
మన టాలీవుడ్ లో ఫాన్స్ వార్ అనేది సీనియర్ ఎన్టీఆర్ ,అక్కినేని నాగేశ్వర రావు గార్ల కాలం నుంచి ఉంది ,కానీ వాళ్ళు అప్పటి లో పదుల సంఖ్య లో కలిసి ఒకే సినిమా లో నటించే వారు, ఆ సినిమా లో ఉన్న కథ ,కథనాలు ఆయా హీరో ల అభినయం మాత్రమే అప్పుడు చూసే వారు .ఆ తరువాత కృష్ణ గారు ,శోభన బాబు గారు ,కృష్ణం రాజు గారు కూడా పలు చిత్రాల లో కలిసి నటించి అలరించారు, వారి తరం తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు ,బాలకృష్ణ గారు ,వెంకటేష్ ,నాగార్జున వచ్చే సరికి ఫాన్స్ వార్స్ ఇంకొంచెం తీవ్ర స్థాయి కి వెల్లింది ,దానికి తోడు మన తెలుగు లో కుల పిచ్చి కూడా ఉంటుంది.
చిరంజీవి గారి తరం హీరో లు మల్టీ స్టారర్ లో నటించపోయిన మంచి సఖ్యత తో ఉన్నారు ,కానీ ఇప్పటి తరం యువ హీరో లు అలా లేరు అనే చెప్పాలి .సినిమా స్థాయి పెరగడం ,రెమ్యూనిరేషన్ ,మొదలగు విషయాల దృష్ట్యా ఎవరికీ వారే అన్నట్లు ఉండే వాళ్ళు.కానీ ఈ మధ్య కాలం లో తెలుగు సినిమా కి మంచి రోజులు వచ్చాయి అనే చెప్పాలి ,హీరో ల కి ఉన్న ఈగో ల ని పక్కన పెట్టి మల్టీ స్టారర్ లో నటించేందుకు హీరో లు ముందుకు వస్తున్నారు.
ఇద్దరు పెద్ద హీరోలు కలిసి ఒక సినిమాలో నటిస్తుంటే హీరోల మధ్య ఉండే దాని కంటే వారి ఫ్యాన్స్ మధ్య ఈగో అనేది అగ్గి రాజుకుంటుంది. ఎవరిది పై చేయి అనే పోలిక మొదలవుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో ఇదే జరిగింది.మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ ,నందమూరి ఫ్యామిలీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ తమ తమ కి ఇచ్చిన పాత్రల కి జీవం పోశారు. కానీ మా హీరో గొప్ప ,లేదు మా హీరో గొప్ప అంటూ ఫాన్స్ పోలిక లు పెడుతూ వచ్చారు. ఈ పోలిక ఇంకా కొనసాగుతోంది. నిజానికి ఇద్దరిలో ఎవరు బాగా చేశారు అనే పోలిక పెట్టే వీలు లేనంత గొప్పగా ఇద్దరూ రామ్, భీమ్ పాత్రల్లో అద్భుతంగా జీవించారు. అయినా కానీ చరణ్, ఎన్టీఆర్ లలో ఎవరు గొప్ప అనే పోలిక పెట్టుకుంటూ ఇరువురి ఫ్యాన్స్ ఇంకా సోషల్ మీడియా వేదికగా గొడవ పెట్టుకుంటున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ విషయంలో అవమానం జరిగిందని తారక్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ కోసం యూఎస్ వెళ్లారు.
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ రేసులో నిలిచిన విషయం తెలిసిందే. అవార్డు వేడుక మార్చి 12న జరగనుండగా.. ఎన్టీఆర్, చరణ్ లు పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో టాక్ ఈజీ విత్ సామ్ ఫ్రోగోసో పాడ్ కాస్ట్ షోలో రామ్ చరణ్ పాల్గొన్నారు. ఈ పాడ్ కాస్ట్ లో రామ్ చరణ్ తన హాలీవుడ్ డెబ్యూ సహా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అయితే ఈ ఇంటర్వ్యూలో పాడ్ కాస్ట్ షో హోస్ట్ ఎన్టీఆర్ ని అవమానించే విధంగా మాట్లాడడం ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ ని ఆగ్రహానికి గురి చేసింది. ఈ ఇంటర్వ్యూలో సదరు హోస్ట్.. ఎన్టీఆర్ ను సైడ్ హీరో అంటూ సంబోధించాడు. సైడ్ యాక్టర్ ఎన్టీఆర్ జూనియర్ అంటూ మాట్లాడిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై తారక్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.ఎన్టీఆర్ ని సైడ్ యాక్టర్ అనడం ఏమిటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొన్నా మధ్య కూడా HCA స్పాట్ లైట్ అవార్డ్స్ విషయంలో కూడా ఎన్టీఆర్ ని తక్కువ చేశారని మండిపడ్డారు. అయితే ఆ తర్వాత జ్యూరీ ఎన్టీఆర్ కార్యక్రమానికి రాలేకపోవడం వల్ల అవార్డు ఇవ్వలేదని, త్వరలో అవార్డు పంపిస్తామని క్లారిటీ ఇచ్చింది. ఈ వివాదం ముగిసేలోపే ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్ సైడ్ యాక్టర్ అంటూ సదరు హోస్ట్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడంపై తారక్ ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు.