
మన తెలుగు సినీ ఇండస్ట్రీ లో ప్రస్తుత తరం హీరో ల విజయాల శాతం ఏంటో చూద్దాం.ఈ జాబితా కేవలం హిట్ ,సూపర్ హిట్ ,బ్లాక్ బస్టర్ హిట్ ల మీద మాత్రమే ఆధార పడి ఉంటుంది.ఈ జాబితా లో 10 కంటే ఎక్కువ సినిమా ల లో సోలో హీరో గా నటించిన వాళ్ళ చిత్రాల విజయాల ని బట్టి ఇవ్వడం జరిగింది.
నాని మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా తెలుగు పరిశ్రమ లో కి అడుగు పెట్టి తన కంటూ ఒక ఇమేజ్ ఏర్పరుచుకున్నారు .తన సహజ మైన నటన తో అందరి మన్ననలు పొందాడు. ప్రస్తుతం ఉన్న హీరో ల లో నాని హిట్ శాతం 85 % గా ఉంది.తాను హీరో గా నటించిన 26 సినిమా ల లో 18 హిట్లు గా ఉన్నాయి.

హ్యాపీ డేస్ సినిమా తో పరిచయం అయినా వాళ్ళ లో నిఖిల్ మంచి స్టార్ గా ఎదిగాడు. విభిన్న మైన కథ ల తో తన కంటూ ఒక ఇమేజ్ ని ఏర్పరుచుకున్నాడు.నిఖిల్ యొక్క హిట్ల శాతం 70 % గా ఉంది. తాను హీరో గా నటించిన 18 సినిమా ల లో 11 హిట్లు ఉన్నాయి.

3 . అల్లు అర్జున్
గంగోత్రి సినిమా తో పరిచయం అయినా అల్లు అర్జున్ వరుస గా మూడు విజయాల తో స్టార్ హీరో గా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు.మన టాలీవుడ్ లో స్టైల్ స్టార్ గా సిక్స్ ప్యాక్ ని పరిచయం చేసిన బన్నీ 70 % విజయ శాతం కలిగి ఉన్నారు.తాను హీరో గా నటించిన 21 సినిమా ల లో 13 హిట్లు ఉన్నాయి.
4 .రామ్ చరణ్
చిరుత సినిమా తో పరిచయం అయినా రామ్ చరణ్ తన రెండవ సినిమా అయినా మగధీర తో ఇండస్ట్రీ సాధించారు. కమర్షియల్ సినిమాల కె ప్రదన్యం ఇచ్చిన రామ్ చరణ్ గోవిందుడు అందరివాడేలే ,ఆరంజ్ లాంటి ప్రయోగాత్మక చిత్రాల ల లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.ఇంకా రాజమౌళి గారి దర్శకత్వం లో వచ్చిన RRR తో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. ఇంకా చరణ్ 65 % విజయ శాతం కలిగి ఉన్నారు. తాను హీరో గా నటించిన 14 సినిమా ల లో 8 హిట్లు కలిగి ఉన్నారు.
5 .రామ్ పోతినేని
దేవదాసు సినిమా తో పరిచయం అయినా రామ్ తర్వాత తన కి ఉన్న ఎనర్జీ తో ఒక ఇమేజ్ ని సెట్ చేసుకుని వరుస సినిమా ల తో టాలీవుడ్ లో మంచి సక్సెస్ సాధించారు.డాషింగ్ డైరెక్టర్ పూరీజగన్నాధ్ వరుస అపజయాల తో ఉన్నపుడు ఇస్మార్ట్ శంకర్ తో పూరి కి సక్సెస్ ఇవ్వడం లో రామ్ తోడు అయ్యారు.రామ్ 55 % శాతం విజయాల తో ఉన్నాడు.తాను హీరో గా నటించిన 19 సినిమా ల లో 7 హిట్లు కలిగి ఉన్నారు.
6 .పవన్ కళ్యాణ్
టాలీవుడ్ పవర్ స్టార్ అయినా పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి తో పరిచయం అయ్యి ,వరుసగా 7 విజయాల తో సరికొత్త చరిత్ర సృష్టించాడు.తరువాత కొన్ని పరాజయాలు వచిన్నపటికి క్రుంగి పోకుండా జల్సా ,గబ్బర్ సింగ్ తో మల్ల విజయాల బాట పట్టారు. పవర్ స్టార్ 55 % శాతం విజయాల ని కలిగి ఉన్నారు.తాను హీరో గా నటించిన 27 సినిమా ల లో 13 హిట్లు కలిగి ఉన్నారు.
7 .మహేష్ బాబు
రాజకుమారుడు సినిమా తో పరిచయం అయినా మహేష్ బాబు మొదట్లో కమర్షియల్ హీరో గా రావడం కోసం బాగా కాస్త పడ్డారు,కృష్ణ వంశి మురారి తో బ్రేక్ వచ్చిన తరువాత ఒక్కడు తో టాప్ హీరో గా కొనసాగారు.ఈ మధ్య కాలం లో వరుసగా అన్ని హిట్లు సాధిస్తున్నారు. తన తరువాతి సినిమా రాజమౌళి గారి దర్శకత్వం లో ఉండటం అంచనాలని పెంచుతున్నాయి మహేష్ బాబు 55 % శాతం విజయాల ను కలిగి ఉన్నారు. తాను హీరో గా నటించిన 27 సినిమా ల లో 13 హిట్లు కలిగి ఉన్నారు.
8 .విజయ్ దేవరకొండ
పెళ్లిచూపులు తో సోలో హీరో గా వచ్చిన విజయ్ అర్జున్ రెడ్డి తో తెలుగు చిత్ర పరిశ్రమ నే కాకుండా యావత్ భారత దేశం తన వైపు చూసేలా చేసాడు,తరువాత వరుస హిట్లు తో మంచి ఇమేజ్ ని సాధించాడు. విజయ్ 50 % శాతం విజయాల ని కలిగి ఉన్నారు. తాను హీరో గా నటించిన 11 సినిమా ల లో 5 హిట్లు ఉన్నాయి.
9 .జూనియర్ ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటి సినిమా నిన్ను చూడాలని సరిగా ఆడలేదు ,తన తరుత చిత్రం అయినా స్టూడెంట్ no 1 తో హిట్ కొట్టిన ఎన్టీఆర్ ,ఆది ,సింహాద్రి తో తెలుగు లో మాస్ హీరో గా అవతరించాడు.అప్పటి లో చిరంజీవి కే పోటీ ఇచ్చేంత స్థాయి లోనే ఉన్నాడు. తరువాత ఎక్కువ అపజయాలు వచ్చిన బృందావనం నుంచి వరుసగా హిట్లు కొడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ 50 % శాతం విజయాల్ని కలిగి ఉన్నారు.తాను హీరో గా నటించిన 29 సినిమా ల లో 13 హిట్లు కలిగి ఉన్నారు.
10 .ప్రభాస్
బాహుబలి తో పాన్ ఇండియా హీరో అవ్వడమే కాకుండా తెలుగు సినిమా స్థాయి ని పెంచిన ప్రభాస్ .ఈశ్వర్ సినిమా తో ఎంట్రీ ఇచ్చి తన మూడో సినిమా అయినా వర్షం తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.బాహుబలి సిరీస్ తో టైం ఎక్కువ లేకపోవడం తో 20 సినిమా ల లోనే నటించిన ప్రభాస్ 9 హిట్ల తో 50 % విజయ శాతం కలిగి ఉన్నారు.