Home Entertainment డబ్బుకంటే విలువైనది ప్రాణం..దయచేసి జాగ్రత్తగా ఉండు తల్లి

డబ్బుకంటే విలువైనది ప్రాణం..దయచేసి జాగ్రత్తగా ఉండు తల్లి

0 second read
0
1
7,325

టాలీవుడ్‌లో నాగచైతన్య, సమంత జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏమాయ చేశావే సినిమాతో మొదలైన వీరి ప్రయాణం ప్రేమ, పెళ్లి, విడాకులుగా మారింది. ఒకప్పుడు వీరిద్దరూ టాలీవుడ్ మోస్ట్ లవ్ కపుల్స్. కానీ వీరు విడిపోవడం అనేది టాలీవుడ్ ప్రేక్షకులు అసలు జీర్ణించుకోలేక పోతున్నారు. ముఖ్యంగా ఈ క్యూట్ కపుల్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికీ వీరు విడిపోయి సంవత్సరం గడిచినప్పటికీ సోషల్ మీడియాలో వీళ్ల గురించే చర్చ నడుస్తుంది. నిత్యం ఏదో విధంగా నాగచైతన్య సమంత వార్తల్లో నిలుస్తున్నారు. గతేడాది అక్టోబర్ 2న విడిపోతున్నట్లు ప్రకటించిన జంట ఎందుకు విడిపోతున్నారనేది మాత్రం స్పష్టతనివ్వలేదు. ఇంతలోనే సమంత ఒక పెద్ద షాక్ ఇచ్చింది. ఇటీవల తనకు మయోసిటీస్ అనే అరుదైన వ్యాధి వచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో ఆమె అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా సమంత ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ పోస్టులు పెట్టారు.

మరోవైపు సమంత అనారోగ్యంపై అక్కినేని ఫ్యామిలీ స్పందించాలని అభిమానులు కోరుకున్నారు. ఈ నేపథ్యంలో సమంత గురించి అక్కినేని అఖిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టడం అందరినీ ఆలోచింప చేసింది. నాగచైతన్య కూడా సమంతను నేరుగా కలిసి ధైర్యం చెప్పాడని ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది. కానీ అందుకు ఆధారాలు మాత్రం లభించలేదు. అటు నాగార్జున కూడా సోషల్ మీడియాలో ఎమోషనల్ వీడియో పోస్ట్ చేసి సమంతకు త్వరగా నయం కావాలని ఆశించాడు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సైతం సమంతకు ధైర్యం చెప్పారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. కాలానుగుణంగా మన జీవితాల్లో సవాళ్లు ఎదురవుతుంటాయని.. మనలోని అంతర్గత శక్తి ఏంటో తెలుసుకోడానికి ఆ సవాళ్లు ఎదురవుతాయని చిరు ట్వీట్ చేశాడు. సమంత ఒక అద్భుతమైన అమ్మాయి అని.. ఆమె అంతర్గతంగా ఎంతో ధైర్యంగా ఉంటుందని.. సమంత అతి త్వరలోనే అనారోగ్య సమస్య నుంచి బయపడుతుందని భావిస్తున్నట్లు చిరంజీవి ఆకాంక్షించారు. సమంత ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశాడు.

కాగా నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత వరుసగా ఐటం సాంగ్స్, వ్యాంప్ పాత్రలను చేస్తోంది. పుష్పలో ఐటం సాంగ్‌తో టాలీవుడ్‌లోకి కమ్ బ్యాక్ ఇచ్చింది. స్టార్ హీరోయిన్‌గా తెలుగు, తమిళ భాషల్లో రాణిస్తున్న సమంత ది ఫ్యామిలీ మెన్‌-2 వెబ్‌ సిరీస్‌తో జాతీయస్థాయిలో నటిగా పేరు తెచ్చుకుంది. ఎప్పుడు చిరునవ్వుతో ఉండే సమంత ఇప్పుడు మయోసిటీస్‌ అనే అరుదైన వ్యాధితో పోరాడుతోంది. సమంత అనారోగ్యం నేపథ్యంలో చైయ్, సామ్ ఫ్యాన్స్ ఎమోషనల్‌గా రెస్పాండ్ అవుతున్నారు. సమంత తన సోషల్ మీడియాలో చైతూతో ఉన్న ఫోటోలు డిలీట్ చేసినప్పటికీ.. చైతూ ఆ పని చేయలేదు. దీంతో ఆ ఫోటోల కింద ప్రజంట్ ఎమోషనల్ కామెంట్స్ పెడుతున్నారు. మళ్లీ వీళ్లిద్దరూ ఒక్కటి కావాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. సమంత కెరీర్ విషయానికొస్తే ఇప్పటికే శాకుంతలం, యశోద సినిమాలు కంప్లీట్ చేసిన ఆమె ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషీ సినిమాతో పాటు పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తన అనారోగ్యం కారణంగా సమంత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనుంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…