Home Entertainment టాలీవుడ్ ని ఏలేయడానికి వస్తున్నా హీరో సిద్దార్థ్ కొడుకు లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఆశ్చర్యపోతారు

టాలీవుడ్ ని ఏలేయడానికి వస్తున్నా హీరో సిద్దార్థ్ కొడుకు లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఆశ్చర్యపోతారు

0 second read
0
1
9,470

సౌత్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు లవర్‌బాయ్‌గా గుర్తింపు సంపాదించుకున్నారు. అలాంటి హీరోలలో సిద్ధార్థ్ కూడా ఉంటాడు. 1979లో చెన్నైలో జన్మించిన సిద్ధార్థ్‌కు తమిళంలో కంటే తెలుగులోనే స్టార్ ఇమేజ్ వచ్చింది. ముఖ్యంగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమాతో సిద్ధార్థ్ పేరు మార్మోగింది. ఈ మూవీతో ఐఫా అవార్డు కూడా అందుకున్నాడు. ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో సిద్ధార్థ్ తెలుగులో మంచి హిట్ అందుకున్నాడు. చుక్క‌ల్లో చంద్రుడు, బొమ్మ‌రిల్లు సినిమాల‌తో ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు క్రేజ్ కూడా పెంచేసుకున్నాడు. వీటితో పాటు చాలా చిత్రాల్లో న‌టించి తెలుగులో భారీస్థాయిలో రెమ్యునరేషన్ అందుకున్నాడు. ఏడేళ్ల గ్యాప్ త‌ర్వాత‌ ఆర్ఎక్స్ 100 ఫేం అజ‌య్ భూప‌తి డైరెక్ష‌న్‌లో మ‌హాస‌ముద్రంతో తెలుగు ప్రేక్షకులను ప‌లక‌రించాడు. ఈ చిత్రంలో అదితిరావు హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌లుగా న‌టించారు.

అయితే ఇటీవల సిద్ధార్థ్‌పై గాసిప్స్‌ను గమనిస్తే అతడు కేవలం ఆన్ స్క్రీన్‌పై మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్‌లో కూడా లవర్ బాయ్ అని అర్థమవుతోంది. మహాసముద్రం సినిమాలో తనతో నటించిన అదితిరావు హైదరీతో సిద్ధార్థ్ ప్రేమాయణం నడుపుతున్నాడని టాక్ నడుస్తోంది. ఇప్పటికే అదితిరావు హైదరీకి పెళ్లయింది. విడాకులు కూడా జరిగిపోయాయి. ఇప్పుడు సిద్ధార్థ్‌తో ప్రేమలో మునిగి తేలుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల వీరిద్దరూ కలిసి ముంబైలో మీడియా కంట పడ్డారు. దీంతో మీడియా వాళ్లు ఊరుకుంటారా వారి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే మీడియా వాళ్లను సిద్దార్థ్ ఫొటో తీయొద్దని చెబుతుంటే మ‌రోవైపు అదితీరావు మాత్రం హ్యాపీగా వారికి పోజులిచ్చింది. ప్రస్తుతం రిలేష‌న్ షిప్‌లో ఉన్న ఈ ఇద్ద‌రూ పెళ్లి చేసుకునే స‌న్నాహాలు కూడా చేస్తున్నారంటూ ఓ గాసిప్ ఇండస్ట్రీలో రౌండప్ చేస్తోంది.

అయితే సిద్ధార్థ్‌కు కూడా గతంలో వివాహం జరిగింది. 2003లో ఢిల్లీలో తన పొరుగింట్లోనే నివాసం ఉండే మేఘన అనే అమ్మాయిని ప్రేమించి సిద్ధార్థ్‌ పెళ్లి చేసుకున్నాడు. చెన్నైలో కాపురం కూడా పెట్టాడు. అయితే ఆ సమయంలో తనతో పాటు రంగ్ దే బసంతి సినిమాలో నటించిన సోహా అలీ ఖాన్‌తో సిద్ధార్థ్ ప్రేమాయణం నడిపాడు. ఈ విషయం తెలిసి భార్య మేఘన చీవాట్లు పెట్టడంతో విడిపోయాడు. అయితే తన భార్యతో విభేదాల కారణంగా 2007లో విడాకులు తీసుకున్నాడు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అతడు త్వరలోనే సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సిద్ధార్థ్ కుమారుడు సినిమాల కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వయసులోనూ సిద్ధార్థ్ ప్రేమ దోమ అంటూ హీరోయిన్‌ల వెంట పడుతున్నాడు. నాగచైతన్య కంటే ముందు స్టార్ హీరోయిన్ సమంత సిద్ధార్థతోనే ప్రేమలో పడింది. జబర్దస్త్ సినిమా సమయంలో మొదలైన వీరి ప్రేమ పైన కొన్ని రోజుల పాటు సాగి ఆ తర్వాత బ్రేకప్ అయ్యింది.

1

2

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…