
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు..శత్రువులు ఉండరనీ అంటూ ఉంటారు..అది రీసెంట్ గా జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే ఎంత వాస్తవమో అర్థం అవుతుంది..సినీ రంగం లో ఉన్నన్ని రోజులు పవన్ కళ్యాణ్ కి ప్రాణ స్నేహితుడిగా చలామణి అవుతూ వచ్చిన కమెడియన్ అలీ రాజకీయాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ కి దూరం గా వైసీపీ పార్టీ లో చేరడం అప్పట్లో ఎంతటి దుమారం రేపిందో మన అందరికి తెలిసిందే..పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల ప్రచారం లో ఈ విషయంపై స్పందిస్తూ ఎంతో బాధపడుతూ మాట్లాడుతాడు.
దానికి అలీ చాలా పొగరుగా కౌంటర్ ఇవ్వడం అభిమానులకు చిర్రెత్తేలా చేసింది..అలా స్నేహితుడిని అని చెప్పుకొని తిరుగుతూ మొదటి సినిమా నుండి కాటమరాయుడు వరకు విరామం లేకుండా పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేసిన అలీ, ఇలా కష్టసమయం లో స్నేహితుడికి అండగా నిలబడకపోవడం నిజంగా శోచనీయం./అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత అలీ పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్ గా మాట్లాడుతూ వచ్చాడు..ఆయనతో కలిసి త్వరలో ఒక సినిమా చేయబోతున్నాను అంటూ అనేక ఇంటర్వూస్ లో కూడ తెలిపిన సందర్భాలు ఉన్నాయి..అలీ కామెంట్స్ చూసి వీళ్లిద్దరి మధ్య సఖ్యత కుదిరిందని అందరూ అనుకున్నారు..కానీ అలాంటిదేమి జరగలేదని ఈరోజు అలీ చేసిన కామెంట్స్ చూస్తే అర్థం అవుతుంది.
ఒక మీడియా రిపోర్టర్ అలీ ని ప్రశ్న అడుగుతూ ‘పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసే అవకాశం వస్తే చేస్తారా’ అని అడగగా అలీ దానికి సమాధానం చెప్తూ ‘తప్పకుండా చేస్తాను..సీఎం ఆదేశిస్తే ఏ స్థానం నుండి పోటీ చేయడానికైనా నేను సిద్ధం’ అంటూ అలీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనం గా మారింది..పవన్ కళ్యాణ్ అభిమానులకు నషాలంకి అంటుకునేలా చేసింది ఆ కామెంట్స్..మరి దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తాడో లేదో చూడాలి.