
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఇప్పుడు పవన్ కళ్యాణ్ మేనియా తో ఊగిపోతోంది..ఎక్కడ చూసిన పవర్ స్టార్ సినిమా టికెట్స్ కోసం అభిమానులు క్యూ కట్టేస్తున్నారు..అదేంటి పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి లో విడుదలైంది కదా..ఇంతలోపే మరో సినిమా కూడా విడుదల అయిపోయిందా అని అనుకునేరు..కాదండి..సెప్టెంబర్ 2 వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు అభిమానులు జల్సా సినిమాని స్పెషల్ షోస్ లాగ ప్రపంచవ్యాప్తంగా ఘనంగా వేసుకుంటున్న సంగతి మన అందరికి తెలిసిందే..కనివిని ఎరుగని రేంజ్ లో ఈ షోస్ ని అభిమానులు ప్లాన్ చేస్తున్నారు..దాదాపుగా వెయ్యి షోస్ వరుకు పడే అవకాశం ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఇదే కనుక జరిగితే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో జల్సా సినిమా ఆల్ టైం రికార్డు సృష్టించబోతోంది అనే చెప్పొచ్చు..ఈ నెల 9 వ తేదీ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా పోకిరి సినిమాని స్పెషల్ షోస్ గా వేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..ప్రపంచవ్యాప్తంగా పోకిరి సినిమాకి దాదాపుగా 375 షోస్ పడ్డాయి..ఇప్పుడు జల్సా సినిమా ఆ రికార్డుని బద్దలు కొట్టబోతుంది.
ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ అభిమానులు అసలు ప్లానింగ్ లోనే లేని తమ్ముడు సినిమాని కూడా రీ మాస్టర్ చేయించి నిన్న రాత్రి హైదరాబాద్ సిటీ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసారు..అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన నిమిషాల వ్యవధిలోనే వేలకొద్దీ టికెట్స్ అమ్ముడుపోయాయి..ఇది ఒక ఆల్ టైం రికార్డు గా చెప్పుకోవచ్చు..ఇటీవల కాలం లో స్టార్ హీరో హీరో సినిమాకి మొదటి రోజే ఈ స్థాయి బుకింగ్స్ ఎప్పుడు జరగలేదు..కానీ తమ్ముడు సినిమాకి ఆ స్థాయి బుకింగ్స్ జరుగుతున్నాయి..ఈ చిత్రానికి ఉన్న ఊపుని చూస్తుంటే దీనికి కూడా ప్రపంచవ్యాప్తంగా వందకి పైగా షోస్ పడేట్టు ఉన్నాయి అని ట్రేడ్ వర్గాల అంచనా..డిమాండ్ కొనసాగితే ఇంకా ఎక్కువ షోలు కూడా పడే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి..మరో పక్క ఎప్పటి నుండో ప్లానింగ్ లో ఉన్న జల్సా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరగనున్నాయి..ఇప్పటికే ఈ సినిమాకి ఓవర్సీస్ లో కనివిని ఎరుగని రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు అభిమానులు..అమెరికా లో ఇప్పటికే ఈ సినిమాకి ఆల్ టైం రికార్డు పడిపోయింది.
ఇక ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ కి సంబంధించిన షోస్ కి కూడా కాసేపటి క్రితమే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసారు..అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి అని ప్రకటన వచ్చినంత సమయం కూడా పట్టలేదు..బుక్ మై షో యాప్ ఓపెన్ చేసి చూడగానే టికెట్స్ అన్ని అయ్యిపోయాయి..ఈ స్థాయి డిమాండ్ ఈమధ్య కాలం లో రిలీజ్ సినిమాలకు కూడా చూడలేదంటూ ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి..ఇటీవలే విడుదలైన లైగర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడం తో లైగర్ సినిమాకి కేటాయించిన షోలు కూడా జల్సా మరియు తమ్ముడు సినిమాలకు కేటాయిస్తున్నారు..దీనితో లైగర్ కి దెబ్బతిన్న డిస్ట్రిబ్యూటర్స్ జల్సా సినిమాతో కాస్త లాభ పడేలా చూసుకుంటున్నారు..ఇక ఈ రెండు సినిమాలు ఎంత వసూళ్లను రాబట్టి సరికొత్త సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి మరి..ప్రస్తుతం నడుస్తున్న అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే జల్సా సినిమాకి 5 గ్రాస్ రూపాయిల గ్రాస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది.