Home Entertainment ‘జిన్నా’ మూవీ క్లోసింగ్ కలెక్షన్స్ ని మొదటి రోజు భారీ మార్జిన్ తో దాటేసిన సుధీర్ ‘గాలోడు’ చిత్రం

‘జిన్నా’ మూవీ క్లోసింగ్ కలెక్షన్స్ ని మొదటి రోజు భారీ మార్జిన్ తో దాటేసిన సుధీర్ ‘గాలోడు’ చిత్రం

0 second read
0
0
168

దశాబ్దాలుగా ఇండస్ట్రీ లో అగ్ర కుటుంబాలలో ఒకరిగా కొనసాగిన మంచు మోహన్ బాబు బాక్స్ ఆఫీస్ పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది అనే విషయం మన అందరికి తెలుసు..ఇక ఆయన కొడుకుల మార్కెట్ పరిస్థితి అయితే చెప్పుకోలేని దారుణమైన స్థితి లో ఉన్నది..మంచు మనోజ్ సినిమాలు మానేసి చాలా కాలమే అయ్యింది..కానీ మంచు విష్ణు మాత్రం ‘నా సినిమాలు ఎందుకు చూడరు?..మీరు చూసే వరుకు నేను సినిమాలు తీస్తూనే ఉంటాను’ అంటూ ఆడియన్స్ మీద పగబట్టేసాడు..ఇప్పట్లో ఆయన ఆడియన్స్ మీద ప్రారంభించిన ఆ దండయాత్ర ఇప్పట్లో ఆపేలా లేదు..లేటెస్ట్ గా ఆయన యూత్ లో మంచి క్రేజ్ ఉన్నటువంటి సన్నీ లియోన్ మరియు పాయల్ రాజ్ పుట్ లను హీరోయిన్స్ గా పెట్టి తానూ హీరో గా చేసిన జిన్నా చిత్రానికి వచ్చిన వసూళ్లు చూసి ట్రేడ్ పండితుల కళ్ళు బైర్లు కమ్మిన విషయం మనకి తెలిసిందే..కనీసం సన్నీ లియోన్ కి ఇచ్చిన రెమ్యూనరేషన్ ని కూడా ఈ సినిమా వసూలు చెయ్యలేకపోయింది పాపం.

భారీ తారాగణంతో తన మార్కెట్ స్థాయికి మించి ఈ సినిమా కోసం ఖర్చు చేసి, 4 కోట్ల 50 లక్షల రూపాయలకు థియేట్రికల్ రైట్స్ అమ్మాడు మంచు విష్ణు..కానీ ఫుల్ రన్ లో ఈ చిత్రం 50 లక్షల రూపాయిల షేర్ ని కూడా వసూలు చేయలేకపోవడం శోచనీయం..ఇంత దారుణమైన పరిస్థితి మిగిలిన హీరోలకు కొనితెచ్చుకోవాలన్నా సాధ్యపడదు..అది ప్రస్తుతం మంచు కుటుంబానికి జనాల్లో ఉన్న బ్రాండ్ వేల్యూ..ఇక నిన్న జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ హీరో గా నటించిన గాలోడు మూవీ ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన సంగతి మన అందరికి తెలిసిందే..నాసిరకం ట్రైలర్ తో పెద్దగా హంగు ఆర్భాటాలు లేకుండా విడుదలైన ఈ సినిమాకి యావరేజి టాక్ మీద కూడా అదిరిపొయ్యే ఓపెనింగ్స్ రావడం విశేషం..నిన్న విడుదలైన ఈ సినిమాకి సుమారు కోటి రూపాయిల వరుకు షేర్ వసూళ్లు వచ్చాయట..ఇది నిజంగా ఎవ్వరు ఊహించని రేంజ్ అనే చెప్పాలి.

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి..ఎన్నో కష్టాలను ఎదురుకొని తన హార్డ్ వర్క్ ద్వారా బుల్లితెర పవర్ స్టార్ అనే రేంజ్ కి ఎదిగిన సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ మూవీ మొదటి రోజు కలెక్షన్స్ మంచు విష్ణు ‘జిన్నా’ మూవీ క్లోసింగ్ కలెక్షన్స్ కంటే రెండు రేట్లు ఎక్కువ వసూలు చెయ్యడం ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారిన అంశం..దశాబ్దాలుగా ఇండస్ట్రీ లో కొనసాగుతూ ఇండస్ట్రీ తామే కింగ్స్ అని డప్పులు కొట్టుకునే మంచు ఫామిలీ క్లోసింగ్ కలెక్షన్స్..సుడిగాలి సుధీర్ మొదటి రోజు కలెక్షన్స్ లో సగం అంటే ఆ కుటుంబ సభ్యులు ఇక సినిమాలు చెయ్యడం మానేస్తే బెటర్ అని ట్రేడ్ పండితులు అభిప్రాయం పడుతున్నారు..సుడిగాలి సుధీర్ కి బుల్లితెర ఆర్టిస్టుగా కోట్లలోనే ఫాన్స్ ఉంటారు..కానీ ఏ రోజు కూడా ఆయన తలపొగరు చూపించలేదు..కానీ తిప్పి కొడితే వెయ్యి మంది కూడా ఉందని ఒక అసోసియేషన్ కి ప్రెసిడెంట్ అయ్యి మంచు విష్ణు మెగాస్టార్ చిరంజీవి లాంటి లెజెండ్స్ మీదనే సెటైర్లు వేసాడు..పద్దతి మార్చుకోకపోతే మరింత నీచమైన అవమానాలు జరుగుతాయని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…