
మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ తీరు ఎలా ఉందొ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..ఇన్ని సంవత్సరాల రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులను మనం చూసాము..కానీ ఒక్క ముఖ్యమంత్రి పాలనలో కూడా ప్రజలు ఇన్ని కష్టాలు ఎదురుకున్నట్టు దాఖలాలు లేవు..ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుండి సామాన్యుల వరకు ప్రతీ ఒకరు కష్టాలను ఎదురుకుంటూనే ఉన్నారు..చివరికి ప్రైవేట్ సెక్టార్ రేంజ్ లో వచ్చే సినీ పరిశ్రమ కూడా ఇలాంటి సమస్యలను ఎదురుకుంటుంది..పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రం దగ్గర నుండి ఆంధ్ర ప్రదేశ్ లో సినిమాలకు గడ్డుకాలం ఎదురైంది..ఈ సినిమా విడుదల సమయం లో ప్రభుత్వం టికెట్ రేట్స్ తగ్గించాలి మరియు బెన్ఫిట్ షోస్ క్యాన్సిల్ చెయ్యాలి అంటూ ఉత్తర్వులు జారీ చేసింది..సరికొత్త జీవో ని ప్రవేశ పెట్టింది..అప్పుడు ప్రవేశ పెట్టిన జీవో గత ఏడాది ప్రారంభం వరకు కొనసాగుతూనే ఉన్నింది.
మధ్యలో వచ్చిన పెద్ద స్టార్ హీరోల సినిమాలైనా అఖండ , పుష్ప మరియు భీమ్లా నాయక్ చిత్రాలు ఈ జీవో వల్ల కోట్ల రూపాయిలు నష్టపోయాయి..కొన్ని సినిమాలు అయితే ఆ జీవో రేట్స్ మీద థియేటర్స్ లోకి రావడం కంటే ఓటీటీ లో నేరుగా విడుదల చేసుకోవడం బెటర్ అని భావించి చాలా సినిమాలు ఓటీటీ లో నేరుగా విడుదలయ్యాయి..అలాంటి సంక్షోభం ఎదురుకుంటున్న సమయం లో ఇండస్ట్రీ పెద్దగా మెగాస్టార్ చిరంజీవి చొరవ తీసుకొని ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యి ఒక శాశ్వత జీవో ని తీసుకొచ్చారు..సింగల్ స్క్రీన్స్ లో 145 రూపాయిలు..మల్టిప్లెక్స్ స్క్రీన్స్ లో 175 రూపాయలకు పెంచుతూ జీవో ని విడుదల చేసింది..భారీ బడ్జెట్ సినిమాలకు అయితే పది రోజుల పాటు టికెట్ రేట్స్ అదనంగా 45 నుండి 50 రూపాయలకు పెంచుకోవచ్చని ..కాకపోతే ముందుగా ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటే పారితోషికం మినహాయించి వంద కోట్ల రూపాయిలు బడ్జెట్ దాటినా సినిమాలకు..మరి 20 శాతం ఆంధ్ర ప్రదేశ్ లో షూటింగ్ జరుపుకుంది లేదా అనే విషయాలను పరిశీలించి టికెట్ రేట్స్ ఇస్తాము అంటూ చెప్పుకొచ్చింది.
ఇచ్చిన మాట ప్రకారమే #RRR , ఆచార్య మరియు సర్కారు వారి పాట వంటి సినిమాలకు టికెట్ రేట్స్ పెంచుకోవచ్చని అనుమతిని ఇచ్చింది ప్రభుత్వం..కానీ మరో రెండు మూడు రోజుల్లో విడుదల అవ్వబోతున్న మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ మరియు నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ సినిమాలకు మాత్రం టికెట్ రేట్స్ పెంచే ఛాన్స్ లేదని తెలుస్తుంది..ముందుగా ఈరోజు ఉదయం టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతిని ఇస్తున్నట్టు ఒక వార్త బయటకి వచ్చింది..కానీ చివరి నిమిషం లో ఎందుకో నిరాకరించినట్టు తెలుస్తుంది..ఈరోజు అర్థరాత్రి వరకు చూసి టికెట్ రేట్స్ పెంచకపోతే మాములు రేట్స్ తోనే రేపు ఆంధ్ర ప్రదేశ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభిస్తారని తెలుస్తుంది..ఇప్పటికీ టికెట్ రేట్స్ వస్తుందనే ఆశతోనే ఎదురు చూస్తుంది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ..ప్రభుత్వం తో చర్చలు జరుపుతూనే ఉన్నారు..చూడాలి ఎం అవ్వుద్దో.