..మరోపక్క నాగ చైతన్య కూడా అంతే..వరుస సినిమాలతో..బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ మంచి ఊపు మీద ఉన్నాడు..ఇది ఇలా ఉండగా సమంత కి సంబంధించిన లేటెస్ట్ వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది..అదేమిటో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.
అదేమిటి అంటే సమంత గత కొంతకాలం నుండి ఒక్క ప్రముఖ బాలీవుడ్ హీరో తో డేటింగ్ లో ఉంది అని..దీనికోసమే ఆమె ముంబై కి తన మకాం మార్చేసింది అని వార్తలు వినిపిస్తున్నాయి..వీళ్లిద్దరు కలిసి ఇప్పుడు ప్రతి ప్రైవేట్ పార్టీ లో తిరిగితున్నారు అని..బాలీవుడ్ లో సమంత కి వరుస సినిమా ఆఫర్లు కూడా అతని వల్లే వస్తున్నాయి అని.ఇలా పలు రకాల వార్తలు షికార్లు చేస్తున్నాయి..ఇంతకీ ఎవరు ఆ హీరో అనేది తెలియాల్సి ఉంది..త్వరలో సమంత బాలీవుడ్ లో ప్రముఖ టాప్ షో కాఫీ విత్ కరణ్ అనే ప్రోగ్రాం లో పాల్గొనబోతుంది అట..ఈ ప్రోగ్రాం లో సమంత సోషల్ మీడియా లో వస్తున్నా ట్రోల్ల్స్ పై మరియు నాగ చైతన్య తో ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అనే దానిపై కూడా పెదవి విప్పబోతుంది అట..అంతే కాకుండా ప్రస్తుతం తానూ ఎవరితో రేలషన్ లో ఉంది..అసలు సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఈ వార్త నిజామా కాదా అనే క్లారిటీ ఇవ్వబోతుంది అట సమంత..మరి సమంత ఏమి మాట్లాడబోతుందో అని ఆమె అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఈ షో కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఇక సమంత ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే గుణ శేఖర్ భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘శాకుంతలం’ అనే సినిమా లో నటిస్తుంది సమంత..ఈ సినిమా తో పాటుగా ‘యశోద’ అనే సినిమాలో కూడా నటిస్తుంది..ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్నాయి..అంతే కాకుండా బాలీవుడ్ లో కూడా ఈమెకి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి..కేవలం హీరోయిన్ రోల్స్ కి మాత్రమే పరిమితం కాకుండా విలన్ రోల్స్ మీద కూడా ఈమె అమితాసక్తిని చూపిస్తున్నట్టు సమాచారం..గత ఏడాది సూపర్ హిట్ గా నిలిచినా ఫామిలీ మ్యాన్ సీసన్ 2 లో సమంత పోషించిన విలన్ పాత్రకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..కేవలం ఈ ఒక్క సినిమాలో మాత్రమే కాదు..తమిళ్ లో సూపర్ డీలక్స్ మరియు 10 ఎండ్రకుల్లా సినిమాలలో కూడా నెగటివ్ రోల్స్ చేసింది..అంతే కాకుండా ఈమె ఇటీవలే హాలీవుడ్ లో ఒక్క బై సెక్సువల్ సినిమాని కూడా ఒప్పుకుంది..ఇందులో కూడా ఆమెది విలన్ రోల్ అట..ఇలా వరుసగా ఇన్ని సినిమాలలో విలన్ రోల్స్ చేసిన ఏకైక నేటి తరం స్టార్ హీరోయిన్ గా సమంత రికార్డు సృష్టించింది..ఇక ప్రస్తుతం ఈమె తెలుగు లో విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి అనే సినిమాలో నటిస్తుంది..ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్ లో జరుగుతుంది.