
మన మైండ్ లో కొన్ని పాత్రలు ఎప్పటికి గుర్తుండిపోతాయి..పలానా ఆర్టిస్ట్ చేసింది అతి తక్కువ సినిమాలే అయ్యినప్పటికీ కూడా వారు పోషించిన పాత్రల ద్వారా ఎప్పటికి చిరస్థాయిగా గుర్తుండిపోతారు..అలాంటి పాత్రలు ఛత్రపతి సినిమాలో చాలానే ఉంటాయి..దర్శక ధీరుడు రాజమౌళి మరియు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన మొట్టమొదటి సినిమా ఇది..ఈ సినిమా ద్వారానే ప్రభాస్ మాస్ హీరో గా ఎదిగాడు..స్టార్ గా అవతరించాడు..ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఇప్పటి వరుకు ఎవ్వరు తియ్యలేదు అనే చెప్పాలి..రాజమౌళి ఈ యాక్షన్ సన్నివేశాలను తీర్చి దిద్దిన తీరు అమోఘం..ఆయనని స్టార్ డైరెక్టర్ గా వేరే లెవెల్ కి తీసుకెళ్లింది ఈ సినిమా..ముఖ్యంగా ఛత్రపతి సినిమాలో కాట్ రాజ్ ని చంపే సన్నివేశం సినిమాకి ఎంత పెద్ద హైలైట్ గా నిలిచిందో మన అందరికి తెలిసిందే..అప్పటి వరకు విలన్స్ కింద బానిస లాగ తనవాళ్ల కోసం తగ్గుతూ భరించిన ప్రభాస్ ఈ సన్నివేశం తర్వాత ఛత్రపతి గా అవతరిస్తాడు.
ఈ సన్నివేశం కి లీడ్ కాట్ రాజ్ సూరీడు అనే కుర్రాడిని చావబాదడం వల్ల మొదలవుతుంది..తన తల్లిని తీసుకొని ఊరుకి వెళ్లిపోతున్నా అనందం లో ఉన్న ఆ కుర్రాడిని కాట్ రాజ్ ఎక్కడికిరా పోతున్నావ్..బండెక్కు అంటాడు..మా అమ్మని ఇంటి దగ్గర వదిలి వచ్చేస్తాను అండీ అంటూ ఎంతో దీనంగా అడుగుతాడు..ఆ కుర్రాడు అలా అడిగేసరికి చూసే ప్రేక్షకులకు కంటతడి రాక మానదు..అంత అద్భుతంగా ఆ పిల్లాడు ఆ సన్నివేశం ని రక్తికట్టిస్తాడు..ఎంత బ్రతిమిలాడినా వదలకపోవడం తో ఆ కుర్రాడు కాట్ రాజ్ చేతిని కొరికి పరిగిస్తాడు..అప్పుడు కాట్ రాజ్ వెర్రెత్తి పొయ్యి తన దగ్గరున్న ఐరన్ రాడ్ ఆ కుర్రాడి తలపై విసురుతాడు..ఆ ఐరన్ రాడ్ తగలగానే క్రింద పడిపోయి చావు బ్రతుకుల మధ్య కొన ఊపిరి తో కొట్టుమిట్టాడుతుంటాడు..అప్పుడు ‘సూరీడు..ఓ సూరీడు..ఎక్కడున్నావ్ రా..అవతల బస్సు కి యాలవుతుంది..సూరీడు’ అంటూ ఆ తల్లి పిలుస్తూ ఉండడం చూస్తే కంటతడి పెట్టక తప్పదు..ఆ సన్నివేశం ని కానీ..ఆ సన్నివేశం లో నటించిన సూరీడు ని కానీ ప్రేక్షకులు ఇప్పటికి మర్చిపోలేదు.
ఇంతకీ ఆ సూరీడు పాత్ర పోషించిన పిల్లాడి పేరు భాస్వంత్..ఈ సినిమా కి ముందు ఈ సినిమాకి తర్వాత ఈ కుర్రాడు చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించాడు..కానీ బాగా పేరు వచ్చింది మాత్రం ఛత్రపతి సినిమాలో పోషించిన సూరీడు పాత్రే..ఇప్పటికి ఇతనిని చూస్తే సూరీడు పాత్రనే గుర్తుకు వస్తుంది..ఇప్పుడు ఈ కుర్రాడు విదేశాలలో చదువులు పూర్తి చేసుకొని ఇండియా కి తిరిగి వచ్చాడు..సినిమాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు..అసలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయన ఈ కుర్రాడి ఫోటో ఎక్సక్లూసివ్ గా మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి..ఛత్రపతి సినిమాలో తనకి తల్లిగా నటించిన అనిత గారితో సెల్ఫీ దిగుతూ ఇతను సోషల్ మీడియా లో పెట్టిన పోస్టులు తెగ వైరల్ గా మారాయి..మరి చైల్డ్ ఆర్టిస్టు గా అంత గుర్తింపు ని సంపాదించిన ఈ కుర్రాడు..ఇప్పుడు హీరో గా రాణిస్తాడా..లేదా క్యారక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతాడా అనేది చూడాలి.
1
2
3