Home Movie News చిరంజీవి రికార్డ్స్ ని ముట్టుకోలేకపోతున్న నేటి తరం స్టార్ హీరోలు

చిరంజీవి రికార్డ్స్ ని ముట్టుకోలేకపోతున్న నేటి తరం స్టార్ హీరోలు

0 second read
0
0
2,180

4 దశాబ్దాల పాటు తెలుగు చిత్ర సినిమా ని శాసించిన మెగాస్టార్ చిరంజీవి గారు 9 సంవత్సరాలు గ్యాప్ వచ్చినప్పటికీ 2017 లో రిలీజ్ అయినా ఖైదీ నెంబర్ 150 సినిమా తో రీ ఎంట్రీ తో తన సత్తా ఏంటో చాటాడు. ఇప్పటి తరం హీరోస్ అయినా మహేష్ బాబు ,పవన్ కళ్యాణ్ ,జూనియర్ ఎన్టీఆర్ ,రామ్ చరణ్ ,అల్లు అర్జున్ ,ప్రభాస్ లాంటి వారికి పోటీగా చిరంజీవి గారి సినిమా లు కలెక్షన్స్ ని సాధిస్తున్నాయి,అయితే ఈ మధ్య కాలం లో రిలీజ్ అయినా తన 5 సినిమా ల లో ఖైదీ నెంబర్ 150 ,వాల్తేర్ వీరయ్య మినహా మిగితావి ఆశించిన స్థాయి లో అలరించలేకపోయాయి,అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లనే అందుకున్నాయి, గడిచిన 5 సినిమాల నెట్ కలెక్షన్స్ ఎంతో ఇప్పుడు చూద్దాం.

1 .ఖైదీ నెంబర్ 150
చిరంజీవి గారి రీ ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా ,తమిళ్ లో సూపర్ హిట్ అయినా విజయ్ గారి ‘కత్తి’ కి రీమేక్ , వి వి వినాయక్ గారి డైరెక్షన్,రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ,చిరంజీవి గారి వింటేజ్ డాన్సస్ ల తో సినిమా మంచి కమర్షియల్ హిట్ గ నిలిచింది. బాలయ్య బాబు గారి 100 వ సినిమా అయినా ‘గౌతమి పుత్ర శాతకర్ణి ‘ తో పోటీ గా రిలీజ్ అయినా ‘ఖైదీ నెంబర్ 150 ‘ బాక్స్ ఆఫీస్ దగ్గర 104 .60 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది.

2 .సైరా
మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పటి నుంచే తీయాలి అనుకుంటూ వస్తున్న సినిమా ‘సైరా నరసింహారెడ్డి ‘ ఇది మొదటి స్వతంత్ర సమరయోధుడు అయినా ‘ఉయ్యాల వాడ నరసింహ రెడ్డి ‘ గారి చరిత్ర ఆధారం గా తీసిన పాన్ ఇండియా సినిమా .ఇందులో అమితాబ్ బచ్చన్ ,సుదీప్ ,విజయ్ సేతుపతి ,జగపతి బాబు లాంటి స్టార్స్ నటించారు. సినిమా తెలుగు రాష్ట్రా ల లో మంచి విజయం సాధించినప్పటికీ హిందీ ,తమిళ్ ,కన్నడ ,మలయాళం లో సరిగా ఆడలేదు ,దానికి తోడు బడ్జెట్ ఎక్కువ అవ్వడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర అవేరేజ్ గా నిలిచినప్పటికీ ‘143 .80 ‘ కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టింది.

3 .ఆచార్య
వరుసగా 4 బ్లాక్ బస్టర్స్ సాధించి ఉన్న డైరెక్టర్ కొరటాల శివ గారి డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి గారు ,రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా భారీ అంచలన నడుమ రిలీజ్ అయ్యి పరాజయం అయింది. మణిశర్మ గారి సంగీతం తప్ప మిగిలినవి ఆకట్టుకోలేకపోయాయి. చిరంజీవి గారి కెరీర్ లో అతి పెద్ద పరాజయం గా నిలిచింది , మొదటి వారం సాధించిన కలెక్షన్స్ ఏ ఫుల్ రన్ కలెక్షన్స్ గా నిలిచాయి అంటే ఎంత పెద్ద డిసాస్టర్ లో అర్ధం అవుతుంది. అంత పెద్ద ప్లాప్ అయినప్పటికీ కూడా ’48 .36 ‘ కోట్లు సాధించింది.

4 .గాడ్ ఫాదర్
ఆచార్య సినిమా పరాభవం నుంచి బయట నుంచి రావడానికి మలయాళం లో ఇండస్ట్రీ హిట్ అయినా మోహన్ లాల్ గారి ‘లూసిఫర్’ ని తెలుగు లో కి ‘గాడ్ ఫాదర్ ‘ గా రీమేక్ చేసారు ,తక్కువ బడ్జెట్ తో తీసినప్పటికి సరి అయినా పబ్లిసిటీ లేకపోవడం తో సినిమా కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ మాత్రం ఆ స్థాయి లో రాబట్టలేకపోయింది. ఈ సినిమా లో ఫుల్ రన్ లో 59 .38 కోట్లు కలెక్ట్ చేసింది.

5 .వాల్తేర్ వీరయ్య
వరుసగా 3 సినిమా లు ఆశించిన స్థాయి లో ఆడకపోవడం ,దానికి తోడు రీమేక్ లు తీస్తున్నారు అని విపరీతమై ట్రోల్ల్స్ మధ్య తన వీర అభిమాని అయినా ‘బాబీ ‘ తో వాల్తేర్ వీరయ్య ని చేసారు చిరంజీవి గారు .రవి తేజ గారి మాస్ యాక్టింగ్,దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీతం, బాబీ గారి డైరెక్షన్ వీటి అన్నిటికి మించి మెగాస్టార్ గారి వింటేజ్ యాక్టింగ్ తో సంక్రాంతి కి రిలీజ్ అయినా వాల్తేర్ వీరయ్య సెన్సషనల్ హిట్ అయింది. అందులోను ఫెస్టివల్ సీజన్లో కావడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపింది. దాంతో చిరంజీవి గారి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ల లో ఒకటి గా నిలిచి ‘137 .85 ‘ కోట్లు కలెక్ట్ చేసింది. అయితే రిలీజ్ అయినా 5 సినిమాలు కలిసి టోటల్ గా ‘493 .99 ‘ కోట్లు కలెక్ట్ చేయగా అవేరేజ్ గా ఒక్కో సినిమా కి ’98 .79 ‘ కోట్లు కలెక్ట్ చేసింది. ఈ లెక్కన ఇప్పుడు ఉన్న హీరోస్ అందరికి మెగాస్టార్ చిరంజీవి గారు పోటీ కాదు అని తనకి తానే పోటీ అని చెప్పకనే చెప్పారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Movie News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…