Home Entertainment డిజాస్టర్ టాక్ తో కూడా అద్భుతమైన వసూళ్లు..4 రోజుల్లో ఎంత చేసిందో తెలుసా?

డిజాస్టర్ టాక్ తో కూడా అద్భుతమైన వసూళ్లు..4 రోజుల్లో ఎంత చేసిందో తెలుసా?

0 second read
0
0
239

యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ మాచర్ల నియోజకవర్గం. నితిన్ గత సినిమా మ్యాస్ట్రో ఓటీటీ రిలీజ్ కావడంతో మాచర్ల నియోజకవర్గం మూవీపై అతడి అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. పక్కా మాస్ మూవీగా ఈ మూవీ తెరకెక్కడం కూడా అభిమానుల్లో అంచనాలను పెంచేసింది. అయితే ఆగస్టు 12న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కొత్త దర్శకుడు రాజశేఖర్‌రెడ్డి ఈ మూవీని తెరకెక్కించడంలో తడబడినట్లు సినిమా చూసిన వాళ్లు చెప్తున్నారు. దీంతో తొలిరోజు బాక్సాఫీస్ దగ్గర బాగానే వసూళ్లు రాబట్టిన ఈ మూవీ రెండో రోజు నుంచి మాత్రం నెమ్మదించింది. అయితే హాలీడేస్ వీకెండ్ కావడంతో ఈ సినిమా ఎంత మేరకు వసూలు చేస్తుందన్న విషయం అందరిలోనూ ఆసక్తిని రేపింది. ఈ నేపథ్యంలో తొలి నాలుగు రోజుల్లో మాచర్ల నియోజకవర్గం మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.10 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ విశ్లేషకులు వెల్లడించారు.

ఏపీ, తెలంగాణ వరకు మాచర్ల నియోజకవర్గం వసూళ్లను చూసుకుంటే తొలిరోజు రూ.4.62 కోట్లను వసూలు చేసిన ఈ మూవీ రెండో రోజు రూ.1.40 కోట్లను మాత్రమే రాబట్టింది. మూడో రోజు రూ.1.06 కోట్లు, నాలుగో రోజు రూ.1.20 కోట్లు సొంతం చేసుకుంది. నాలుగు రోజుల్లో రూ.13.10 కోట్ల గ్రాస్, రూ.8.28 కోట్ల షేర్ వసూళ్లను సాధించింది. మాచర్ల నియోజకవర్గం సినిమా ఏపీ, తెలంగాణలో అత్యధిక థియేటర్లలో విడుదలైంది. నైజాంలో 235 థియేటర్లు, సీడెడ్‌లో 125 థియేటర్లు, ఏపీలోని మిగతా ఏరియాలలో 300 థియేటర్లు సహా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో 660కి పైగా థియేటర్లలో విడుదలైంది. అటు కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలో 80 థియేటర్లు, ఓవర్సీస్‌లో 200 థియేటర్లతో కలుపుకుని ప్రపంచ వ్యాప్తంగా 940కి పైగా థియేటర్లలో భారీగా విడుదలైంది. ఈ సినిమాకు రూ.22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ పండితులు వివరిస్తున్నారు. ఈ మూవీ నైజాంలో రూ.6 కోట్లు, సీడెడ్‌లో రూ.3 కోట్లు, ఏపీలోని మిగతా ప్రాంతాల్లో రూ.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిపింది. ఓవర్సీస్ రూ.1.2 కోట్ల సహా ప్రపంచ వ్యాప్తంగా రూ.22 కోట్ల బిజినెస్ చేయగా ఆ మేరకు వసూళ్లు రాబట్టాల్సి ఉంది.

మాచర్ల నియోజకవర్గం మూవీ సేవ్ కావాలంటే ఇంకా రూ.12 కోట్లు రాబట్టాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసాధ్యంగానే కనిపిస్తోంది. ఈ వారం ఈ మూవీతో విడుదలైన కార్తీకేయ-2కి సూపర్ డూపర్ హిట్ టాక్ రావడం ఈ సినిమాపై భారీ ప్రభావాన్ని చూపించింది. అటు మాచర్ల నియోజకవర్గం సినిమాలో నితిన్ సరసన కృతిశెట్టి హీరోయిన్‌గా నటించింది. రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణ లో శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. పక్కా రొటీన్ మార్క్ ఫిల్మ్ అని ప్రేక్షకులు తేల్చేయ‌డంతో ఎర్లీగానే ఓటీటీలో దర్శనమివ్వనుంది. ఈ మేరకు ఓటీటీ డీటైల్స్ బహిర్గతం అయ్యాయి. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 9న ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఇటీవల నిర్మాతల సంఘం మీడియం బడ్జెట్ సినిమాలకు నాలుగు వారాల ఓటీటీ రిలీజ్ గడువు విధించడంతో ఈ గడువు పూర్తి కాగానే మాచర్ల నియోజకవర్గం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…