Home Entertainment డైరెక్టర్ సుకుమార్ పై నిప్పులు చెరుగుతున్న అల్లు అర్జున్ ఫాన్స్

డైరెక్టర్ సుకుమార్ పై నిప్పులు చెరుగుతున్న అల్లు అర్జున్ ఫాన్స్

2 second read
0
0
382

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ మెగాస్టార్ మేనల్లుడిగా అందరికీ తెలుసు. ముఖ్యంగా డ్యాన్సుల విషయంలో బన్నీ కుమ్మేస్తాడు అని పేరు తెచ్చుకున్నాడు. మరోవైపు సుకుమార్ లెక్కల మాస్టార్‌గా పనిచేసి పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అందుకే ఆయన ప్రతిసినిమాలో కొలతల ప్రకారం అన్ని అంశాలను జోడిస్తారు. దర్శకుడిగా ఆయన వరుస సక్సెస్‌లు అందుకుంటూ టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్‌గా ఎదిగారు. అయితే తొలిసారిగా అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ఆర్య సినిమా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. 2004లో వచ్చిన ఈ మూవీ అల్లు అర్జున్, సుకుమార్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయింది. ఆ తర్వాత ఈ సినిమాకు కొనసాగింపుగా వీళ్ల కాంబోలోనే ఆర్య-2 తెరకెక్కింది. ఈ సినిమా కూడా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. అయితే అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ వసూళ్లు సాధించలేకపోయింది. కట్ చేస్తే 2021లో అల్లు అర్జున్, సుకుమార్ మరోసారి ప్రేక్షకులను మాయ చేశారు.

పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్‌లోనే కాదు ఇంటర్నేషనల్‌ లెవల్లో అల్లు అర్జున్, సుకుమార్ ఇద్దరూ పేరు సంపాదించుకున్నారు. తగ్గేదే లే అంటూ బన్నీ ఈ సినిమాతో ఐకాన్ స్టార్‌గా ఎదిగిపోయాడు. సుకుమార్ కూడా ఈ సినిమాను అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దాడు. మాస్ కంటెంట్‌తో అన్ని ప్రాంతాల వారిని మాయ చేయవచ్చని ఈ సినిమాతో నిరూపించాడు. ఈ సినిమా దక్షిణాదిలో కంటే ఉత్తరాదిలోనే ఎక్కువ వసూళ్లు సంపాదించిందంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు మరోసారి అల్లు అర్జున్, సుకుమార్ కలిసి పనిచేస్తున్నారు. పుష్ప సినిమాకు కొనసాగింపుగా పుష్ప-2ని తెరకెక్కించడంలో సుకుమార్ బిజీగా ఉన్నాడు. నిజానికి పుష్ప లైన్ అనుకున్నప్పుడు ఒకే భాగంగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఒకసారి రంగంలోకి దిగిన తర్వాత లెక్కలు అన్నీ తారుమారు అయ్యాయి. నిడివి అంతకంతకూ పెరుగుతూ పోవడంతో ఏమి చేయాలా అని అలోచించి రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు.

తొలి భాగంగా ఎర్రచందనం చెట్లు కొట్టే కూలి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా నేషనల్ లెవెల్ స్మగ్లర్ లెవల్‌కు ఎలా ఎదిగాడు అన్న అంశంతో పుష్ప దిరైజ్ పేరుతో తెరకెక్కించి మంచి ఫలితం సాధించారు. ఇప్పుడు పుష్ప ది రూల్ పేరుతో తదుపరి భాగాన్ని విడుదల చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది. ఈ మూవీని ఈ ఏడాది డిసెంబర్ నెలలో విడుదల చేస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ కేజీఎఫ్-2 దెబ్బకు లెక్కలు తారుమారు అయ్యాయి. కేజీఎఫ్ 2 సినిమాకు హిందీ బెల్ట్‌లో విపరీతమైన క్రేజ్ లభించింది. ఈ క్రమంలో పుష్ప మేకర్స్ ఆలోచనలో పడ్డారని అంటున్నారు. సాదాసీదాగా సినిమాను తీసి వదిలేయకుండా దాన్ని విజువల్ గ్రాండియర్‌గా తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. అయితే ఇటీవల సుకుమార్ సినిమా ఫంక్షన్‌లకు హాజరు అవుతుండటంతో పుష్ప-2ని ఏం చేశారో అర్థం కాక బన్నీ అభిమానులు ఆందోళన పడుతున్నారు. అల్లు అర్జున్‌కు ఇచ్చిన మాట ప్రకారం ఈపాటికే పుష్ప సెకండ్ పార్ట్ ప్రారంభం అవ్వాలి. అయితే సుకుమార్ మాట తప్పి తాను ఖాళీగా ఉన్నట్లు సర్కారు వారి పాట, శేఖర్, అంటే సుందరానికి వంటి సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లలో కనిపించాడు. దీంతో పుష్ప సెకండ్ పార్ట్ ఎప్పుడు మొదలవుతుంది.. ఎప్పుడు విడుదలవుతుంది అంటూ బన్నీ ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు. అటు సుకుమార్ బన్నీ డేట్స్ అన్నీ వేస్ట్ చేస్తున్నాడనే ప్రచారం కూడా జరుగుతోంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…