
దసరా అయిపోయింది..దీపావళి వచ్చేసింది..దసరా పండుగకి మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ మరియు అక్కినేని నాగార్జున ఘోస్ట్ సినిమాలు విడుదల అయితే..దీపావళి కి ‘సర్దార్’, ‘ప్రిన్స్’ అనే రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు మరియు ‘ఓరిదేవుడా’ ,’జిన్నా’ అనే రెండు తెలుగు సినిమాలు విడుదలయ్యాయి..జిన్నా మినహా మిగిలిన మూడు సినిమాలు గురించి సోషల్ మీడియా లో అందరూ మాట్లాడుకుంటున్నారు..కానీ జిన్నా గురించి ఒకరు కూడా మాట్లాడుకోవట్లేదు పాపం..అయితే ఇప్పుడు మనం ఆ జిన్నా సినిమా గురించే మాట్లాడుకోబోతున్నాము..మంచు విష్ణు హీరో గా సన్నీ లియోన్ మరియు పాయల్ రాజ్ పుట్ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం మంచు విష్ణు మంచి కాస్టింగ్ ని తీసుకొని తెరకెక్కించినప్పటికీ కూడా కనీస స్థాయి హైప్ ని కూడా ఈ సినిమా దక్కించుకోలేకపోయింది..ఇక మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ లో అయితే ఈ సినిమా ఎవ్వరు సాధించలేని అరుదైన రికార్డుని సృష్టించిన మోహన్ బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’ ని సైతం బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది.
మోహన్ బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’ చిత్రానికి హైదరాబాద్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అక్షరాలా 50 టిక్కెట్లు అమ్ముడుపోయాయి..అప్పట్లో ఇది ఒక అరుదైన రికార్డు..ఈ రికార్డు ని మంచు విష్ణు తన జిన్నా సినిమాతో బద్దలు కొట్టేసాడు..మొదటి రోజు ఈ సినిమాకి హైదరాబాద్ సిటీ లో ఏకంగా 340 కి పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి..ఇంత మొత్తం లో టికెట్స్ అమ్ముడుపోవడం మంచు కుటుంబానికి పెద్ద ఘనతే అని చెప్పొచ్చు..ఇక ఈ సినిమా ఎలా ఉంది అనేది ఒక లుక్ వేస్తె, మంచు విష్ణు కాస్టింగ్ పట్ల తీసుకున్న శ్రద్ద, కథ మరియు కథనం పట్ల తీసుకొని ఉండుంటే ఈ చిత్రం బాగా ఆడేది అని తెలుస్తుంది..సన్నీ లియోన్ మరియు పాయల్ రాజపుట్ అందచందాలు మరియు వెన్నెల కిషోర్ కామెడీ వల్ల ఈ సినిమాకి సన్ ఆఫ్ ఇండియా రేంజ్ ఘోరమైన అవమానం ని అయితే తప్పించుకుంది అనే చెప్పాలి..మొదటి రోజు ఈ సినిమాకి 20 లక్షల రూపాయలకు పైగానే గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నయాట.
ఎంత మంచి కాస్టింగ్ పెట్టుకున్న మంచు విష్ణు అన్న కి సోషల్ మీడియా లో ఉన్న నెగటివిటీ కారణంగా ఈ చిత్రానికి మొదటి నుండి నెగటివ్ పబ్లిసిటీ అయ్యింది..మంచు విష్ణు తనని ట్రోల్ చెయ్యడానికి ఒక ప్రముఖ హీరో 20 మంది సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ ని పెట్టుకున్నదంటూ విచిత్రమైన మాటలు మాట్లాడి బాగా ట్రోల్ అయ్యాడు..ఇంతకీ అతను ఇలా పరోక్షంగా విమర్శిస్తోంది ఎవరినో కాదు..చిరంజీవి గారినే..చిరంజీవి గారిని ఈ కుటుంబం అన్ని విధాలుగా టార్గెట్ చేసినా కూడా మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చాడు చిరంజీవి..తండ్రి కొడుకులకు ఆ కృతజ్ఞత కూడా లేదు..ఎంతసేపు చిరంజీవి కుటుంబం పై బురద చల్లాలనే ప్రయత్నం తప్ప సినిమా మీద ఫోకస్ పెట్టి మంచి కంటెంట్ ని ప్రేక్షకులకు అందించాలనే ప్రయత్నం భవిష్యత్తులో అయినా చేస్తే బాగుంటుంది అని నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.