
మంచు విష్ణు నటించిన చిత్రం 21 అక్టోబర్ నాడు ప్రేక్షకుల మందికి వచ్చింది. ఇందులో హీరోయిన్స్ గా పాయల్ రాజపుట్ మరియు సన్నీలియోనె మంచు విష్ణుకి జంటగా నటించారు .. ఈ సినిమాకి మంచు విష్ణు ప్రొమోషన్స్ బాగానే చేసినప్పటికీ ప్రేక్షకులు ఈ సినిమాకి అంతగా ఆసక్తి చూపలేదు , పాయల్ రాజపుట్ మరియు సన్నీ ఉన్నపటికీ ప్రేక్షాకులు ఈ సినిమా చూడటానికి ఇష్టపడలేదు దాని కారణం మన అందరికి తెలిసిందే మంచు ఫామిలీ మీద ఉన్న ట్రోల్ల్స్ గల కారణాలు.
సినిమా లో కంటెంట్ కూడా పెద్దగా లేదు , ఇది ఇంకో ట్రోల్ చేసే వాళ్లకి ఇంకో ప్లస్ పాయింట్ అయింది. సోషల్ మీడియాలో జిన్న మూవీ మీద భారీగా ట్రోల్ల్స్ వస్తున్నాయి. ఇది చాలదు అన్నట్లు మంచు విష్ణు దీనికి తోడుగా ఇంకో స్టేట్మెంట్ రిలీజ్ చేసాడు. ప్రమోషన్ లో భాగంగా ఒక టీవీ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇస్తూ – ” జిన్నా మూవీ హిందీలో రిలీజ్ చేసి ఉంటె ఈపాటికి 100 కోట్ల కలెక్షన్ చేసేది అని చెప్పడం జరిగింది “.
అసలు మంచు విష్ణు సినిమాలు 1 కోటి కలెక్ట్ చేయడమే గగనం అనుకుంటే 100 కోట్లు ఎలా కలెక్షన్ చేస్తుంది అని ట్రోల్ల్స్ తెగ వస్తున్నాయి. మంచు విష్ణు ఇంకా మాట్లాడుతూ – ” తన ఢీ సినిమా నుంచి తనకి హిందీ లో మార్కెట్ పెరిగింది అని ఆ సినిమాతో తనకి హిందీ లో అభిమానాలు పెరిగారు అని, మరియు దూసుకెళ్త , దేనికైనారెడీ మూవీ లతో ఒక రేంజ్ మార్కెట్ ఉంది అని చెప్పాడు . సోనీ మాక్స్ లో తన సినిమా డైనమైట్ ప్రచారం అయినప్పుడు trp బాగా వచ్చింది అని చెప్పాడు .
ఇంతే కాకుండా తన స్నేహితులు నీకు హిందీలో మార్కెట్ పెరిగింది కాబ్బటి నీ ప్రతి సినిమా హిందీలో డబ్ చేయమని చెప్తున్నారు అని చెప్పాడు. ఇక్కడ చూస్తుంటే సినిమా కి కలెక్షన్స్ సరిగా లేవు తెలుగు రాష్ట్రలో. మంచు విష్ణు సినిమాలు తీయడమే కాకుండా ప్రస్తుతం మా ప్రెసిడెంట్ గ కూడా పనిచేస్తున్నాడు . తను మాట్లాడే మాటలు ఒక హీరో మాటలు లాగ ఉండవు , ఎదో చిన్న పిల్లడు మాట్లాడుతున్నట్లు ఉంటుంది . ఇలా మాట్లాడటం ఆపితేనే తనకంటూ ఒక మంచి గుర్తింపు వస్తుంది అని నెటిజన్లు అంటున్నారు.