
2020 వ సంవత్సరం లో మూవీ ఇండస్ట్రీ మొత్తం చిరకాలం గుర్తించుకునేలా మెగా బ్రదర్ నాగబాబు నిహారిక కొణిదెల వివాహం ని జరిపించిన సంగతి తెలిసిందే.ఈ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులను అంత సంతోషం తో చూసిన ఫ్యాన్స్ కడుపు నిండిపోయింది.జీవితాంతం గుర్తించుకునేలా ఈ వివాహ మహోత్సవం చరిత్ర లో నిలిచిపోయింది.చిలక గోరింకా లాగా సంతోషం ఉన్న ఈ జంట మధ్య గత కొంతకాలం నుండి విబేధాలు రావడం తో విడాకులు తీసుకున్నారు అంటూ సోషల్ మీడియా లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది.ఇప్పటికే ఇంస్టాగ్రామ్ లో అటు నిహారిక , ఇటు చైతన్య ఇప్పటి వరకు తాము కలిసి దిగి ఉన్న ఫొటోలన్నీ డిలీట్ చేసేసారు.ఒకరిని ఒకరు అన్ ఫాలో కూడా కొట్టేసుకున్నారు.ఇదంతా చూస్తున్న మెగా ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు.
అంత మంచిగా ఉన్న మీ మధ్య ఇలాంటి గొడవలు రావడం ఏమిటి, విడిపోవడం ఏమిటి అని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.అయితే ఈ వార్తలపై నాగబాబు ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు కానీ, నిహారిక కొణిదెల మాత్రం రీసెంట్ గా పాల్గొన్న ఒక కార్యక్రమం లో పరోక్షంగా స్పందించింది.’మనకి స్వేచ్ఛ లేని చోట ఇబ్బంది పడుతూ ఉండడం కంటే, బయటకి వచ్చేయడం బెటర్.నేను జీవితం లో అలాంటి తప్పు ఒకసారి చేశాను.మళ్ళీ అలాంటివి జరగకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నాను’ అంటూ ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.ఇది కచ్చితంగా తన విడాకుల గురించి పరోక్షంగా చేసిన కామెంట్స్ అని అంటున్నారు అభిమానులు.ఇంతకీ తాను స్వేచ్ఛ కోల్పోయేంత పరిస్థితి నిహారిక కి ఏమొచ్చింది.పాలు నీళ్లు లాగ కలిసి ఉండే వీళ్ళ మధ్య ఏమి జరిగింది అని తెలుసుకోవడానికి అభిమానులు ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం నిహారిక కొణిదెల నటన కి స్వస్తి చెప్పి తన తండ్రిలాగానే నిర్మాణ రంగం లోకి అడుగుపెట్టింది.ఇప్పటి వరకు ఈమె పలు వెబ్ సిరీస్ లను నిర్మించింది, వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇప్పుడు లేటెస్ట్ మరో వెబ్ సిరీస్ ని ప్రారంభించబోతుంది అట.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజెయ్యనుండి.హీరోయిన్ గా గతం లో ఈమె పలు సినిమాల్లో నటించిన సంగతి తెల్సిందే.అయితే సక్సెస్ కాలేకపోయింది, నటించిన ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.ఇక మనం నటనకి పనికి రాము అని గ్రహించిన నిహారిక రూట్ మార్చి నిర్మాతగా మారి సక్సెస్ అయ్యింది.