
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. ఆర్.ఆర్.ఆర్ మూవీ ఆస్కార్ అవార్డుల రేసులో ఉండటంతో ఈ చిత్ర యూనిట్‌తో కలిసి ఎన్టీఆర్ అమెరికాలో బిజీబిజీగా గడుపుతున్నాడు. బుధవారం నాడు ఇండియన్ సినిమా హిస్టరీలోనే తొలిసారిగా ఆర్.ఆర్.ఆర్ మూవీకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. నాటు నాటు సాంగ్‌కు అవార్డు రావడంతో సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ఆర్.ఆర్.ఆర్ మూవీ యూనిట్‌కు అభినందనలు తెలుపుతున్నారు. ఈ జాబితాలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా ఉన్నారు. ఆర్.ఆర్.ఆర్ మూవీకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంపై ఆయన ప్రత్యేకంగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ట్వీట్‌పై ఎన్టీఆర్ స్పందించాడు. థాంక్యూ సో మచ్ మావయ్య అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో ఏనాటికైనా ఎన్టీఆర్ టీడీపీలోకి వస్తాడని టీడీపీ అభిమానులు కోరుకుంటున్నారు.
అయితే అపర చాణుక్యుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి రావాలంటే గొప్పగా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వయసులో చంద్రబాబు ఒక్కడి వల్ల కాదని ఈ సంగతి అందరికీ తెలుసు. అందుకే పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన పార్టీని బయటకు తెచ్చి ఎలాగైనా టీడీపీతో కలపాలని చూస్తున్నారు. ఇటీవల చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లడం కూడా వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయన్న సంకేతాలను పంపించాయి. 2014 ఎన్నికల్లో చంద్రబాబు సీఎం కావడానికి పవన్ కళ్యాణ్ పరోక్షంగా సాయం అందించారు. దీంతో మరోసారి పవన్ సాయాన్ని చంద్రబాబు కోరుతున్నారు. వైసీపీని గద్దె దించే విధంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా చంద్రబాబు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో జగన్ సారథ్యంలోని వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. అందుకే నిత్యం పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ మంత్రులు ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ల ప్రతి మాటలోనూ టీడీపీ, జనసేన కలిసిపోతున్నాయనే ఆవేదన కనిపిస్తోంది. అయితే మంత్రులకు సోషల్ మీడియా వేదికగా జనసైనికులు చెక్ పెడుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ ట్వీట్ చూసి టీడీపీ, జనసేన పార్టీలకు మరో బలం చేకూరింది. ఈ రెండు పార్టీల కూటమికి వచ్చే ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారకర్తగా ఉండబోతున్నాడని తెలుస్తోంది. గతంలో 2009 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ తరఫున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంలో పాల్గొని ప్రత్యర్థుల మీద చేసిన ఆరోపణలు హైలెట్‌గా నిలిచాయి. అయితే రోడ్డుప్రమాదంలో గాయపడిన తర్వాత రాజకీయాలకు ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నాడు. కానీ ప్రస్తుతం టీడీపీ అధికారంలోకి రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ సాయం తప్పనిసరి అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని.. పవన్ కళ్యాణ్ మనతో చేతులు కలపబోతున్నాడని.. నువ్వు కూడా తోడుగా నిలిస్తే ఈసారి ఎన్నికలలో మన విజయాన్ని ఎవ్వరూ ఆపలేరని ఎన్టీఆర్‌ను చంద్రబాబు రిక్వెస్ట్ చేయడంతో అతడు కాదనలేక పోయినట్లు ప్రచారం జరుగుతోంది.