
2009 వ సంవత్సరం లో బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించిన చిత్రం అవతార్..పెద్ద టెక్నాలజీ లేని రోజుల్లోనే ఈ చిత్రం టెక్నికల్ పరంగా మనకి సరికొత్త అనుభూతిని కలిగించింది..థియేటర్ లో చూసిన ప్రతి ప్రేక్షకుడికి ఒక సరికొత్త లోకం లోకి ప్రవేశించాము అనే అద్భుతమైన అనుభూతిని కలిగించింది ఈ చిత్రం..అలాంటి వెండితెర అద్భుతం కి సీక్వెల్ కోసం జేమ్స్ కెమరూన్ సుమారుగా 12 ఏళ్ళ పాటు కష్టపడ్డాడు..అంత గ్యాప్ రావడం వల్లే ఈ సినిమాకి సరైన హైప్ తీసుకొని రాలేకపోయింది అని చెప్పొచ్చు..ఎందుకంటే ఈ పదేళ్లలో జెనెరేషన్ కూడా మారిపోయింది..ఇప్పుడొస్తున్న సీక్వెల్స్ అన్నీ కూడా కేవలం ఏడాది , లేదా రెండేళ్ల లోపు వస్తున్నవే..కాబట్టి క్రేజ్ ని కరెక్టుగా క్యాష్ చేసుకోగలిగాయి..అవెంజర్స్ సిరీస్ మరియు స్పైడర్ మ్యాన్ సిరీస్ లు అలా వచ్చినవే..అందుకే వాటి ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోసింగ్ వరకు అద్భుతాలు సృష్టించాయి..కానీ అవతార్ కి అది మిస్ అయ్యింది.
నార్త్ అమెరికా లో ఈ సినిమాకి మొదటి రోజు కేవలం 55 మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చాయి..అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ ఓపెనింగ్స్ కి దరిదాపుల్లో కూడా రాలేకపోయింది ఈ చిత్రం..అవెంజర్స్ మూవీ వీకెండ్ కి 280 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబడితే అవతార్ 2 వీకెండ్ కి కేవలం 170 మిలియన్ డాలర్లు మాత్రమే వసూలు చేసే అవకాశం ఉన్నట్టు హాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి..ఈ సినిమా బడ్జెట్ అక్షరాలా రెండు బిలియన్ డాలర్లు..లాంగ్ రన్ బాగుంటే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ..పార్ట్ 1 కలెక్షన్స్ ని దాటుతుందా లేదా అనేది పెద్ద ప్రశ్న..2009 లో విడుదలైన అవతార్ పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా 3 బిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది..ఇది అవతార్ 2 కొట్టడం పెద్ద సవాలు..పోనీ అవతార్ లాగ లాంగ్ రన్ ఉంటుందా అంటే OTT పుణ్యమా అని అది కూడా అనుమానమే.
ఇక ఇండియా లో కూడా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయి వసూళ్లు ఏమి రాబట్టలేదు..అన్ని భాషలు కలిపి కేవలం 50 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే మొదటి రోజు వచ్చాయి..కానీ ఎవెంజర్స్ ఎండ్ గేమ్ చిత్రం మాత్రం మొదటి రోజు 65 కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ వసూళ్లను రాబట్టాయి..అయితే ఇండియా లో అన్ని ప్రాంతాలకంటే ఎక్కువ వసూళ్లను రబ్బత్తింది మాత్రం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే..కేవలం తెలుగు వెర్షన్ వసూళ్లు సుమారు గా మొదటి రోజు 12 కోట్ల రూపాయలకు పైగానే షేర్ వసూళ్లు రాబట్టాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి..దీనిని బట్టి మన తెలుగు ఆడియన్స్ కి సినిమా పిచ్చి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు..ఓపెనింగ్స్ పెద్దగా లేకపోయినా ఫుల్ రన్ కచ్చితంగా ఉంటుందని అందరూ అంటున్నారు..చూడాలి మరి.