
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ ని ఈ ఏడాది విడుదలైన #RRR చిత్రం ఏ రేంజ్ లో ఊపేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..విడుదలైన ప్రతి భాషలో ఈ సినిమా కాసుల కనకవర్షం కురిపించి 1200 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని కొల్లగొట్టింది..బాహుబలి పార్ట్ 2 తర్వాత వెయ్యి కోట్ల రూపాయిల మార్కుని అందుకున్న ఏకైక సినిమా ఇదే..ఆ తర్వాత KGF చాప్టర్ కూడా ఆ లిస్ట్ లో చేరింది..అయితే #RRR చిత్రం థియేట్రికల్ పరంగా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో..OTT లో విడుదలైన తర్వాత అంతకు మించి విజయం సాధించింది..ఈ సినిమాలో నటించిన హీరోలిద్దరి నటనకు ప్రపంచం లో ఉన్న ప్రతి ఒక్క సినీ అభిమాని పొగడ్తలతో ముంచి ఎత్తారు..ఇక దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వ ప్రతిభ ని అయితే ఆకాశానికి ఎత్తేసారు..అంతటి సంచలన విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు ఆస్కార్ అవార్డ్స్ రేస్ లో కూడా చోటు దక్కించుకునే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
OTT లో విడుదలైన తర్వాత ఎక్కువ మంది ఫారిన్ ప్రేక్షకులు రామ్ చరణ్ ని ఆయన నటనని మెచ్చుకోగా..ఇటీవల కాలం లో జూనియర్ ఎన్టీఆర్ కి కూడా మంచి గుర్తింపు రావడం గమనిస్తున్నాము..హాలీవుడ్ కి చెందిన ప్రముఖ మ్యాగజైన్ వెరైటీ లో ఆస్కార్ అవార్డ్స్ కి జూనియర్ ఎన్టీఆర్ పేరు ని మరియు రాజమౌళి పేరు ని ఉద్దేశించి ఒక ఆర్టికల్ వేసాడు..వీళ్ళిద్దరిలో ఒకరికి కచ్చితంగా ఆస్కార్ అవార్డు వస్తుందని ఆయన ప్రెడిక్ట్ చేసాడు..ఇక అప్పటి నుండి ఎన్టీఆర్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది..ఆయన ఆస్కార్ అవార్డ్స్ కి నామినెటే అవుతాడా లేదా అనేది పక్కన పెడితే ఈరోజు ఆయన మన దేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఎన్టీఆర్ ని ప్రత్యేకంగా లంచ్ కి కలవబోతున్నారు..ఇటీవలే ఆయన #RRR సినిమా చూశాడట..ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన ఆయనకీ ఎంతో అద్భుతంగా నచ్చడం తో ఆయనని ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలియచేయాలని ఉద్దేశ్యం తో లంచ్ కి ఆహ్వానించినట్టు తెలుస్తుంది.
అయితే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ని కలవడం పై రాజకీయ కోణం కచ్చితంగా ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..అమిత్ షా ఇది వరకే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ని విలీనం చెయ్యమని అనేక సార్లు ప్రతిపాదన తెచ్చాడు..కానీ పవన్ కళ్యాణ్ అందుకు ఒప్పుకోలేదు..ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ని బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు..ఆయన కూడా ఆ ప్రతిపాదనని సున్నితంగా తిరస్కరించారు..ఇప్పుడు మెల్లిగా జూనియర్ ఎన్టీఆర్ ని బీజేపీ పార్టీ లోకి లాగడానికే ఈరోజు ఆయనతో లంచ్ కార్యక్రమం ని ఏర్పాటు చేసారంటూ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఇప్పటికే తమిళనాడు నుండి సూపర్ స్టార్ రజినీకాంత్ ని బీజేపీ పార్టీ కి మద్దతుగా పెట్టుకున్నారు..పవన్ కళ్యాణ్ సపోర్టు కూడా ఉంది..ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ కూడా తోడై ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో పాగా వెయ్యాలని అనుకుంటున్నట్టు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ చూడాలి.