
ఇటీవల విడుదలైన విజయ్ దేవరకొండ పాన్ ఇండియన్ బిగ్ బడ్జెట్ మూవీ లైగర్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద సెన్సషనల్ డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచిందో మన అందరికి తెలిసిందే..విడుదలకి ముందు భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మొదటి రోజు మొదటి ఆట నుండే డిజాస్టర్ ఫ్లాప్ టాక్ ని తెచ్చుకుంది..ఈ సినిమాకి ముందు నుండి ఉన్న క్రేజ్ వల్ల ఓపెనింగ్స్ అయితే బాగానే వచ్చాయి కానీ ఫుల్ రన్ లో మాత్రం అతి దారుణమైన ఫ్లాప్ గా నిలిచింది..ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 90 కోట్ల రూపాయలకు జరుపుకున్న ఈ చిత్రం ఫుల్ రన్ లో కనీసం 20 కోట్ల రూపాయిలు షేర్ కూడా వసూలు చెయ్యలేకపోయింది అంటే ఈ చిత్రం ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అనేది అర్థం చేసుకోవచ్చు..వారం రోజులు కాకముందే ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలలో ఈ సినిమాని థియేటర్స్ నుండి తీసి వేసి పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా వేస్తున్న తమ్ముడు మరియు జల్సా సినిమా స్పెషల్ షోస్ ని వేసుకుంటున్నారు.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి ఛార్మి మరియు పూరి జగన్నాథ్ నిర్మాతలకు గా వ్యవహరించిన సంగతి మన అందరికి తెలిసిందే..లైగర్ సినిమా విడుదలకు ముందు ఛార్మి ఒక ఇంటర్వ్యూ లో ఎంతో ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఈ సినిమాని ఎంత కస్టపడి నిర్మించాము అనేది చెప్పుకొచ్చింది..లాక్ డౌన్ సమయం లో చేతిలో రూపాయి కూడా లేదని..ఆ సమయం లో నాకు లైగర్ మూవీ ని OTT కి 200 కోట్ల రూపాయలకు డైరెక్ట్ గా ఇచ్చేయాలంటూ ఒక ప్రముఖ OTT సంస్థ భారీ ఆఫర్ ఇచ్చిందని..కానీ ఇది థియేటర్ సినిమా..థియేటర్స్ లోనే ప్రేక్షకులు చూడాలి కాబట్టి అంత కష్ట సమయం లో అంత పెద్ద ఆఫర్ ని కూడా వదులుకున్నాను అంటూ ఛార్మి ఎమోషనల్ గా మాట్లాడింది..ఆమె ఆ రేంజ్ లో మాట్లాడేసరికి ఈ సినిమా నిజంగానే అద్భుతంగా వచ్చిందేమో అని అనుకున్నారు ప్రేక్షకులు..కానీ తీరా థియేటర్స్ కి వెళ్లి సినిమా చూసిన వారికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది అనే చెప్పాలి.
అటు పూరి జగన్నాథ్ కి కానీ..ఇటు ఛార్మి కి కానీ ఎన్నో సినిమాలు చేసిన అనుభవం ఉంది..కానీ ఇంత అనుభవం ఉన్నప్పటికీ కూడా వీళ్లిద్దరు ఒక సినిమాని సరిగ్గా జడ్జి చేయలేకపోవడం అంటే నిజంగా బాధాకరం అనే చెప్పాలి..సినిమా సెకండ్ హాఫ్ అంత దరిద్రం గా ఉంది అని తెలిసి కూడా ఈ చిత్రం థియేటర్స్ లో ఆడుతుంది అని ఆమె ఎలా అనుకుందో అని నెటిజెన్ల ఆశ్చర్యపోతున్నారు..గతం లో వీల్లిదరి కలిసి నిర్మించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద పల్టీలు కొట్టినవే..ఒక్క ఇస్మార్ట్ శంకర్ సినిమా హీరో రామ్ డాన్స్ మరియు మణి శర్మ మ్యూజిక్ వల్ల ఆడేసింది..అయితే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ఆ సినిమాలన్నీ లైగర్ లాంటి టేకింగ్ వల్లే డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి..ఒకసారి తప్పు జరిగింది అని తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ అదే తప్పే ఎలా చెయ్యగల్తున్నారు అంటూ అభిమానులు వాపోతున్నారు..అసలు వాళ్ళు చేసిన తప్పుల నుండి ఏమైనా నేర్చుకున్నారా..లేదా వాళ్ళు చేసింది నిజంగా తప్పు కాదు కరెక్ట్ అనుకుంటున్నారా..ఒకవేళ అదే మైండ్ సెట్ తో ఉంటె మాత్రం ఏదైనా మంచి హాస్పిటల్ లో చూపించుకోడం బెటర్ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.