Home Entertainment జేమ్స్ సినిమా చూసి పునీత్ రాజ్ కుమార్ అన్నయ్య శివ రాజ్ కుమార్ ఎలా కన్నీళ్లు పెట్టాడో చూడండి

జేమ్స్ సినిమా చూసి పునీత్ రాజ్ కుమార్ అన్నయ్య శివ రాజ్ కుమార్ ఎలా కన్నీళ్లు పెట్టాడో చూడండి

0 second read
0
0
133

కన్నడ ప్రజలు ఆరాధ్య దైవంగా భావించే అతి కొద్దీ మంది హీరోలలో ఒక్కరు పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, ఈయనకి ఉన్న క్రేజ్ మామూలుది కాదు , సినిమాల్లోనే కాకుండా నిజ జీవితం లో కూడా ఎన్నో సేవ కార్యక్రమాలు చేపట్టి రియల్ హీరో అనిపించుకున్నాడు, అలాంటి గొప్ప వ్యక్తి అకాలంగా గుండెపోటు తో మరణించడం యావత్తు సినీ లోకాన్ని శోక సంద్రం లో ముంచేసిన సంఘటన మన అందరికి తెలిసిందే, ఇప్పటికి కూడా మనం ఆ సంఘటనని గుర్తు చేసుకునప్పుడల్లా మన కంట్లో నీళ్లు రాకుండా మానదు, ఇక ఆయనని అభిమానిం,చే కోట్లాది మంది అభిమానుల ప్రస్తుత పరిస్థితి ని వర్ణించడానికి మాటలు కూడా సరిపోవు అనడం లో ఎలాంటి సందేహం లేదు, నిన్న పునీత్ రాజ్ కుమార్ చివరి చిత్రం జేమ్స్ ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే , తమ అభిమాన హీరో సినిమా విడుదల అయ్యినందుకు ఆనందపడాలో, లేక ఇక నుండి తమ అభిమాన హీరో ని వెండితెర మీద చూడలేము అని బాధపడాలో తెలియని పరిస్థితి అది, వాళ్ళ మనసులు బాధతో ఎంత బరువెక్కిపోయ్యి ఉంటుందో ఊహించడానికి మన శక్తి సరిపోదు.

అభిమానులకే ఇంత బాధ ఉన్నప్పుడు ఇక చిన్నప్పటి నుండి పునీత్ తో కలిసి పెరిగిన ఇంట్లో వాళ్ళ సంగతి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు , తన తమ్ముడు ని సొంత కొడుకులాగా చోసుకునే వాడు పునీత్ రాజ్ కుమార్ గారి అన్నయ్య శివ రాజ్ కుమార్ గారు, పునీత్ ప్రతి సినిమాని మొదటి రోజు పునీత్ తో కలిసి కుటుంబ సమేతంగా చూసేవాడు శివ రాజ్ కుమార్ , కానీ మొట్టమొదటిసారి తన తమ్ముడు లేకుండా జేమ్స్ సినిమా చూసి కనీతి పర్యంతం అయ్యారు శివ రాజ్ కుమార్ గారు,సినిమా చూసి ఆయన మాట్లాడుతూ ‘ ఈరోజు జేమ్స్ సినిమా కి అభిమానుల నుండి వస్తున్నా ఆదరణ చూస్తుంటే నా రోమాలు నిక్కపొడుస్తున్నాయి , కానీ నా తమ్ముడు మీరు చూపించిన ఈ అభిమానం ని చూడడానికి ఈరోజు మనతో లేదు, చాలా బాధ వేస్తుంది, కానీ మొదటి సినిమా నుండి వాడి మీద మీరంతా చూపించిన కొండంత ప్రేమ వాడు ఏ లోకం లో ఉన్న మర్చిపోడు, ఈరోజు జేమ్స్ సినిమా సాధించిన విజయం ని కూడా మనతో పాటే ఇక్కడే ఎక్కడో నిల్చొని చూస్తూ ఆనందిస్తూ ఉంటాడు ‘ అంటూ పునీత్ రాజ్ కుమార్ గురించి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నాడు శివ రాజ్ కుమార్ గారు.

ఇక జేమ్స్ సినిమా మొదటి రోజు వసూళ్లు 88 ఏళ్ళ కన్నడ చలన చిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా చెక్కుచెదరని రికార్డు గా నిలిచిపొయ్యే రేంజ్ ఓపెనింగ్ ని కొట్టింది అనే చెప్పాలి, ఈ సినిమాకి మొదటి అర్జు అమ్ముడు పోయిన టిక్కెట్ల సంఖ్యని చరిత్రలో మరో సినిమా కొట్టలేదు అని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త, కర్ణాటక లో నిన్న ప్రతి థియేటర్ లో పునీత్ రాజ్ కుమార్ గారి జేమ్స్ సినిమాని ప్రదర్శించారు, ప్రతి చోట హౌస్ ఫుల్ బోర్డులతో దర్శనమిస్తూ ఈ సినిమా కేవలం కర్ణాటక ప్రాంతం నుండి 30 కోట్ల రూపాయిల గ్రాస్ ని సాధించేలా చేసింది,తోలి నాలుగు రోజుల్లోనే ఈ సినిమా కర్ణాటక లో వంద కోట్ల రూపాయిల గ్రాస్ మార్కు ని అందుకొని ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలబడబోతుంది అని సినీ పండితుల అంచనా, రెండవ రోజు వచ్చిన వసూళ్లు చూస్తుంటే ఈ సినిమా ప్రభంజనం ఇప్పట్లో ఆగేలా లేదు అని తెలుస్తుంది, దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు, పునీత్ రాజ్ కుమార్ గారిని ఆయన అభిమానులు ఏ స్థాయిలో ఆరాధిస్తారో అని చెప్పడానికి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

సింగర్ వాణి జయరాం మృతి పై తలెత్తుతున్న అనుమానాలు..!

కన్నడతో పాటు పలు భాషల్లో 10,000కు పైగా పాటలు పాడిన నటి వాణీ జయరామ్ ఈరోజు (ఫిబ్రవరి 4) చెన్…