Home Entertainment జపాన్ లో డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచిన #RRR..ఇప్పటి వరుకు అక్కడ ఎంత కలెక్షన్స్ వచ్చాయో తెలుసా..?

జపాన్ లో డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచిన #RRR..ఇప్పటి వరుకు అక్కడ ఎంత కలెక్షన్స్ వచ్చాయో తెలుసా..?

7 second read
0
0
4,966

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం ఈ విడుదలై సృష్టించిన ప్రభంజనం ని అంత తేలికగా ఎవరైనా మర్చిపోగలరా..? ఆయన తీసిన బాహుబలి సిరీస్ కి దేశవ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు లభిస్తే #RRR సినిమాకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని బాషలలో అద్భుతమైన గుర్తింపు దక్కించుకొని పాన్ ఇండియా సినిమా కాదు..పాన్ వరల్డ్ సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది..ఈ పాన్ వరల్డ్ గుర్తింపు OTT ద్వారానే వచ్చింది అని చెప్పాలి..బాక్స్ ఆఫీస్ పరంగా #RRR పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యినప్పటికీ బాహుబలి పార్ట్ 2 రేంజ్ హిట్ కాదు..బాహుబలి సినిమా బాక్స్ ఆఫీస్ పరంగా 2000 కోట్ల రూపాయిలు కొల్లగొడితే #RRR మాత్రం కేవలం 1200 కోట్ల రూపాయిలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది..కానీ OTT లో మాత్రం #RRR రీచ్ ముందు బాహుబలి సిరీస్ కి దక్కిన రీచ్ తుచ్ఛము అనే చెప్పాలి..ముఖ్యంగా #RRR కి నెట్ ఫ్లిక్స్ లో ఎలాంటి ఆదరణ దక్కిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కేవలం నెట్ ఫ్లిక్స్ లోనే ఈ సినిమాకి సుమారుగా వంద మిలియన్ వ్యూస్ వచ్చాయి..ఒక్క హాలీవుడ్ సినిమాలకు మినహా మిగిలిన ఏ ప్రాంతీయ బాషా చిత్రానికి కానీ, వెబ్ సిరీస్ కి కానీ ఈ స్థాయి వ్యూస్ రాలేదు..ఇతర దేశాల నుండి ప్రేక్షకులు ఎగబడి ఈ సినిమాని చూడడం వల్లే ఈ స్థాయి వ్యూస్ వచ్చాయని చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు..ఇతర దేశాల్లో ఈ సినిమాకి OTT లో వస్తున్నా ఆదరణ చూసి డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమాని జపాన్ లో విడుదల చేసాడు..ఇటీవలే ఈ చిత్రం అక్కడ భారీ విడుదల అవ్వగా..ఆ సినిమా ప్రొమోషన్స్ లో పాల్గొన్నారు..జపాన్ లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ మరియు రాజమౌళి ముగ్గురుకి కూడా అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది..అందుకే ఈ సినిమాని అక్కడి ప్రేక్షకులకు చేరువ చేసేందుకు మూవీ టీం స్పెషల్ గా ప్రొమోషన్స్ లో పాల్గొంది..మీడియా కి ఎన్నో ఇంటర్వూస్ ఇచ్చింది..అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యింది..ఈ సినిమా విడుదలైన థియేటర్స్ కి కూడా వెళ్ళింది ఈ మూవీ టీం.

అయితే ఇన్ని ప్రయత్నాలు చేసిన కూడా ఈ సినిమాకి అక్కడ మిశ్రమ ఫలితమే దక్కింది..మొదటి రోజు అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి..రెండవ రోజు మరియు మూడవ రోజు కూడా మంచి వసూళ్లనే రాబట్టింది..మొత్తం మీద మూడు రోజులకు కలిపి ఈ సినిమాకి 65 మిలియన్ల జాపనీస్ డాలర్లు వచ్చాయి..అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం కేవలం మూడు కోట్ల రూపాయిల గ్రాస్ మాత్రమే అన్నమాట..మొదటి మూడు రోజులు మంచి వసూళ్లు వచ్చినప్పటికీ నాల్గవ రోజు మాత్రం కలెక్షన్స్ బాగా పడిపోయాయి అని భోగట్టా..#RRR టీం ఇంకా జపాన్ లోనే ప్రొమోషన్స్ లో పాల్గొంటున్న నేపథ్యం లో ఇలా ఆ మూవీ రన్ వాళ్ళు అక్కడ ఉన్నప్పుడే పల్చపడడం విచారకరం అని అంటున్నారు ట్రేడ్ పండితులు..ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ సినిమాకి 200 మిలియన్ డాలర్ల లోపే వసూళ్లు ఫుల్ రన్ లో వస్తాయని తెలుస్తుంది..ఇప్పటి వరుకు మన ఇండియన్ ఫిలిమ్స్ ఇక్కడ ముత్తు సినిమాకి 400 మిలియన్ డాలర్లు వచ్చాయి..ఆ తర్వాత ఆ సినిమా వసూళ్లకు దగ్గరగా వెళ్ళింది బాహుబలి 2 మాత్రమే..సుమారుగా 300 మిలియన్ డాలర్లు ఈ చిత్రం ఇక్కడ వసూలు చేసింది..ఈ రెండు సినిమాల తర్వాత #RRR కూడా అదే రేంజ్ లో చేస్తుంది అనుకున్నారు..కానీ ఆ అవకాశాలు దాదాపుగా అసాధ్యం అని తెలుస్తుంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…