
ఎన్నో ఊహించని మలుపులు మరియు కంటెస్టెంట్స్ బావోదేవగల నడుమ..బిగ్ బాస్ సీజన్ 6 ఇప్పుడు గ్రాండ్ ఫినాలే కి ఒక్క అడుగు దూరం లో ఉంది.. 21 కంటెస్టెంట్స్ తో కనివిని ఎరుగని రేంజ్ లో ప్రారంభమైన ఈ సీజన్ మొదట్లో బాగా బోరింగ్ గానే ఉండేది..కంటెస్టెంట్స్ కూడా పెద్దగా ప్రేక్షకులకు పరిచయం లేకపోవడం తో ఆడియన్స్ అసలు ఆసక్తి చూపించలేదు..అందువల్ల టీఆర్ఫీ రేటింగ్స్ బాగా పడిపోయాయి..దీనితో ఆటని ఆసక్తికరంగా మలిచేందుకు బిగ్ బాస్ ఎన్నో ఎత్తులు వేసాడు..అవన్నీ ఫలించాయి..ఫలితంగా డిజాస్టర్ అవ్వాల్సిన ఈ సీజన్ ఇప్పుడు యావరేజి గా నిలిచింది..13 వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటి వరుకు 14 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు..మొన్న ఆదివారం ఫైమా ఎలిమినేట్ అయిపోయింది..ఇక హౌస్ లో ఇప్పుడు మిగిలి ఉన్న కంటెస్టెంట్స్ రేవంత్, రోహిత్ , శ్రీహాన్ , ఆడి రెడ్డి , కీర్తి ,ఇనాయ మరియు శ్రీ సత్య.
వీరిలో శ్రీహాన్ ఇప్పటికే టికెట్ 2 ఫినాలే టాస్కు గెలుపొంది ఫైనల్స్ కి వెళ్ళిపోయాడు..రేవంత్ , రోహిత్ మరియు ఇనాయ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్..నామినేషన్స్ లోకి వచ్చినప్పుడల్లా వీళ్లకు అద్భుతమైన వోటింగ్ ఉంటుంది..ఇక మిగిలిన ముగ్గురు కంటెస్టెంట్స్ అనగా శ్రీ సత్య ,కీర్తి మరియు ఆది రెడ్డి లలో ఎవరు టాప్ 5 లోకి వెళ్ళబోతున్నారు అనేది నిన్న మొన్నటి వరుకు సస్పెన్స్ గా ఉండేది..కానీ ఈరోజు వోటింగ్ లైన్ మొదలైన తర్వాత ఆది రెడ్డి మిగిలిన ఇద్దరి కంటెస్టెంట్స్ కంటే చాలా ఓట్ల తేడా తో ఆధిక్యం లో ఉన్నాడు..ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ వారం కీర్తి మరియు శ్రీ సత్య ఎలిమినేట్ అయిపోతారు..ఆది రెడ్డి టాప్ 5 లోకి వెళ్తాడు..ఇదే జరుగుతుందని విశ్లేషకులు కుండబద్దలు కొట్టిమరీ చెప్తున్నారు..మరి ఇందులో ఎంతవరుకు నిజం అవుతుందో తెలియాలంటే ఈ ఆదివారం వరుకు వేచి చూడాల్సిందే.
ఒకవేళ ఆది రెడ్డి టాప్ 5 లోకి అడుగుపెడితే అతనికి టైటిల్ గెలుచుకునే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి..ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి టాప్ 5 లోకి వచ్చిన దాఖలాలు ఇప్పటి వరుకు లేదు..ఆది రెడ్డి టాప్ 5 లోకి వస్తే సామాన్యుడిని గెలిపించుకోవాలని నినాదం అందరిలో మొదలవుతుంది..అది సానుభూతిగా మారితే మాత్రం బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ విన్నర్ గా ఆది రెడ్డి గెలుస్తాడు..యూజ్ ప్రతి సీజన్ లో లాగ ఈ సీజన్ ఏ కంటెస్టెంట్ కి కూడా కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడలేదు..ప్రతి వారం వోటింగ్ లో తేడా జరుగుతూనే వస్తుంది..కానీ రేవంత్ కి మాత్రం మొదటి వారం నుండి నేటి వరుకు అందరికంటే అత్యధిక ఓట్లు వస్తూనే ఉన్నాయి..కానీ అతనికి ఇప్పుడు ఇనాయ , రోహిత్ చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నారు..వీళ్ళని అధిగమించి ఆది రెడ్డి సక్సెస్ సాధిస్తాడా..లేదా టాప్ 5 లిస్ట్ కి పరిమితం అవుతాడా అనేది చూడాలి.