Home Entertainment జిమ్ చేస్తూ కుప్పకూలిపోయిన పునీత్ రాజ్ కుమార్ చివరి వీడియో..చూస్తే ఏడుపు ఆపుకోలేరు

జిమ్ చేస్తూ కుప్పకూలిపోయిన పునీత్ రాజ్ కుమార్ చివరి వీడియో..చూస్తే ఏడుపు ఆపుకోలేరు

0 second read
0
0
187

కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్నడ కంఠీరవ, లెజెండరీ నటుడు రాజ్ కుమార్ కొడుకుగా మాత్రమే చాలా మందికి పునీత్ రాజ్‌కుమార్ గురించి తెలుసు. పునీత్‌కు తెలుగులో ప్రత్యేకంగా గుర్తింపేమీ రాలేదు. పునీత్ నటించిన చివరి సినిమా జేమ్స్ తెలుగులోనూ విడుదలై మంచి వసూళ్లు సాధించింది. అయితే కన్నడలో మాత్రం పునీత్ రాజ్ కుమార్ రేంజ్ గురించి చెప్పడానికి కేవలం మాటలు సరిపోవు. ఒక్కముక్కలో చెప్పాలంటే ఇక్కడ మన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్‌లకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో అంతకు మించి కన్నడలో పునీత్ రాజ్‌కుమార్‌‌కు క్రేజ్ ఉంది. ముఖ్యంగా కన్నడ పవర్‌స్టార్‌గా పునీత్‌కు బిరుదు కూడా అభిమానులు ఇచ్చేశారు. కన్నడనాట పునీత్ చేసిన మంచి పనుల గురించి చెప్పడానికి మాటలు సరిపోవు.

సాధారణంగా పునీత్ రాజ్‌కుమార్ చాలా ఫిట్‌గా ఉంటాడు. చివరిరోజుల వరకు యోగా, వ్యాయామం చేస్తూనే వచ్చాడు. అలాగే పునీత్‌ కూడా దేహ దారుఢ్యం, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మంచి ఫిజిక్‌ను సాధించాలనే ఆసక్తే పునీత్‌ను పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ లవర్‌గా మార్చింది. జిమ్‌ వర్కవుట్‌తో పాటు క్రాస్‌ ఫిట్, మార్షల్‌ ఆర్ట్స్, యోగా వంటివి కూడా ప్రతిరోజూ తప్పనిసరిగా సాధన చేసేవారు. తరచుగా తన వర్కవుట్‌ వీడియోలను అభిమానులతో పంచుకునేవారు. పునీత్ తన తుదిశ్వాస విడిచి ముందు కూడా జిమ్‌లోనే గడిపారు. పునీత్ చివరి ఘడియలకు సంబంధించిన వీడియోలు, ట్వీట్‌లు, ఆయన ఫోటోలు ఇప్పటికీ సోషల్‌ మీడియాలో అభిమానులు షేర్ చేస్తూనే ఉన్నారు. ఇందులో పునీత్ చివరిసారిగా జిమ్ చేసిన వీడియో కూడా ఉంది. అందులో ఆయన తీవ్ర కసరత్తులు చేసినట్లు కనిపిస్తోంది. పునీత్ తన దేహధారుడ్యంపై ఎంత శ్రద్ధ వహిస్తారో ఈ వీడియో చూస్తే ఇట్టే తెలిసిపోతుంది.

పునీత్ జిమ్ చేసిన తర్వాత గుండెల్లో కొంచెం నొప్పిగా ఉందంటూ తన భార్య అశ్వినితో కలిసి ఫ్యామిలీ డాక్టర్ రమణారావు ఇంటికి బయలుదేరతాడు. సీసీటీవీ వీడియోలో పునీత్ యాక్టివ్‌గానే కనిపిస్తున్నాడు. కారు వద్దకు కూడా యాక్టీవ్‌గానే నడుస్తూ వెళ్లారు. వారి ఫ్యామిలీ డాక్టర్‌ చెక్ చేసి విక్రమ్ హాస్పిటల్‌కు తరలించారని సమాచారం. ఆ తర్వాత అక్కడ ఆస్పత్రికి వెళ్ళగానే పునీత్ మరణించినట్లు మీడియాకు సమాచారం వచ్చింది. అయితే పునీత్ కేవలం జిమ్ చేయడం వల్లే చనిపోలేదని.. అంతకుముందు రోజు రాత్రే ఆయన అస్వస్థతకు గురయ్యారని ఆయన సన్నిహితులు వివరిస్తున్నారు. అయితే జిమ్ చేసిన తర్వాత సడెన్ హార్ట్ స్ట్రోక్ రావడంతోనే ఆయన జిమ్ చేయడం వల్ల చనిపోయారని అందరూ భావిస్తున్నారని.. ఇది తప్పు అని చెప్తున్నారు. పునీత్ రాజ్‌కుమార్ లాక్‌డౌన్ సమయంలోనూ తీవ్ర కసరత్తులు చేసేవారు. వీలైనన్ని వ్యాయామాలు చేసినా రెండు నుంచి మూడు కిలోలు బరువు పెరిగానని, లాక్‌డౌన్‌ ఎత్తేయగానే తిరిగి షేప్‌ సాధించడం కోసం ఎదురు చూస్తున్నానని అప్పట్లో పునీత్ చెప్పిన మాటలు కూడా తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

పెళ్ళైన హీరో తో పబ్లిక్ గా రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన హీరోయిన్ కైరా అద్వానీ..షాక్ లో ఫాన్స్

చేసిన రెండు మూడు సినిమాలతోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోవడం అంటే మాములు విషయం కాదు..మన ఇండస…