Home Entertainment జనసేన పార్టీ లోకి మంచు మనోజ్..ఏ స్థానం నుండి పోటీ చెయ్యబోతున్నాడో తెలుసా..?

జనసేన పార్టీ లోకి మంచు మనోజ్..ఏ స్థానం నుండి పోటీ చెయ్యబోతున్నాడో తెలుసా..?

0 second read
0
0
361

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఊపు మాములుగా లేదు..రాష్ట్రం లో జరిగే సమస్యలన్నిటినీ ప్రతిపక్ష హోదా లో ఉన్న టీడీపీ పార్టీ కంటే జనసేన పార్టీ నే బాగా ప్రాజెక్ట్ చేస్తుంది..ఆశావహులు కూడా పవన్ కళ్యాణ్ తో కలిసి రాజకీయ ప్రయాణం చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు..టీడీపీ మరియు వైసీపీ పార్టీల నుండి ఎంతో మంది సీనియర్ నాయకులూ పవన్ కళ్యాణ్ తో చాలా కాలం నుండి టచ్ లో ఉన్నారు..అయితే వీరిలో ఎలాంటి పరిస్థితులు వచ్చిన జనసేన పార్టీ ని వీడకుండా ఉండే వాళ్ళని పవన్ కళ్యాణ్ ఎంచుకోబోతున్నాడు..రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ త్వరలో చేపట్టబోయ్యే బస్సు యాత్ర సమయం లో వీళ్ళందరూ జనసేన పార్టీ లో చేరబోతున్నట్టు రాజకీయ వర్గాల్లో సాగుతున్న చర్చ..ఇదంతా పక్కన పెడితే మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ కి పవన్ కళ్యాణ్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే.

ఈ విషయాన్నీ పలు ఇంటర్వూస్ తో పాటు సోషల్ మీడియా లో కూడా పలు సందర్భాలలో తెలిపాడు మనోజ్..పవన్ కళ్యాణ్ తో ఒకసారి ప్రత్యేమైన చర్చ కూడా చేసాడు..లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే అతి త్వరలోనే మనోజ్ జనసేన పార్టీ లో చేరబోతున్నాడని తెలుస్తుంది..తిరుపతి నియోజకవర్గం నుండి ఆయన MLA గా పోటీ చెయ్యబోతున్నట్టు తెలుస్తుంది..మోహన్ బాబు కుటుంబం మొదట్లో టీడీపీ కి అనుకూలంగా ఉండేది..ఆ తర్వాత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి హయం వచ్చాకా ఆయన వెంటే నడిచారు..ఆయన తదనంతరం వైసీపీ పార్టీ కి మద్దతుగా నిలిచారు..2019 ఎన్నికలలో వైసీపీ పార్టీ తరుపున మోహన్ బాబు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించాడు కూడా..కానీ ఆ తర్వాత మోహన్ బాబు కి వైసీపీ పాలన నచ్చలేదు..ఇటీవలే చంద్ర బాబు నాయుడు తో మీటింగ్ కూడా పెట్టాడు..అది కేవలం మీటింగ్ మాత్రమే కానీ అధికారికంగా ఆ పార్టీ లో చేరలేదు.

అయితే ఇప్పుడు మంచు మనోజ్ జనసేన పార్టీ వైపు చూస్తుండడం తో మోహన్ బాబు కూడా పవన్ కళ్యాణ్ తో చేతులు కలపబోతున్నాడా అనేది ఇప్పుడు పెద్ద చర్చ..ఇది ఇలా ఉండగా గత కొద్దీ రోజుల నుండి మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా చర్చలు జరపబోతున్నారంటూ వార్తలు వినిపించాయి..మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా మంచు విష్ణు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే..అలా మంచు కుటుంబం మొత్తం ఇప్పుడు జనసేన పార్టీ వైపు చూస్తుందా అనేది పెద్ద చర్చ..అంతే కాకుండా పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ నుండి కూడా ఈసారి ఫుల్లుగా సపోర్టు దక్కనుంది..అగ్ర
హీరోలందరూ కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్టుగా నిలవబోతున్నట్టు తెలుస్తుంది..వారిలో రామ్ చరణ్ , అల్లు అర్జున్ ఎలాగో ఉంటారు..వీళ్ళతో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా బహిరంగంగా తమ్ముడి కోసం రంగం లోకి దిగబోతున్నట్టు తెలుస్తుంది..అలా పవన్ కళ్యాణ్ కి రోజు రోజు మద్దతు అటు రాజకీయ ప్రముఖుల నుండి ఇటు సినీ ప్రముఖుల నుండి పెరుగుతూ పోతుంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

బ్రేకింగ్ : శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తో విజయ్ దేవరకొండ పెళ్లి..వైరల్ అవుతున్న ఫోటోలు

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు చాలా క్రేజ్ ఉంది. ఇటీవల లైగర్ సినిమాతో బాలీవుడ్‌లోనూ ప…