
తెలంగాణ వచ్చినప్పటి నుండి ఆ ప్రాంతం లో రాజకీయపరం గా తెరాస పార్టీ ఎంత బలమైన శక్తిగా తయారు అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, 2014 మరియు 2019 సార్వత్రిక ఎన్నికలలో తెరాస పార్టీ కి అసలు తిరుగేలేకుండా పోయింది, అయితే ఈ సంవత్సరం లో తెరాస స్పీడ్ కి బ్రేకులు పడినట్టు తెలుస్తోంది, ఈసారి రాబొయ్యే సార్వత్రిక ఎన్నికలు గతం లో లాగ తేలికగా ఉండనట్లు ఇటీవల వచ్చిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు చూస్తే అర్థం అవుతుంది, అనూహ్యంగా బీజేపీ పార్టీ ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో ఒక్క ప్రభంజనం సృష్టించింది అనే చెప్పాలి, 2016 గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో కేవలం నాలుగు స్థానాలకే పరిమితం అయినా బీజేపీ పార్టీ ఈసారి జరిగిన ఎన్నికలలో ఏకంగా 51 సీట్లు కైవసం చేసుకొని తెరాస పార్టీ కి ఊహించని షాక్ ని ఇచ్చింది, 2016 ఎన్నికలలో 91 సీట్లు కైవసమా చేసుకున్న తెరాస పార్టీ ఈసారి 56 సీట్లు అతి కష్టం మీద గెలుచుకుంది, కూకట్పల్లి లో స్థిరపడిన ఆంధ్ర సెటైలర్స్ ఓట్లు లేకపోతే తెరాస పార్టీ కి బీజేపీ చేతిలో ఘోరమైన పరాభవం ఎదురు అయ్యేది అనే చెప్పొచ్చు.
ఇక బీజేపీ పార్టీ తెలంగాణ గ్రేటర్ ఎన్నికల పై ఈ స్థాయి ప్రభావం చూపడం పట్ల ఆ పార్టీ రాష్ట్ర అద్యక్ష్యుడు బండి సంజయ్ హర్షం వ్యక్తం చేసాడు, ఆయన మాట్లాడుతూ ‘ బీజేపీ పార్టీ కి ఈ స్థాయిలో ఓట్లు వేసి గెలిపించిన హైదరాబాద్ వాసీయులకు చేతులెత్తి దండం పెడుతున్నాను, ఈ రోజు బీజేపీ పార్టీ కి ఈ స్థాయి లో విజయం వచ్చింది అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల ప్రజలకు ఏ స్థాయి విశ్వాసం ఉందొ చెప్పకనే చెప్తోంది, బీజేపీ పార్టీ గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు ఈ సందర్భంగా కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను, ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి మరియు జనసైనికులకు ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అభ్యర్థులను పోటీ నుండి తప్పించకపోయి ఉంటే ఈరోజు బీజేపీ కి ఈ స్థాయి విజయం లభించేది కాదు,తెలంగాణ లో బీజేపీ మరియు ఆంధ్ర ప్రదేశ్ లో జనసేన పార్టీలు తిరుగులేని శక్తులుగా ఎదగబోతున్నాయి, భవిష్యత్తులో మా ఇద్దరి కలయిక తో నరేంద్ర మోడీ గారి విజన్ ని జనల ముందుకి తీసుకొని పొయ్యేందుకు కృషి చేస్తాము’ అంటూ బండి సంజయ్ ఈ సందర్భంగా తెలిపాడు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత జనాల్లో అదే స్థాయిలో ఉత్కంఠ కలిగించబోతున్న ఎన్నికలు తిరుపతి పార్లమెంటరీ ఉపఎన్నికలు, వైస్సార్సీపీ పార్టీ నుండి ఎంపీ గా ఎన్నిక అయినా బల్లి దుర్గ ప్రసాద్ రావు గారి ఇటీవలే మరణించడం తో ఆ స్థానం ఖాళి అవ్వడం వల్ల త్వరలోనే అక్కడ ఉపఎన్నికలు జరగబోతున్నాయి, ఈ ఎన్నికలకు వైస్సార్సీపీ , టీడీపీ మరియు జనసేన/బీజేపీ పార్టీలు హోరాహోరీగా తలపడనున్నాయి, అయితే వైస్సార్సీపీ పార్టీ నుండి ఎవరు పోటీ చేస్తారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉండగా, తెలుగుదేశం పార్టీ నుండి పనబాక లక్ష్మి పోటీ చెయ్యడానికి సిద్ధం గా ఉన్నది, ఇక బీజేపీ మరియు జనసేన పార్టీలలో ఎవరు తిరుపతి బై ఎలేచ్షన్స్ ఎన్నికలలో పోటీ చేస్తారు అనేది ఆసక్తికరం గా మారింది, ఇందుకోసం ఇటీవల బీజేపీ /జనసేన పార్టీ కూటమిల ద్వారా సమన్వయ కమిటీ వేశారు, ఈ కమిటీ ఇచ్చిన రిపోర్టు ద్వారా ఎవ్వరు పోటీ చెయ్యాలి అనేది నిశ్చయం అవుతుంది, ఏది ఏమైనా తిరుపతి ఉప ఎన్నికలు చాలా రసవత్తరంగా జరగబోతుంది.