Home Entertainment జిన్నా మూవీ క్లోసింగ్ కలెక్షన్స్..తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న మంచు విష్ణు

జిన్నా మూవీ క్లోసింగ్ కలెక్షన్స్..తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న మంచు విష్ణు

0 second read
0
0
15,451

హిట్టు, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరించకపోయినా సినిమా మీద ఇష్టంతో మంచు కుటుంబం సినిమాలు చేస్తూనే ఉంది. కానీ మంచు కుటుంబం సినిమాలను థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడటం లేదని జిన్నా మూవీతో మరోసారి ప్రూవ్ అయ్యింది. మంచు విష్ణు నటించిన జిన్నా దీపావళి కానుకగా అక్టోబర్ 21న విడుదలైంది. అయితే ఈ సినిమా తొలిరోజే డివైడ్ టాక్ తెచ్చుకుంది. సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్ నటించడంతో వారి అందాలను వీక్షించేందుకు కోసం జిన్నా మూవీని తొలిరోజు చూసేందుకు పలువురు ఆసక్తి చూపించారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన జిన్నా మూవీకి వసూళ్లు అంతంత మాత్రంగానే వచ్చాయి.

అయితే మంచు మోహన్‌బాబు నటించిన సన్నాఫ్ ఇండియా కంటే జిన్నా ఫర్వాలేదనిపించింది.సన్నాఫ్ ఇండియా మొత్తం రూ.10 లక్షలు రాబడితే తనయుడు జిన్నా మూవీ మాత్రం ఫుల్ రన్‌లో రూ.30 లక్షలు సాధించి పరువు కాపాడుకుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా చూసుకుంటే జిన్నా మూవీ రూ.4.5 కోట్ల మేర రాబట్టాల్సి ఉంది. కానీ జిన్నా దారుణ నష్టాలను బయ్యర్లకు మిగిల్చిందని ట్రేడ్ వర్గాలు తెలియజేశాయి. కెరీర్‌లో పెద్దగా హిట్లు లేని మంచు విష్ణు దీపావళి పండగను క్యాష్ చేసుకుందామని భావించాడు. కానీ అతడి సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడలేదు. దీంతో మంచు విష్ణుకు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల కాలంలో మీడియం రేంజ్‌ హీరో సినిమా సాధించిన అత్యల్ప వసూళ్లు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

తొలిరోజు ఈ సినిమాకు కేవలం 12 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. సన్నాఫ్ ఇండియాతో పోలిస్తే బెటర్ టాక్ రావడంతో రెండో రోజు నుండి అయినా ఈ సినిమాకు కలెక్షన్స్‌లో జంప్ ఉంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేశారు.కానీ ఆ అంచనాలు కూడా ఘోరంగా విఫలమయ్యాయి. రెండో రోజు కేవలం రూ. 10 లక్షలు మాత్రమే ఈ సినిమాకు వచ్చాయి. మూడో రోజు రూ.8 లక్షలు, నాలుగో రోజు ఆదివారం కావడంతో రూ.7 లక్షలు ఈ సినిమాకు వసూలయ్యాయి. అమెరికాలో అయితే ఘోరంగా ఈ మూవీకి తొలి రెండు రోజుల్లో 150 టిక్కెట్లు మాత్రమే తెగినట్లు ప్రచారం జరిగింది. మొత్తం మీద ఈ మూవీకి నాలుగు కోట్ల రూపాయలు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జిన్నాతో పాటు వెంకటేష్ మోడ్రన్ దేవుడిగా, విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన ‘ఓరి దేవుడా’, కార్తీ ‘సర్దార్’, శివ కార్తికేయన్ హీరోగా ‘జాతి రత్నాలు’ దర్శకుడు అనుదీప్ కేవీ తీసిన ‘ప్రిన్స్’ సినిమాలు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఒక్కో సినిమాకు అటు ఇటుగా కోటి రూపాయల షేర్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే విష్ణు మంచు సినిమా కంటే తమిళ హీరోల సినిమాలకు తెలుగులో ఎక్కువ వసూళ్లు రావడం చర్చనీయాంశం అవుతోంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…