
మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తెలుగు దేశం పార్టీ కి ఎలాంటి సుదీర్ఘ ప్రస్థానం ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు వారి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఈ పార్టీ ని స్థాపించి, తొలి సార్వత్రిక ఎన్నికలలోనే 270 కి పైగా స్థానాలను సాధించి, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా సరికొత్త ప్రభంజనం సృష్టించాడు..ఇక ఆయన తదనంతరం ఆ పార్టీ పగ్గాలను చేపట్టి చంద్రబాబు నాయుడు దాదాపుగా మూడు దశాబ్దాల నుండి విజయవంతంగా తెలుగు దేశం పార్టీ ని నడిపిస్తూ మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన సంగతి మన అందరికి తెలిసిందే..అంతతి సుదీర్ఘ ప్రస్థానం ఉన్న తెలుగు దేశం పార్టీ ప్రస్తుతం మసకబారిపోయింది అనే చెప్పాలి..2019 సార్వత్రిక ఎన్నికలలో కేవలం 23 స్థానాలను స్థాపించి చావు దెబ్బ తిన్న తెలుగు దేశం పార్టీ..అప్పటి నుండి ఇప్పటి వరుకు ఇంకా కోలుకోలేదు..గడిచిన లోకల్ బాడీ ఎన్నికలలో కూడా ఈ పార్టీ కి వచ్చిన ఫలితాలు అంతంత మాత్రమే..నిన్నగాక మొన్న వచ్చిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కోస్తాంధ్ర లో టీడీపీ కంటే ఈ ఎన్నికలలో మెరుగైన ఫలితాలు పొందడం..రాబొయ్యే రోజుల్లో జనసేన పార్టీ నే టీడీపీ స్థానం లో ప్రధాన ప్రతిపక్షంగా ఉండడం ఖాయమనే సూచనలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
ఇక తెలుగు దేశం పార్టీ కి మళ్ళీ పూర్వ వైభవం రావాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ వస్తే మాత్రమే జరుగుతుంది అని చంద్ర బాబు నాయుడు కి పార్టీ లోని పలువురు నాయకులు సలహాలు ఇస్తున్నారు..ఒక్కవేల జూనియర్ ఎన్టీఆర్ రంగం లోకి దిగకపోతే 2024 సార్వత్రిక ఎన్నికల లోపు పవన్ కళ్యణ్ ఒక్కవేల పాదయాత్ర వంటివి చేసి ప్రజాదరణ పొందితే మాత్రం మన తెలుగు దేశం పార్టీ సగం ఖాళి అయ్యిపోతుంది అని..అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చిన పెద్ద ఉపయోగం ఉండదు అని చంద్ర బాబు నాయుడు కి కొంత మంది సీనియర్ నాయకులు సలహాలు ఇస్తున్నారు..కానీ జూనియర్ ఎన్టీఆర్ కి ప్రస్తుతం రాజకీయాల మీద ఆసక్తి లేదు..వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీ గా కాలం గడుపుతున్నాడు..అయితే 2024 సార్వత్రిక ఎన్నికలలో ఆయన స్వయానా చంద్ర బాబు నాయుడు వచ్చి అడిగినా కూడా కూడా ఎన్నికల ప్రచారాలకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నాడు అట..అసలు జూనియర్ ఎన్టీఆర్ మనసులో ఉన్న అభిప్రాయం ఏమిటి?..ఒక్కవేల ఆయన రాజకీయాల్లోకి వస్తే చంద్ర బాబు నాయుడు లోకేష్ ని కాదు అని జూనియర్ ఎన్టీఆర్ కి సీఎం అభ్యర్థిగా నిలబెడుతాడా?, అలా చెయ్యకపోతే ఎన్టీఆర్ పార్టీ లోకి రారా అనే సందేహాలు అభిమానుల్లో ఉన్నాయి.
కానీ జూనియర్ ఎన్టీఆర్ కి రాజకీయాల పైన ఆసక్తి ఉన్నప్పటికీ ప్రస్తుతం చేతినిండా సినిమాలు ఉండడం తో 2029 వరుకు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు అని తెలుస్తుంది..ఒక్కవేల రాజకీయాల్లోకి వచ్చినా కూడా తెలుగు దేశం పార్టీ లోకి అడుగుపెట్టే ఛాన్స్ లేదు అని..తాత గారి పేరుతో కొత్త రాజకీయ పార్టీ ద్వారా జనాల ముందుకి వస్తాడు అని ఎన్టీఆర్ సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం..ఇదే కనుక జరిగితే తెలుగు దేశం పార్టీ వోట్ బ్యాంకు మొత్తం జూనియర్ ఎన్టీఆర్ కి షిఫ్ట్ అవుతుంది..అక్కడ ఉండే మహామహా రాజకీయ నాయకులు మొత్తం ఎన్టీఆర్ వైపు నిలబడే అవకాశం ఉంది అని..ఆయన ముఖ్యమంత్రి అవ్వడం పెద్ద కష్టమైన పని ఏమి కాదు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు..ప్రస్తుతం ఎన్టీఆర్ #RRR మూవీ సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు..ఈ సినిమా తర్వాత ఆయన కొరటాల శివ మరియు ప్రశాంత్ నీల్ వంటి దర్శకులతో పని చెయ్యబోతున్నాడు..కొరటాల శివ తో చెయ్యబొయ్యే సినిమా జూన్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంబించుకోబోతుంది.