
తెలుగు చలన చిత్ర పరిశ్రమకి మొట్టమొదటి సూపర్ స్టార్..తన డేరింగ్ & డాషింగ్ తత్త్వం తో ఇండస్ట్రీ ని మరో లెవెల్ కి తీసుకెళ్లిన మహామనిషి కృష్ణ ఇటీవలే గుండెపోటు తో మరణించడం యావత్తు సినీ లోకాన్ని మరియు కోట్లాది మంది అభిమానులను శోకసంద్రం లోకి నెట్టేసింది..కృష్ణ గారిని దైవంలాగా భావించే ఆయన అభిమానులు గుండెలు బాదుకుంటూ ఏడ్చిన వీడియోలు చూస్తే మన గుండె తరుక్కుపోతుంది..కృష్ణ లాంటి మనిషి మళ్లీ పుట్టదు..ఆయన లేని లోటు ఎవ్వరు కూడా పూడవలేరు..అలాంటి మహామనిషి కి ఆయన తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబు చరిత్ర లో ఇదివరకు ఎవ్వరు చేయనటువంటి పనిని చెయ్యబోతున్నాడు..తన తండ్రి గారికి జ్ఞాపకార్థం గా మహేష్ బాబు చెయ్యబోతున్న ఈ గొప్ప పని కృష్ణ గారి జ్ఞాపకాలను చిరస్థాయిగా తెలుగు ప్రేక్షకులు మరియు ఆయన అభిమానులు గుర్తుంచుకునేలా చేయబోతుంది..అదేమిటో ఇప్పుడు మేము ఈ ఆర్టికల్ లో మీ ముందు ఉంచబోతున్నాము.
ఇక అసలు విషయానికి వస్తే మహేష్ బాబు హైదరాబాద్ నడిబొడ్డున తన తండ్రి గారి జ్ఞాపకార్థం 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ‘సూపర్ స్టార్ కృష్ణ మెమోరియల్’ పేరిట భారీ బడ్జెట్ తో ఒక మ్యూజియమ్ ని ఏర్పాటు చెయ్యబోతున్నాడు..ఈ మ్యూజియం లో కృష్ణ గారి బాల్యం నుండి చివరి శ్వాస వరుకు ఆయన జీవిత ప్రయాణం ఉట్టిపడేలా మలచబోతున్నారట..కృష్ణ గారు 350 సినిమాల ద్వారా సాధించిన రికార్డులు..రివార్డులతో పాటు ఆయన జీవితం లో ఎదురుకున్న ఆటుపోట్లు..పడిన కష్టాలు కూడా ఈ మ్యూజియం లో పొందుపర్చనున్నారట..ఆరోజుల్లో కృష్ణ గారి సినిమా విడుదల అంటే రెండు తెలుగు రాష్ట్రాలు జాతారని తలపించే విధంగా ఉండేది..ఇప్పుడంటే సోషల్ మీడియా ద్వారా సెలెబ్రేషన్స్ కి సంబంధించిన వీడియోలు అందుబాటులోకి వస్తున్నాయి..కానీ ఆరోజుల్లో ఇలాంటివి ఏమి ఉండేది కాదు..కృష్ణ గారి సినిమాలు విడుదలైనప్పుడు కటౌట్లతో థియేటర్స్ ని ముంచేసావారట..దానికి సంబంధించిన ఫొటోలన్నీ కూడా ఈ మ్యూజియం లో ఉండనున్నాయి.
వచ్చే ఏడాది లోనే ఈ మ్యూజియం అత్యాధునిక టెక్నాలజీ తో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడు మహేష్ బాబు..ఆయన వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మహేష్ బాబు, కృష్ణ గారి లెగసీ ని ఏ స్థాయికి పెంచాడో మన అందరికి తెలిసిందే..ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి విలక్షణమైన నటన తో రికార్డ్స్ మీద రికార్డ్స్ సృష్టించి టాలీవుడ్ నెంబర్ 1 హీరో గా కొనసాగుతున్న మహేష్ బాబు ని చూసి కృష్ణ గారు ఎన్నో సార్లు గర్వపడిన సందర్భాలు గతం లో మనం ఎన్నో చూసాము..ఇప్పుడు ఆయన మన మధ్య లేకపోయినా కూడా ఆయనని చిరస్థాయిగా మన అందరం తలుచుకునేలా మహేష్ బాబు ఈ నిర్ణయం తీసుకోవడం చూస్తుంటే తన తండ్రి మీద ఆయనకీ ఎలాంటి ప్రేమ ఉందొ అందరికి అర్థం అయ్యేలా చేస్తుంది..ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి కొడుకు పుట్టదు అంటూ మహేష్ బాబు ఫాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.