
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు ఎంతో ఆసక్తి గా మారిపోయాయి.ప్రతిపక్ష పార్టీలు వేస్తున్న వ్యూహాలు అధికార పార్టీ వైసీపీ కి ముచ్చమటలు పట్టించేలా చేస్తుంది,నిన్న మొన్నటి వరకు తెలుగు దేశం పార్టీ – జనసేన కలిసినా నన్ను ఏమి పీకలేరు అని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లో మొట్టమొదటిసారి భయం కనిపించింది.ఇటీవలే జరిగిన ఒక సభలో ఆయన ‘దమ్ముంటే తెలుగు దేశం మరియు జనసేన పార్టీలు 175 కి 175 స్థానాల్లో పోటీ చెయ్యాలి’ అంటూ ఛాలెంజ్ విసరడం వంటివి ఆయనలోని భయాలను బయటపెట్టింది తెలుస్తుంది.రీసెంట్ గా ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన గ్రౌండ్ లెవెల్ సర్వే రిపోర్ట్స్ వైసీపీ పార్టీ కి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.తెలుగు దేశం మరియు జనసేన పార్టీలు కలిస్తే కచ్చితంగా ఓటమి తప్పదు అనేది ఆ సర్వే రిపోర్ట్స్ సారాంశం.
ముఖ్యంగా ఈ రెండు పార్టీలు కలిస్తే వైసీపీ పార్టీ కోస్తాంధ్ర మొత్తం క్లీన్ బౌల్డ్ అవుతుందట.ఉభయగోదావరి జిల్లాలలో అన్నీ స్థానాలను తెలుగుదేశం – జనసేన పార్టీ కూటములు కైవసం చేసుకుంటుందని, వైసీపీ పార్టీ కి ఒక్క స్థానం కూడా దక్కే అవకాశం లేదని తెలుస్తుంది.కేవలం రాయలసీమ, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాలలో మాత్రమే వైసీపీ పార్టీ కి ఎక్కువ స్థానాలు వస్తాయని,ఈ మూడు జిల్లాలలో కూడా క్లీన్ స్వీప్ చేసే అవకాశం లేదని ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన లేటెస్ట్ సర్వే రిపోర్ట్స్ తెలిపిందట.ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా తెలుగుదేశం – జనసేన పార్టీ కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని, అక్కడ అసలు వైజాగ్ రాజధాని ని చేసిన అంశం కూడా ఏమాత్రం వైసీపీ పార్టీకి కలిసిరాలేదని తెలుస్తుంది.ఇదంతా పక్కన పెడితే అమరావతి పట్ల వైసీపీ పార్టీ చేసిన మోసం పై అక్కడి జనాలు తీవ్రమైన కోపంతో ఉన్నారని, దాని ప్రభావం కేవలం కృష్ణా జిల్లాలో మాత్రమే కాదు, గుంటూరు జిల్లాలో కూడా పడుతుందని తెలుస్తుంది.
మొత్తం మీద ప్రస్తుతం ఉన్న పరిస్థితి లో తెలుగు దేశం – జనసేన పార్టీ కూటమికి 120 స్థానాలు వస్తాయని, వైసీపీ పార్టీ కేవలం 55 స్థానాలకే పరిమితం అవుతుందని టాక్.మరి పవన్ కళ్యాణ్ – చంద్ర బాబు నాయుడు కలుస్తారా లేదా అనేది ఈ నెల 14 వ తారీఖున జరగబొయ్యే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు తెలియబోతుంది.మచిలీపట్టణం లో జరగబొయ్యే ఈ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం, రాష్ట్ర రాజకీయాల ముఖచిత్రాన్ని మార్చబోతుంది.